BigTV English

Revanth Reddy: ORRను వదిలేదేలే.. హైకోర్టుకు రేవంత్‌రెడ్డి..

Revanth Reddy: ORRను వదిలేదేలే.. హైకోర్టుకు రేవంత్‌రెడ్డి..
Revanth reddy on ORR Hyderabad

Revanth reddy on ORR Hyderabad(Latest political news telangana): తెలుసుగా రేవంత్‌రెడ్డి పట్టుబడితే ఎట్టా ఉంటాదో. ఓఆర్ఆర్‌ లీజులో వేల కోట్ల అవినీతి జరిగిందని ఇప్పటికే ఆరోపించారు. నిబంధనలకు విరుద్ధంగా.. తక్కువ ధరకే.. ఓ ఫెయిల్యూర్ కంపెనీకి తెలంగాణ ప్రజల ఆస్థిని కట్టబెట్టారని విమర్శించారు. వరుస ప్రెస్‌మీట్లతో ORR కాంట్రాక్ట్‌లో దాగున్న లొసుగులన్నీ బయటపెట్టారు.


ఉన్నది ఉన్నట్టు చెబితే ఉలుకెక్కువ అన్నట్టు.. ఆరోపణలు చేసిన రేవంత్‌రెడ్డికి లీగల్ నోటీసులు ఇచ్చింది HMDA. ఆయనపై పరువునష్టం దావా వేసింది. ఇలాంటి కేసులకు, నోటీసులకు బెదిరేదేలే అన్నారు రేవంత్. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ల మాయాజాలంపై మరింత సమాచారం బయటకు లాగేందుకు రెడీ అయ్యారు. అందులో భాగంగా లీజు ఫుల్ డీటైల్స్ ఇవ్వాలంటూ ఆర్టీఐ ద్వారా అప్లై చేశారు. అయితే, రేవంత్ అడిగిన సమాచారం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఏవో సాకులు చెబుతూ వస్తోంది సర్కారు. దీంతో చిర్రెత్తుకొచ్చిన పీసీసీ చీఫ్.. ఈసారి ఏకంగా హైకోర్టునే ఆశ్రయించారు.

ORR టెండర్లపై RTI కింద తాను అడిగిన ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదని.. హైకోర్టులో పిటిషన్ వేశారు రేవంత్‌రెడ్డి. ఆర్టీఐకి కమిషనర్ లేకపోవడంతోనే సమాచారం రావడం లేదని పిటిషన్‌లో ప్రస్తావించారాయన. తనకు చట్టప్రకారం ఇవ్వాల్సిన డీటైల్స్‌ను ఇప్పించాలని కోర్టును కోరారు.


Related News

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Big Stories

×