Big Stories

Case Register on KTR: కేటీఆర్ పై క్రిమినల్ కేసు.. ఎందుకంటే..?

ktr news today

- Advertisement -

Case Register on KTR(Political news today telangana): మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఉపాధ్యక్షుడు కేటీఆర్‌పై క్రిమినల్ కేసు నమోదయ్యింది. ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి భారీ ఎత్తున నగదు పంపారంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై హైదరాబాద్‌లోని బంజరాహిల్స్ పోలీసు స్టేషన్‌లో కేసు బుక్కయ్యింది.

- Advertisement -

కాంగ్రెస్ నేత బత్తిన శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ 504, 505(2) సెక్షన్ల కింద కేటీఆర్ పై కేసు నమోదైంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ.. ఆయన్ని రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు కేటీఆర్ ప్రయత్నిస్తున్నారని ఆ ఫిర్యాదులో ఆయన ప్రస్తావించారు. ఇదే వ్యవహారం పై హనుమకొండ పోలీసుస్టేషన్‌లోనూ కేటీఆర్‌పై కేసు బుక్కయ్యింది. ఆ కేసును హనుమకొండ పోలీసులు బంజారాహిల్స్ పీఎస్ కు బదిలీ చేశారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News