BigTV English

PM Modi: ‘భారత్ మండపం’.. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ.. మూడో ఆర్థికశక్తిగా భారత్‌..

PM Modi: ‘భారత్ మండపం’.. మూడోసారి అధికారంలోకి ఎన్డీఏ.. మూడో ఆర్థికశక్తిగా భారత్‌..
Bharat Mandapam Inauguration

Bharat Mandapam Inauguration(PM Modi news today in telugu): మూడోసారి కూడా ఎన్డీయే అధికారంలోకి వస్తుంది.. ప్రపంచంలోనే మూడో ఆర్థిక శక్తిగా భారత్ ఎదుగుతుంది.. అంటూ ధీమా వ్యక్తం చేశారు ప్రధాని మోదీ. ఊహించని రీతిలో మన దేశం ఎన్నో విజయాలు సాధిస్తోందని.. ఈ అభివృద్ధి ప్రయాణం ఆగదని అన్నారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో ఇంటర్నేషనల్‌ ఎగ్జిబిషన్‌ కమ్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ (IECC)ను డ్రోన్‌తో హైటెక్‌గా ప్రారంభించారు పీఎం మోదీ. జీ-20 సమ్మిట్‌కు వేదిక కానున్న ఈ కన్వెన్షన్‌ సెంటర్‌కు ‘భారత్‌ మండపం’ (Bharat Mandapam) అని నామకరణం చేశారు.


ఢిల్లీలో 123 ఎకరాల విస్తీర్ణంలో.. దాదాపు 2,700 కోట్ల ఖర్చుతో.. హైటెక్ హంగులతో IECCను నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. సెప్టెంబర్‌లో జరిగే జీ20 సదస్సుకు ఈ వేదిక ఆతిథ్యం ఇవ్వనుంది. దేశ విదేశాలకు చెందిన 3వేల మందికి పైగా అతిథిలు హాజరుకానున్నారు. కొత్తగా నిర్మించిన ‘భారత్‌ మండపం’ మన దేశ సత్తాను ప్రపంచానికి చాటి చెబుతుందన్నారు మోదీ.

ఇప్పటికే పార్లమెంట్ కొత్త భవనం గురించి భారతీయులంతా గొప్పగా చెప్పుకుంటున్నారని అన్నారు ప్రధాని. పని చేసే విధానంతో పాటు పని వాతావరణాన్ని కూడా మార్చుకోవాలన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద మ్యూజియం త్వరలో ఢిల్లీలో ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.


PM-Modi-IECC

Related News

Retail Real Estate: మళ్లీ ఊపందుకున్న రీటైల్ రియల్ ఏస్టేట్.. ఏకంగా 69 శాతానికి..?

Supreme Court: లక్షల వీధి కుక్కలను షెల్టర్లకు తరలించండి.. సుప్రీం సంచలన ఆదేశాలు

Delhi Politics: ఢిల్లీలో రాహుల్, ప్రియాంక అరెస్ట్, భగ్గుమన్న విపక్షాలు, ప్రజాస్వామ్యం కోసమే పోరాటం-సీఎం రేవంత్

Air India: మరో ఎయిర్ ఇండియా విమానానికి తప్పిన ప్రమాదం.. ఫ్లైట్‌లో కాంగ్రెస్ పార్టీ ఎంపీలు

Army rescue: మంచు పర్వతాల మధ్య.. పురిటి నొప్పులతో మహిళ! రంగంలోకి 56 మంది జవాన్స్.. ఆ తర్వాత?

FASTag Annual Pass: వాహనదారులకు శుభవార్త.. ఫాస్టాగ్ వార్షిక పాస్ కావాలా..? సింపుల్ ప్రాసెస్

Big Stories

×