BigTV English

Narne Nithin: ఘనంగా ఎన్టీఆర్ బామ్మర్ది నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..!

Narne Nithin: ఘనంగా ఎన్టీఆర్ బామ్మర్ది నిశ్చితార్థం.. ఫొటోస్ వైరల్..!

Narne Nithin: త్వరలో ఎన్టీఆర్ (Jr.NTR) సతీమణి లక్ష్మీ ప్రణతి(Lakshmi Pranati) ఇంట్లో పెళ్లి భాజాలు మోగనున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ బావమరిది, లక్ష్మీ ప్రణతి సోదరుడు, యంగ్ హీరో నార్నే నితిన్ (Narne Nithin) ఒక ఇంటివాడు కాబోతున్నారు. ఆదివారం (నవంబర్ 3 ) నాడు ఆయన నిశ్చితార్థం ఘనంగా జరిగింది. హైదరాబాదులోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 7 లో ఉన్న ఒక అపార్ట్మెంట్ లో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రుల సమక్షంలో నార్నే నితిన్.. తాళ్లూరి వెంకటకృష్ణ ప్రసాద్, స్వరూప ల కుమార్తె శివాని కి మధ్యాహ్నం 3:29 నిమిషాలకు రింగు తొడిగారు.


పెళ్లికూతురు వెంకటేష్ సమీప బంధువు..

ఈ కార్యక్రమానికి సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్, లక్ష్మీ ప్రణతి, అభయ్ రామ్ , భార్గవ్ రామ్, హీరో వెంకటేష్ తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే పెళ్లికూతురు శివాని ఎవరో కాదు దగ్గుబాటి సురేష్ (Daggubati Suresh), దగ్గుబాటి వెంకటేష్ (Daggubati Venkatesh)లకు సమీప బంధువు అని సమాచారం. ఇకపోతే నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. హీరో నార్నే నితిన్ కాబోయే భార్య చాలా చక్కగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. నార్నే నితిన్ విషయానికి వస్తే.. ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు (Narne Srinivasrao) తనయుడు. ఎన్టీఆర్ కి బావమరిదిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టారు. ‘ మ్యాడ్’ (Mad )సినిమాతో హీరోగా వెండితెరపై కనిపించిన ఈయన ఇటీవల ‘ఆయ్’ చిత్రంతో విజయాన్ని అందుకున్నారు.


ఎన్టీఆర్ కెరియర్..

ఇక ఎన్టీఆర్ విషయానికి వస్తే.. స్వర్గీయ నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన ‘ బాల రామాయణం’ అనే సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించారు. ఆ తర్వాత ‘నిన్ను చూడాలని’ అనే సినిమాతో హీరోగా మారి ‘స్టూడెంట్ నెంబర్ వన్’ , ‘సింహాద్రి’, ‘ఆది ‘వంటి చిత్రాలలో నటించి మాస్ హీరోగా పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్, అనతి కాలంలోనే ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాలతో కూడా మెప్పించారు. ‘ఊసరవెల్లి’, ‘ బృందావనం’, ‘రామయ్య వస్తావయ్య’, ‘జనతా గ్యారేజ్’ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ఆయన ఖాతాలోనే ఉన్నాయి. ఇక ‘నాన్నకు ప్రేమతో’ లాంటి డిఫరెంట్ జోనర్ లో కూడా సినిమాలు తెరకెక్కించి ప్రేక్షకుల మన్ననలు అందుకున్నారు. ఇక రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి తన నటనను ప్రపంచవ్యాప్తంగా రుచి చూపించారు. ఒక్క సినిమాతో గ్లోబల్ స్టార్ గా పేరు సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. ఇక ఇప్పుడు కొరటాల శివ (Koratala Shiva)దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆరేళ్ల తర్వాత కూడా సోలో హీరోగా వచ్చి ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద తొలిరోజే రూ.172 కోట్లకు పైగా కలెక్షన్స్ వసూలు చేసి మిగతా హీరోలకు టార్గెట్ ఫిక్స్ చేసిన ఈయన ఇప్పుడు హిందీలో వార్ -2 అనే సినిమాలో నటిస్తున్నారు .ఈ సినిమా తర్వాత కేజిఎఫ్ చిత్రాలతో సంచలనం సృష్టించిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)డైరెక్షన్లో సినిమా చేయబోతున్నారు ఎన్టీఆర్.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×