BigTV English

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌

BC Reservations: స్థానిక సంస్థల ఎన్నికల్లో.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌

BC Reservations: తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల అమలు అంశం.. రాష్ట్ర రాజకీయాల్లో ఇప్పటికే ఉన్న వేడిని మరింత పెంచింది. విద్య, ఉద్యోగాలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు.. తెలంగాణ క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఇప్పటికే.. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే.. బిల్లుల్ని.. అసెంబ్లీ ఆమోదించింది. ఇటీవలే.. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి.. హైకోర్టు ఈ నెలాఖరులోపు రిజర్వేషన్లు ఖరారు చేయాలని.. ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో.. లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం.


ఇందుకు సంబంధించిన బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్ర కేబినెట్ మీటింగ్ అనంతరం ఈ విషయాన్ని మంత్రి పొంగులేటి మీడియాకు తెలిపారు. ఆర్డినెన్స్ ద్వారా రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించినట్లు చెప్పారు. చట్ట సవరణకు కావాల్సిన అన్ని చర్యలను రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుందన్నారు. ఎలాంటి ఆటంకాలు లేకుండా న్యాయపరమైన చిక్కులు రాకుండా రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధితో నిర్ణయం తీసుకున్నామన్నారు. మంత్రి వర్గ సమావేశంలో చర్చించిన అంశాలను ఆయన మీడియాకు వివరించారు. గత 18 కేబినెట్ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాల్లో 96 శాతం అమలు చేశామన్నారు.

బీసీ రిజర్వేషన్లు ఖరారు చేసేందుకు.. గ్రామ పంచాయతీ సర్పంచ్, ఎంపీటీసీ సభ్యులకు మండలం, ఎంపీపీ, జడ్పీటీసీ సభ్యులకు జిల్లా, జడ్పీ ఛైర్మన్లకు రాష్ట్రాన్ని.. యూనిట్‌గా పరిగణిస్తారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా పంచాయతీరాజ్ చట్టం-2018కి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ తేవాలని క్యాబినెట్ నిర్ణయించింది. అయితే.. ఆర్డినెన్స్ ఇచ్చిన ఒక్క రాష్ట్రంలోనూ రిజర్వేషన్లు అమలు కాలేదనే వాదన వినిపిస్తోంది. చట్టబద్ధత లేని ఆర్డినెన్స్‌లు.. కోర్టుల్లో నిలబడవని తెలిసినా.. ప్రభుత్వం మొండిగా ముందుకెళ్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.


Also Read: రాముడి జ‌న్మ‌స్థ‌లం అయోధ్య కాదా? నేపాల్‌లో జ‌న్మించారా.. వాల్మీకి రామాయణం ఏం చెబుతుంది

మరోవైపు.. బీసీ రిజర్వేషన్ల అంశంలో బీఆర్ఎస్‌లోనే భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. మిగతా బీఆర్ఎస్ నేతలంతా.. ఆర్డినెన్స్‌ తీసుకురావటాన్ని వ్యతిరేకిస్తుంటే.. ఎమ్మెల్సీ కవిత మాత్రం.. 42 శాతం రిజర్వేషన్ల అమలుని స్వాగతిస్తున్నారు. ఇది తన విజయమేనని కవిత చెబుతున్నారు. జాగృతి కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. దాంతో.. ఈ విషయంలో ఎవరు కరెక్ట్ అనే విషయంపై.. బీఆర్ఎస్ కార్యకర్తల్లో సందిగ్ధత నెలకొంది. మరి.. బీసీ రిజర్వేషన్లకు సంబంధించి.. ఆర్డినెన్స్ ఎప్పుడు తెస్తారు? దానికి చట్టబద్ధత ఉంటుందా? లేదా? అనేదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Related News

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

Big Stories

×