BigTV English

Kothagudem: డీహెచ్‌కు బ్యాండ్.. జలగంకు హ్యాండ్.. వనమానే సిట్టింగ్గా?

Kothagudem: డీహెచ్‌కు బ్యాండ్.. జలగంకు హ్యాండ్.. వనమానే సిట్టింగ్గా?

Kothagudem: ఒక్కటే లైన్. సిట్టింగులకే ఛాన్స్. ఈ ఒక్కలైన్‌నే గట్టిగా పట్టుకున్నారు గులాబీ బాస్. రేసులో ఎంతమంది ఆశావహులు ఉన్నా.. వారెంత బలమైన నేతలైనా.. డోంట్‌కేర్ అన్నారు. సిట్టింగ్ అయితే చాలు.. ఇదిగో టికెట్ అంటూ పంచేశారు. ఓ ఏడుగురిని మాత్రం మార్చేసిన.. అందుకు ప్రత్యేక కారణాలున్నాయి.


మిగతా స్థానాల విషయం ఏమో కానీ.. కొత్తగూడెం కిరికిరి మామూలుగా లేదు. సిట్టింగ్‌లకే టికెట్ ఇవ్వాలనుకున్నా.. ఇటీవలే జలగం వెంకట్రావునే ఎమ్మెల్యేగా ప్రకటించింది హైకోర్టు. ఆ లెక్కన చూస్తే.. టెక్నికల్‌గా జలగమే సిట్టింగ్. కానీ, కేసీఆర్ మాత్రం కాంగ్రెస్ నుంచి గెలిచొచ్చిన వనమా వెంకటేశ్వరరావునే సిట్టింగ్‌గా భావిస్తున్నట్టున్నారు. సొంతపార్టీ, సొంత సామాజిక వర్గమైన జలగం వెంకట్రావుకు హ్యాండిచ్చేశారు. వయోభారం వేధిస్తున్నా.. వనమాకే టికెట్ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది.

కొన్నాళ్లుగా కొత్తగూడెం నాదేనంటూ.. నానాహంగామా చేస్తున్నారు తెలంగాణ హెల్త్ డైరెక్టకర్ శ్రీనివాస్‌రావు. ప్రభుత్వ అధికారిగా ఉంటూనే.. రాజకీయ లీడర్‌లో చెలరేగిపోయారు. సీఎం కేసీఆర్ కాళ్లకు మొక్కడం నుంచి.. కొత్తగూడెంలో తరుచూ పర్యటిస్తూ.. పొలిటికల్ స్టేట్‌మెంట్లు చేస్తూ.. పూజలు గట్రా కానిస్తూ.. కారు సీటు తనదేనంటూ బాగా ప్రచారంలోకి వచ్చారు. తీరా అభ్యర్థుల లిస్ట్ చూస్తే.. ఆయన లేనేలేరు. డీహెచ్ వరకూ ఎందుకు.. జలగంకే హ్యాండిచ్చారు కేసీఆర్. వనమా కొడుకు విషయంలో వివాదం ఉన్నా.. సిట్టింగ్ అనే ఏకైక కారణంతో మళ్లీ ఆయననే అభ్యర్థిగా ప్రకటించడం కేసీఆర్ వ్యూహమా? వ్యూహాత్మక తప్పిదమా? అనే చర్చ నడుస్తోంది.


Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×