BigTV English

Mushroom: తరచుగా మష్రూమ్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే !

Mushroom: తరచుగా మష్రూమ్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే !

Mushroom: పుట్టగొడుగులు ఆరోగ్యానికి చాలా మంచివి, వీటిలో విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే.. వాటిని ఎక్కువగా లేదా సరిగా ఎంచుకోకుండా తింటే కొన్ని దుష్ప్రభావాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. పుట్టగొడుగుల వల్ల కలిగే దుష్ప్రభావాలు దాని రకాన్ని బట్టి, వ్యక్తి యొక్క శరీర తత్వాన్ని బట్టి మారుతూ ఉంటాయి.


సాధారణ దుష్ప్రభావాలు:

జీర్ణ సమస్యలు:
పుట్ట గొడుగులలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది జీర్ణ క్రియకు సహాయపడినప్పటికీ, కొంత మందిలో అతిగా తిన్నప్పుడు కడుపు ఉబ్బరం, గ్యాస్ , కడుపు నొప్పి వంటి సమస్యలను కలిగిస్తుంది. పుట్ట గొడుగులను సరిగా ఉడికించకపోతే జీర్ణ సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి. అందుకే జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్న వారు వీటికి దూరంగా ఉండటం చాలా మంచిది.


అలర్జీలు:
కొంతమందికి పుట్టగొడుగులలో ఉండే కొన్ని ప్రోటీన్ల వల్ల అలర్జీలు వస్తాయి. ఈ అలర్జీల వల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో అస్సలు అజాగ్రత్తగా ఉండకూడదు. పుట్టగొడుగులు తిన్న తర్వాత ఇలాంటి లక్షణాలు కనిపిస్తే.. వెంటనే తినడం మానేసి డాక్టర్ ని సంప్రదించాలి.

పొటాషియం అధికంగా ఉండటం:
పుట్ట గొడుగులలో పొటాషియం అధికంగా ఉంటుంది. ఇది శరీరానికి మంచిదే అయినా, మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో అధిక పొటాషియం స్థాయిలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. మూత్రపిండాల సమస్య ఉన్నవారు పుట్ట గొడుగులను తినే ముందు డాక్టర్‌ని సంప్రదించడం మంచిది. సైడ్ ఎఫెక్ట్స్ వస్తే తినకుండా ఉండటం చాలా మంచిది.

గర్భధారణ, పాలిచ్చే సమయంలో:
గర్భవతులు, పాలిచ్చే తల్లులు పుట్ట గొడుగులను తినే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రకాల పుట్టగొడుగులు వారి ఆరోగ్యానికి సురక్షితం కాకపోవచ్చు. అందుకే డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. డాక్టర్ సలహా తీసుకున్న తర్వాత మాత్రమే వాటిని తినడం అలవాటు చేసుకోవాలి.

Also Read: మీలో ఈ లక్షణాలున్నాయా ? అస్సలు లైట్ తీసుకోవద్దు !

రక్తస్రావ సమస్యలు:
పుట్టగొడుగులు రక్తస్రావం సమస్యలను పెంచే అవకాశం ఉంది. ఎవరైనా సర్జరీ చేయించుకోవాల్సిన వారు లేదా రక్తం పలుచన చేసే మందులు వాడుతున్నవారు పుట్టగొడుగులను తినకపోవడం మంచిది.

విషపూరిత పుట్టగొడుగుల ప్రమాదం:
అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే.. అడవుల్లో పెరిగే అన్ని పుట్టగొడుగులు తినడానికి పనికి కావు. కొన్ని విష పూరితమైనవి కూడా ఉంటాయి. వీటిని తింటే ప్రాణాపాయం కూడా సంభవించవచ్చు. విషపూరిత పుట్ట గొడుగులు తిన్న తర్వాత కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలు, గందరగోళం, కాలేయం, మూత్ర పిండాల సమస్యలు వంటి లక్షణాలు కనిపిస్తాయి. అందుకే.. పుట్టగొడుగులను కొనేటప్పుడు లేదా సేకరించేటప్పుడు వాటి రకం గురించి సరైన అవగాహన ఉండాలి. సూపర్ మార్కెట్లు లేదా విశ్వసనీయమైన దుకాణాలలో లభించే పుట్టగొడుగులను మాత్రమే కొనుగోలు చేయడం సురక్షితం.

పుట్టగొడుగులను మితంగా.. జాగ్రత్తగా తింటే అవి ఆరోగ్యానికి మంచివి. కానీ ఏవైనా దుష్ప్రభావాలు కనిపిస్తే వెంటనే వాటిని తినడం మానేసి డాక్టర్ సలహా తీసుకోవడం చాలా ముఖ్యం.

Related News

Pineapple Benefits: ఖాళీ కడుపుతో పైనాపిల్ తింటే.. ఇన్ని లాభాలా ?

Night Shift Workers: నైట్ షిప్ట్ చేస్తున్నారా ? ఈ టిప్స్ మీకోసమే !

Late Sleep: రాత్రి 11 తర్వాత నిద్రపోతున్నారా ? ఈ సమస్యలు తప్పవంటున్న నిపుణులు !

Japanese Interval Walking: జపనీస్ ఇంటర్వెల్ వాకింగ్.. ప్రయోజనాలు తెలిస్తే ఈ రోజు నుంచి మొదలెడతారు !

Momos side effects: మొమోస్ తింటున్నారా? అయితే ఈ నిజం తప్పక తెలుసుకోండి..

White Foods: ఆరోగ్యాన్ని దెబ్బతీసే.. 3 తెల్లటి ఆహార పదార్థాలు, వీటితో.. ఇంత డేంజరా ?

Big Stories

×