Big Stories

Congress Vs BRS : గ్రేటర్లోనూ కారు ఖాళీ! కాంగ్రెస్ త్రిశూల వ్యూహమిదే..

congress-vs-brs Political News In Telangana-Congress trident strategy

- Advertisement -

Congress Vs BRS Political News In Telangana(Ts politics):కాంగ్రెస్‌ను ఖాళీ చేస్తాం.. ఖతం చేస్తాం..ఇవన్నీ కాదు ఆ పార్టీని బొంద తీసి పాతరేస్తాం..ఇవన్నీ గతంలో అప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్‌ నోట్లో నుంచి ఊడిపడిన ఆణిముత్యాలు.. సీన్‌ కట్‌ చేస్తే ఏమైంది.. కంప్లీట్‌గా రివర్సైనట్టుంది సిట్యూవేషన్.. రాత్రికి రాత్రి కారు దిగి కాంగ్రెస్‌ కండువా కప్పుకునే పరిస్థితి వచ్చింది.టికెట్లు ఇస్తామన్నా వద్దు మహాప్రభో అంటూ దండం పెట్టి మరీ చెబుతున్నారు. ఇంతకీ బీఆర్‌ఎస్‌ ఎందుకు ఖాళీ అవుతోంది? ఇలాంటి పరిస్థితి ఆ పార్టీకి ఎందుకొచ్చింది? ఇది స్వయంకృతాపరాదమా? లేక రెచ్చగొట్టి మరీ చేసుకున్న నిర్వాకమా?

- Advertisement -

ఒకరు కాదు.. ఇద్దరు కాదు..గులాబీ కండువా కప్పుకున్న చాలా మంది నేతలు చేసిన వ్యాఖ్యలు మీకు గుర్తున్నాయా.. మాట్లాడితే కాంగ్రెస్‌ సర్కార్‌ను కూల్చేస్తాం..ఇదంతా ముణాళ్ల ముచ్చటే..
ఇదీ జస్ట్ కొన్ని రోజుల ముందు వరకు వినిపించిన డైలాగ్స్.. కానీ ఇప్పుడేమైంది కథ మారింది. కూల్చడం అటుంచి.. సొంత పార్టీ నుంచి వలస వెళుతున్న నేతలను కాపాడుకోలేని పరిస్థితిలో ఉన్నారు కేసీఆర్..
కష్టమొచ్చినా.. నష్టమొచ్చినా..ఎండైనా.. వానైనా.. సిట్యూవేషన్‌ ఏదైనా కేసీఆర్‌ వెంటే నడుస్తాం..పార్టీ మారనే మారమన్న నేతలే.. తెల్లారితే కాంగ్రెస్ కండువానో, కాషాయ కండువానో కప్పుకుని కనిపిస్తున్నారు..అలా ఉంది తెలంగాణలో బీఆర్ఎస్ ప్రస్తుత పరిస్థితి.

Also Read: మరో ఇద్దరు ఎంపీ అభ్యర్థుల ప్రకటించిన బీఆర్ఎస్.. అక్కడి నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పోటీ

మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే ఊరుకుంటామా.. కుక్కకాటుకు చెప్పుదెబ్బ తప్పదంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే చెప్పేశారు. ఇప్పుడు చెప్పినట్టుగానే చేసి చూపిస్తున్నారు..ప్రస్తుతం కాంగ్రెస్‌ గేట్లు ఓపెన్ చేశారు.. గ్రేటర్‌లో తమను కొట్టేవారేలేరన్న గులాబీ నేతల ధీమాను బద్ధలు కొట్టారు. ప్రస్తుతం కాంగ్రెస్‌లో చేరేందుకు క్యూకడుతున్నారు గ్రేటర్ నేతలు..కాంగ్రెస్‌ కండువా కప్పుకున్నారు డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్..ఆమె బాటలోనే మేయర్ గద్వాల్ విజయలక్ష్మి సైతం నడుస్తున్నారు..ఇప్పటికే కాంగ్రెస్ ఇన్చార్జి దీప దాస్ మున్షీతో మేయర్ భేటీ ముగిసింది. ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్‌ నుంచి ఎంపీ టికెట్ దక్కించుకున్నారు.కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడని పేరు తెచ్చుకున్న.. మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ ఎప్పుడో కండువా మార్చేశారు.. మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసీయుద్దిన్‌ కూడా కాంగ్రెస్ చెంత చేరారు..బీఆర్ఎస్‌ కార్పొరేటర్లంతా ఇప్పుడో అప్పుడో అన్నట్టుగా ఉన్నారు. మొత్తంగా అతి త్వరలో GHMCపై కాంగ్రెస్ జెండా రెపరెపలాడటం ఖాయంగా కనిపిస్తోంది..
ఇదీ గ్రేటర్ పరిస్థితి..

నిజానికి పెద్దపల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేతతో మొదలైంది ఈ చేరికల పర్వం..ఆ తర్వాత మెల్లమెల్లగా ఊపందుకుని.. ఇప్పుడు జోరుగా మారింది. ఇప్పటికే నలుగురు సిట్టింగ్ ఎంపీలు కారు దిగారు.. వీరే కాదు చాలా మంది మాజీలు కూడా కాంగ్రెస్ కండువా కప్పేసుకుంటున్నారు..

