BigTV English

Telangana BJP news : మరో కాంగ్రెస్‌లా బీజేపీ?.. ఈ కుమ్ములాటలేంది?

Telangana BJP news : మరో కాంగ్రెస్‌లా బీజేపీ?.. ఈ కుమ్ములాటలేంది?
Latest BJP news in telangana

Latest BJP news in telangana(Political news today telangana): ఒకప్పటి కాంగ్రెస్ వేరు.. ఇప్పటి కాంగ్రెస్ వేరు. గ్రూపులు, కుమ్ములాటలు, వెన్నుపోట్లు, నిరసనలతో పార్టీ ఆగమాగం ఉండేది. గాంధీభవన్‌లో నిత్యం గొడవలే. అలాంటి రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక.. కాంగ్రెస్ కాస్త గాడిన పడింది. మొదట్లో ఉన్నన్ని గ్రూపులు ఇప్పుడు లేవు. సీనియర్లంతా కలిసిపోయారు. కలిసి పని చేస్తున్నారు. ఇష్టంలేని వాళ్లు పార్టీని వదిలి వెళ్లిపోయారు. ఇష్టం ఉన్నవాళ్లు కాంగ్రెస్‌లోకి క్యూ కడుతున్నారు. హస్తం పార్టీలో ఇప్పుడున్నంత జోష్.. మునుపెన్నడూ లేదు.


ఇదే సమయంలో.. బీజేపీ కాంగ్రెస్ పార్టీలా మారిందనే వాదన వినిపిస్తోంది. క్రమశిక్షణకు, సిద్ధాంతాలకు మారుపేరైన కమలదళంలో ఇప్పుడు కోల్డ్ వార్లు, గ్రూపులు. ఏకంగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడినే మార్చేంతగా సమస్యలు. ఇప్పటికీ అవి కంటిన్యూ అవుతున్నాయి. ఈటలది ఓ వర్గం.. బండిది మరో టీమ్. కిషన్‌రెడ్డి వెంట కొందరు. ఎంపీ అర్వింద్, ఎమ్మెల్యే రఘునందన్, వివేక్ వెంకటస్వామి ఇలా చాలామంది ఎవరికి వారు. అధ్యక్షుడిగా కిషన్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమమే పార్టీలోని కుమ్ములాటలకు కేంద్రంగా మారడం సంచలనం. అధిష్టానానికి ఫిర్యాదులు, తప్పుడు రిపోర్టులు ఇవ్వడం ఇప్పటికైనా మానండన్నా.. కనీసం కిషన్‌రెడ్డినైనా ఫ్రీగా పని చేసుకోనీయండన్నా.. అంటూ కలకలం రేపారు. ఇక, వేదికపై ఉన్న జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని చూసి.. విజయశాంతి ఇగో హర్ట్ అయింది. కార్యక్రమం మధ్యలోనే ఇంటికెళ్లిపోయింది. ట్విట్టర్‌లో కాంట్రవర్సీ కామెంట్స్ చేసి.. కొత్త ఇష్యూ రాజేశారు రాములమ్మ.

లేటెస్ట్‌గా మరో ఘటన. హైదరాబా‌ద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గాంధీభవన్ తరహా సీన్. నిజామాబాద్ బీజేపీ లీడర్లు రచ్చ రచ్చ చేశారు. ఎంపీ అర్వింద్‌పై సొంత పార్టీ నాయకులే తిరుగుబాటు చేశారు. 13 మండలాల అధ్యక్షులను ఏకపక్షంగా మార్చడంపై మండిపడ్డారు. ఆర్మూర్, బాల్కొండ, బోధన్ నుంచి పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు బీజేపీ ఆఫీసులో ఆందోళన చేయడం.. ఎంపీ అర్వింద్ డౌన్ డౌన్ అంటూ పార్టీ కార్యాలయంలోనే నినాదాలు చేయడం పార్టీలో చర్చనీయాంశమైంది. ఇదంతా జరిగే సమయంలో బీజేపీ అధ్యక్షులు కిషన్‌రెడ్డి పార్టీ ఆఫీసులోనే ఉన్నారు. కార్యాలయ కార్యదర్శి వచ్చి ఆందోళన చేస్తున్న నేతలను బయటకు వెళ్లగొట్టాల్సి వచ్చింది. బీజేపీలో ఇలాంటి పరిణామాలు నెవ్వర్ బిఫోర్.


ఏమైంది? అసలేం జరుగుతోంది? బీజేపీలో కాంగ్రెస్ తరహా పోకడలకు కారణమేంటి? అంటే.. పార్టీకి డిమాండ్ పెరగడమే అంటున్నారు కమలనాథులు. గతంలో బీజేపీలో నాయకుల సంఖ్య తక్కువగా ఉండేదని.. ఉన్నవాళ్లు సైతం ఆర్ఎస్ఎస్ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చినవాళ్లే కావడంతో.. అంతా ఓ లైన్ మీద ఉండేవారని అంటున్నారు. కొంతకాలంగా వలసలతో బీజేపీ ఫక్తు రాజకీయ పార్టీగా మారిందని.. నేతలు పెరగడంతో.. గ్రూపులూ పెరిగాయని చెబుతున్నారు. ఇలాంటి మార్పు మంచికే అని సమర్థించుకుంటున్నారు కూడా. గ్రూపులు, గొడవలతో బీజేపీని బద్నామ్ చేస్తున్నారనే వారూ ఉన్నారు. ఎంతైనా బీజేపీలో కాంగ్రెస్ తరహా కుమ్ములాటలు అస్సలు బాగోలేదంటున్నారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×