Nalgonda Crime News: ఉమ్మడి నల్గొండ జిల్లాలో దారుణం జరిగింది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ సర్పంచ్ హత్య చక్రయ్య గౌడ్‌ను దుండగులు హత్య చేశారు. హత్య వెనుక రకరకాల కారణాలు వెలుగులోకి వస్తున్నాయి. పార్టీలో వర్గ విభేదాలు, ఆధిపత్య పోరు కారణమని కొందరు నేతలు చెబుతున్నారు. అయినా ఆరు పదుల వయసున్న ఆయన హత్య వెనుక ఏదో బలమైన కారణం ఉంటుందని భావిస్తున్నారు.
హత్య ఎలా జరిగింది?
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిర్యాల గ్రామ మాజీ సర్పంచి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మెంచు చక్రయ్య గత రాత్రి హత్యకు గురయ్యారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాలో తన అనుచరుడి పెయింటింగ్ షాపు ప్రారంభోత్సవానికి వెళ్లారు. అక్కడ కార్యక్రమాలు తర్వాత సాయంత్రం మూడు గంటల ప్రాంతంలో గ్రామానికి వచ్చారు.
ఆ తర్వాత సాయంత్రం సమయంలో తాను వ్యవసాయం చేస్తున్న పొలం వద్దకు ఒంటరిగా వెళ్లారు. ఆయన వెంట చుట్టు ఇద్దరు లేదా ముగ్గురు ఉండేవారు. కానీ సోమవారం సాయంత్రం ఆయన ఒక్కరే వెళ్లారు. పనులు చేస్తున్న సమయంలో చక్రయ్యపై దుండగులు కర్రలతో దాడి చేశారు. వెంటనే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. సమీప పరిసరాల్లో గొర్రెల కాపరి గమనించి గ్రామస్థులకు తెలిపాడు.
కింద పడిపోయిన చక్రయ్యను గ్రామస్థులకు చికిత్స నిమిత్తం సూర్యాపేటకు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు చక్రయ్యగౌడ్. ఈ ఘటనకు సంబంధించి 19 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సూర్యాపేట డీఎస్పీ రవికుమార్ తెలిపారు. మృతుడి కూతురు అనిత ఫిర్యాదుతో తొలుత 17 మందిపై కేసు నమోదు చేశారు. ఆ తర్వాత మరో ఇద్దర్ని చేర్చారు.
ALSO READ: సామాజిక విప్లవానికి తెలంగాణ నాంది
దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా ఆసుపత్రిలో శవ పరీక్షల అనంతరం చక్రయ్య మృతదేహాన్ని మంగళవారం మిర్యాల గ్రామానికి తరలించనున్నారు. హత్య నేపథ్యంలో మిర్యాలలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అపరిచిత, అనుమానిత వ్యక్తులు సంచరిస్తే తమకు సమాచారం ఇవ్వాలని గ్రామస్థులను కోరారు పోలీసులు.
గతరాత్రి గ్రామాన్ని సందర్శించి పరిస్థితి పరిశీలించారు జిల్లా ఎస్పీ. చక్రయ్య హత్య వెనుక రకరకాలు కారణాలు చెబుతున్నారు. పార్టీలో వర్గ విభేదాలు కారణమని కొందరు చెబుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన్ని చంపేశారని అంటున్నారు. ఆరు పదుల వయసులో ఉన్న వ్యక్తిని ఇంత దారుణంగా చంపడం వెనుక పాత కక్షలు ఉంటాయని మరికొందరు అనుమానం. మొత్తానికి పోలీసుల విచారణలో ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయో చూడాలి.