BigTV English

Secunderabad Cantonment seat won by congress: 15 ఏళ్ల తర్వాత, కంటోన్మెంట్‌పై కాంగ్రెస్ జెండా

Secunderabad Cantonment seat won by congress: 15 ఏళ్ల తర్వాత, కంటోన్మెంట్‌పై కాంగ్రెస్ జెండా

Secunderabad Cantonment seat won by congress: ఎట్టకేలకు 15 ఏళ్ల తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ సీటును కాంగ్రెస్ పార్టీ సొంతం చేసుకుంది. బీజేపీ అభ్యర్థి వంశీతిలక్‌పై దాదాపు 13 వేల పైచిలుకు మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు. ఈసారి ఈ నియోజకవర్గంలో ముక్కోణపు పోటీ జరిగింది.


బీఆర్ఎస్ నుంచి నివేదిత సాయన్న, కాంగ్రెస్ నుంచి శ్రీగణేశ్, బీజేపీ నుంచి వంశాతిలక్ పోటీపడ్డారు. సాయన్న ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం కంచుకోట. ఐదుసార్లు ఆయన అక్కడి నుంచి గెలుపొందారు. ఆయన మరణం తర్వాత కూతురు గెలిచింది. అయితే యాక్సిడెంట్‌లో ఆమె చనిపోవడంతో ఇక్కడ ఉప ఎన్నిక, లోక్‌సభ ఎన్నికలతోపాటే జరిగింది.

గతంలో బీజేపీ నుంచి బరిలోకి దిగిన శ్రీగణేష్, ఈసారి కాంగ్రెస్ నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. బీజేపీ అభ్యర్థి వంశీతిలక్‌ బరిలోకి దించింది. ప్రతీ రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి తన ఆధిక్యాన్ని పెంచుకుంటూ వచ్చారు. ఒక రౌండ్‌లో బీఆర్ఎస్, మరో రౌండ్ బీజేపీ‌ అభ్యర్థులు ఆయనతో పోటీపడుతూ వచ్చారు. చివరకు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ఇక్కడి నుంచి విజయం సాధించారు.


ALSO READ: వర్కవుట్ కాని డబుల్ డిజిట్ ఫార్ములా.. ఏ పార్టీకీ అందని టార్గెట్

1994 నుంచి ఇప్పటివరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్‌కు ఏడుసార్లు ఎన్నికలు జరగ్గా కేవలం ఒక్కసారి మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అదీ కూడా 2009లో మాత్రమే. ఆ తర్వాత ఇప్పుడే ఆ సీటును దక్కించు కుంది. టీడీపీ ఐదుసార్లు, బీఆర్ఎస్ రెండుసార్లు గెలిచాయి. ఈసారి బీఆర్ఎస్ థర్డ్ ప్లేస్‌లో నిలిచింది.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×