BigTV English

Bhajan In Operation Theater: నాన‌మ్మ శివభజన వింటూ .. త‌ల్లి గ‌ర్భం నుంచి బ‌య‌ట‌కొచ్చిన మ‌నువ‌డు

Bhajan In Operation Theater: నాన‌మ్మ శివభజన వింటూ .. త‌ల్లి గ‌ర్భం నుంచి బ‌య‌ట‌కొచ్చిన మ‌నువ‌డు
Bhajan In Operation Theater
 

Woman Sang Bhajan In Operation Theatre: ఆపరేషన్ థియేటర్ లో అత్త శివభజనలు చేస్తుండగా కోడలు పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని జిల్లాలో జరిగింది. అసలేం జరిగిదంటే.. ఉజ్జయినిలోని మంఛామన్ కాలనీకి చెందిన ఉపాసన దీక్షిత్ కు ఈ నెల 27 న పురిటి నొప్పులు వచ్చాయి. ఆమెను హుటా హుటినా జేకే ఆస్పత్రికి చేర్చగా ఆమెకు ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పారు. తీవ్ర భయాందోళనకు గురైన ఉపాసన తన అత్తయ్యను ఆపరేషన్ థియేటర్ లోకి అనుమతించాలని వైద్యులను ప్రాధేయపడింది.


థియేటర్ లోకి వచ్చిన అత్త ప్రీతిని శివభజన చేయమని కొడలు చెప్పింది. ఇందుకు వైద్యులు కూడా ఒప్పుకోవడంతో.. ఇక కోడలకి డెలవరీ చేస్తుండగా, అత్త శివ కీర్తనలు పాడి.. ఆపరేషన్ థియేటర్ లో ఆధ్యాత్మక వాతావరణం నింపింది. దాదాపు 20 నిముషాలపాటు అత్త శివ నామస్మరణలో ఆలపిస్తుండగా, అంతలోనే కోడలు పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో అత్త మనవడిని చూసి మురిసిపోయింది.

Also Read: స్టూడెంట్‌కి షాకిచ్చిన ఐటీ.. 46 కోట్లపై నోటీసు.. ఇదెలా?


ఈ క్రమంలో అత్త మాట్లాడుతూ.. ఏడు సంవత్సరాలక్రితం నా చిన్న కొడుకు ఆత్మహత్య చేసుకొని మరణించాడు. ఇప్పుడు అదే రోజున మనవడుపుట్టడంతో చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఆ శివుడి వల్లే ఇది సాధ్యమైందన్నారు. ఏడేళ్ల తర్వాత మనవడి రూపంలో నా కొడుకు పుట్టాడని కన్నీటి పర్యంతం అయింది. ఈ సంధర్బంగా వైద్యురాలు జయ మిశ్రా మాట్లాడుతూ.. ప్రీతి తన భజనలతో సానుకూల అనుభూతిని సృష్టించింది. శివస్తోత్రం వింటూ మేము కూడా రిలాక్స్ అవుతూ ఆపరేషన్ చేశాం అని తెలిపారు. ఈ నేపథ్యంలో థియేటర్ లోని ప్రీతి భజనలు చేస్తున్న వీడియోను డాక్టర్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

 

Related News

PM Kisan Samman Nidhi: ఈ రాష్ట్రాల్లో పీఎం కిసాన్ డబ్బులు విడుదల.. ఏపీ, తెలంగాణలో ఎప్పుడంటే?

Idli Google Doodle: వేడి వేడి ఇడ్లీ.. నోరూరిస్తోన్న గూగుల్ డూడుల్.. చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

EPFO Tagline Contest: ఈపీఎఫ్ఓ నుంచి రూ.21 వేల బహుమతి.. ఇలా చేస్తే చాలు?

Earthquake: వణికిన ఫిలిప్పీన్స్.. 7.6 తీవ్రతతో భారీ భూకంపం

UP Governor: యూపీ గవర్నర్ వార్నింగ్.. సహజీవనం వద్దు, తేడా వస్తే 50 ముక్కలవుతారు

Tata Group: టాటా గ్రూప్‌లో కుంపటి రాజేస్తున్న ఆధిపత్య పోరు.. రంగంలోకి కేంద్రం..

Donald Trump: ప్రెసిడెంట్ ట్రంప్‌నకు యూఎస్ చట్టసభ సభ్యులు లేఖ

Narendra Modi: ఓటమి తెలియని నాయకుడు.. కష్టపడి పని చేసి, ప్రపంచానికి చూపించిన లీడర్..

Big Stories

×