అసెంబ్లీ ఎన్నికల్లో గ్రేటర్‌లో కాంగ్రెస్‌ జోరు కొనసాగలేదు..కానీ లోక్‌సభ ఎన్నికల నాటికి పరిస్థితిని మార్చేయాలన్నది రేవంత్ స్కెచ్‌లా కనిపిస్తోంది. ఈ ప్రాంత పరిధిలో ఉన్న మల్కాజ్‌గిరి, సికింద్రాబాద్ సీట్లను ఎలాగైనా దక్కించుకోవాలి..అందుకే దీనికి తగ్గట్టుగా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు? ముందుగా సికింద్రాబాద్‌లో సత్తా చాటగల లోకల్‌ నేత అయిన దానంను బరిలోకి దించడం చూస్తుంటే ఇదే కనిపిస్తోంది.. దానం బీఆర్‌ఎస్‌ క్యాడర్‌ ఉంది.. దీనికి తోడు కాంగ్రెస్‌ కార్యకర్తలు కూడా తోడైతే. సీటు కాంగ్రెస్‌కే దక్కడం ఖాయమన్నది ఆ పార్టీ లెక్క.. అటు మల్కాజ్‌గిరి సీటును కూడా పట్నం సునీతారెడ్డికి ఇచ్చారు. ముందుగానే మల్లారెడ్డి పోటీ నుంచి తప్పుకోవడంతో సగం గెలిచినట్టే అన్నది. కాంగ్రెస్ నేతల ఆలోచన. అక్కడ మైనంపల్లి హనుమంతరావుకు చాలా క్యాడర్ ఉంది. మల్లారెడ్డి ఇప్పుడు గట్టిగా నోరెత్తడం లేదు. ఆయన కాంగ్రెస్‌ నేతలతో టచ్‌లో ఉన్నారన్న ప్రచారం జోరుగా ఉంది.మొత్తంగా చూస్తే ప్రస్తుతం సీఎం రేవంత్ రెండు వైపుల నుంచి నరుక్కొని వస్తున్నట్టు కనిపిస్తోంది..

ఇక సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్‌లోనూ సమీకరణాలు మారిపోతున్నాయి.. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్‌ఎస్‌ నేతలతో మంతనాలు జరిపారు..తాను చెప్పిందే వేదం.. చేసిందే చట్టం.. అన్నట్టుగా ఉండే కేసీఆర్..అందరిని పిలిచి చర్చలు జరపడం కాస్త వండర్‌గానే ఉంది. ఇది కేసీఆర్‌కు ప్రెస్టీజ్‌ ఇష్యూ అనే చెప్పాలి..ఈ సీటులో ఓడితే పరువు పోతుందన్న భావనలో ఉన్నారాయన..అందుకే ఆచితూచి మెదక్ బీఆర్ఎస్‌ ఎంపీ అభ్యర్థిగా.. ఎమ్మెల్సీ, మాజీ కలెక్టర్ వెంకట్రాంరెడ్డి పేరును ఖరారు చేసింది. ఈ టికెట్ ఆశించిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి సైలెంట్‌గా సైడ్ అయ్యారు. వెంకట్రాంరెడ్డి పేరు ఫైనల్ చేయడం కాస్త అనూహ్యమనే చెప్పాలి..

Also Read: కాంగ్రెస్ బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్..మోడీ కుట్ర నేనా?

అయితే మెదక్‌లోనే బీఆర్‌ఎస్‌ను కొట్టాలన్న థాట్‌లో ఉన్న కాంగ్రెస్.. ఇప్పటికే వ్యూహాలను రచిస్తున్నట్టు తెలుస్తోంది. వీటన్నంటికంటే కేకే చేరడం మాత్రం కేసీఆర్‌కు పెద్ద దెబ్బ అని చెప్పాలి..
ప్రస్తుతం రాజ్యసభ ఎంపీగా ఉన్న కేకే.. బీఆర్ఎస్‌ ముఖ్య నేతల్లో ఒకరు.. ఆయన కూడా ఇప్పుడు కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖాయమైనట్టే అని చెప్పుకోవాలి.. ఇదే జరిగితే ఆయన సొంతగూటికి చేరుకున్నట్టే.. అయితే తాను పార్టీ మారడం లేదంటున్నారు. కానీ కూతురు కాంగ్రెస్‌లోకి పంపారంటే.. పరోక్షంగా కాంగ్రెస్‌కు జై కొట్టినట్టే కదా అనే చర్చ ఇప్పుడు పొలిటికల్‌ సర్కిళ్లలో వినిపిస్తోంది..

ఓవరాల్‌గా చూస్తే.. కార్యకర్తలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు..ఎమ్మెల్యేలు, ఎంపీలు.. ఇందులో ఓడినవారు.. గెలిచినవారు..అంతా కారు దిగేవారే కనిపిస్తున్నారు.. ఓ వైపు కూతురు కవిత అరెస్ట్..
మరోవైపు వీడుతున్న పార్టీ నేతలు.. ప్రస్తుతం కాంగ్రెస్‌ సర్కార్‌ను కూలగొట్టడం అటుంచి.. ఉన్న పార్టీని కాపాడుకుంటే చాలు అనే సెటైర్లు వినిపిస్తున్నాయి పొలిటికల్ సర్కిల్స్‌లో.. ప్రస్తుతం కాంగ్రెస్ వ్యూహం చూస్తుంటే.. రేవంత్ చేసిస వ్యాఖ్యలు నిజమవుతాయా? బీఆర్‌ఎస్‌ పార్టీలో కేసీఆర్ కుటుంబ సభ్యులు ముగ్గురు, నలుగురు మాత్రమే మిగులుతారా?

 

..

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News