BigTV English

Minister KTR news: కేంద్రంలో కీ రోల్.. అట్టెట్టా కేటీఆర్? క్లారిటీ ప్లీజ్

Minister KTR news: కేంద్రంలో కీ రోల్.. అట్టెట్టా కేటీఆర్? క్లారిటీ ప్లీజ్
KTR news today in telugu

KTR news today in telugu(Latest political news telangana):

మంత్రి కేటీఆర్ ఇటీవల పదే పదే ఓ డైలాగ్ వదులుతున్నారు. ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని.. అందులో బీఆర్ఎస్‌ కీలకపాత్ర పోషిస్తుందని చెబుతున్నారు. ఓసారి ప్రెస్‌మీట్లో.. మరో రెండుసార్లు ఓపెన్ మీటింగ్‌లో. మొత్తంగా మూడుసార్లు ఇదే స్టేట్‌మెంట్ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. అదెలా సాధ్యం? కేటీఆర్ లెక్కేంటి? అనే చర్చ మొదలైంది.


ఇంతకుముందు ఢిల్లీ కోటపై గులాబీ జెండా ఎగరేస్తామని అనేవారు. అంటే బీఆర్ఎస్ నేతృత్వంలో కేంద్రంలో అధికారం చేపడతామని చెప్పేవారు. ఏ రాజకీయ పార్టీ అయినా అలానే అంటుందిలే ఇది రొటీన్ డైలాగే అనుకున్నారంతా. బీఆర్ఎస్ కోసం పలు రాష్ట్రాలు తిరిగినా.. అనేకమంది జాతీయ నేతలను కలిసినా.. ఏ ఒక్కరూ కేసీఆర్‌ను నమ్మలేదు. ఇక లాభం లేదని సొంతంగానే పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు. అలాగని దేశమంతా గులాబీ జెండా ఎగరేస్తున్నారని కాదు. లెక్క పక్కాగా చెప్పాలంటే.. పక్కనే ఉన్న మహారాష్ట్రలో మాత్రమే గులాబీ రంగు అద్దుతున్నారు. మిగతా రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్ ఊసే లేదు. ఏపీలోనూ ఉనికే లేదు. ఇదీ ప్రస్తుత బీఆర్ఎస్ పరిస్థితి.

అలాంటిది కేసీఆర్ కుమారుడు కేటీఆర్ మాత్రం ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తుంది.. అందులో మాదే కీలక పాత్ర అని అంత ఓపెన్‌గా ఎలా చెప్పగలుగుతున్నారు? కేటీఆర్ చెప్పేదాంట్లో సగం నిజమూ లేకపోలేదు. అవును, ఈసారి కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం వస్తే రావొచ్చు. ఆ సంకీర్ణం కాంగ్రెస్ నేతృత్వంలోని I-N-D-I-A కూటమిదే కానీ.. మరో కొత్త రాజకీయ కూర్పు వచ్చే అవకాశం ప్రస్తుతానికైతే లేదు. మరి, ఆ టీమ్ ఇండియాలో లేని బీఆర్ఎస్.. కేంద్రంలో ఎలా కీ రోల్ ప్లే చేయగలదు? అటు ఎన్డీయేలోనూ లేకుండా.. ఇటు ఇండియాలోనూ లేకుండా.. కేంద్రంలో రాబోవు సంకీర్ణ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఎలా ప్రభావితం చేయగలదు?


పోనీ.. ఇండియా కూటమి బలమైన పోటీ వల్ల.. ఈసారి ఎన్డీయేకు గతంలో మాదిరి భారీ మెజారిటీ రాకపోవచ్చు అంటున్నారు. అలాగని ఇండియా టీమ్‌ సైతం మ్యాజిక్ నెంబర్‌కు రీచ్ కాకపోవచ్చు. ఇలా రెండు కూటమిల నెంబర్ గేమ్‌లో బీఆర్ఎస్‌కు టాప్ ప్రయారిటీ వస్తుందా? అంటే ఆ అవకాశమూ అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. తెలంగాణలో ఉన్నవే 17 ఎంపీ స్థానాలు. అసలే కేసీఆర్ గ్రాఫ్ దారుణంగా పడిపోతోంది. ఉన్న 17లో పట్టుమని పది సీట్లైనా గెలుస్తారనే నమ్మకం లేదు. అటు, మహారాష్ట్రలో కార్ ర్యాలీ తీసినంత మాత్రాన.. నేరుగా ఢిల్లీకి దౌడ్ తీస్తుందనే గ్యారెంటీ కూడా లేదు. ఎంత లెక్కేసినా.. బీఆర్ఎస్‌కు వచ్చే ఎంపీ స్థానాలు వేళ్ల మీద లెక్కించదగినవే అంటున్నారు. అలాంటప్పుడు.. కేంద్రంలో రాబోవు సంకీర్ణ సర్కారులో కారు పార్టీ కీలక పాత్ర ఎలా పోషించగలదు? మరి, కేటీఆర్ అలా ఎందుకు అంటున్నారు?

ఇదంతా గులాబీ లీడర్ ఆడుతున్న మైండ్ గేమ్ అంటున్నారు. పంక్చర్ అయిన కారును.. ఇలా మాటల జాకీలతో పైకి లేపే ప్రయత్నం చేస్తున్నారని భావిస్తున్నారు. వచ్చేదిలేదు.. గెలిచేది లేదు కానీ.. కేంద్రంలో చక్రం తిప్పుతారట.. వినేవాళ్లు ఉంటే ఇలానే ఎన్నైనా చెబుతారు.. కేటీఆర్.. తండ్రిని మించిన పిట్టలదొర అవుతున్నారంటూ సోషల్ మీడియాలో తెగ నెగటివ్ కామెంట్లు పెడుతున్నారు. మరి, ఊరికే ఓ డైలాగ్ వదలడం కాకుండా.. కేంద్రంలో బీఆర్ఎస్ ఎలా కీ రోల్ ప్లే చేస్తుందో.. కాస్త లెక్కలేసి లాజిక్‌గా చెప్పొచ్చుగా కేటీఆర్?

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×