BigTV English

Car Accident At Jubilee Hills: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద BMW కారు బీభత్సం.. మద్యం మత్తులో రెచ్చిపోయిన డ్రైవర్

Car Accident At Jubilee Hills: జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌ వద్ద BMW కారు బీభత్సం.. మద్యం మత్తులో రెచ్చిపోయిన డ్రైవర్

వివరాల్లోకి వెళ్తే.. మధ్యం మత్తులో యువతీ, యువకులు రెచ్చిపోతున్నారు. తాగి అడ్డగోలుగా రోడ్లపై వాహనాలు నడుపుతూ.. అతివేగం, అజాగ్రత్త, నిర్లక్ష్యపు డ్రైవింగ్‌తో అమాయకుల ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ చెక్ పోస్ట్ వద్ద ఓ కారు భీభత్సం సృష్టించింది. మధ్యం మత్తులో డ్రైవర్ ట్రాఫిక్ పోలీస్ దిమ్మెలను అతివేగంతో ఢీకొట్టాడు. దీంతో కారు టైర్ పగిలిపోవడంతో పాటు ఆయిల్ ట్యాంకర్ నుజ్జునుజ్జు అయింది.

ఇక కారు అదుపుతప్పి రోడ్డుపై అతివేగంగా దూసుకువస్తుండడంతో.. ఇది గమనించిన స్థానికులు భయంతో పరుగులు తీశారు. పోలీస్ దిమ్మెల్ని ఢీకొట్టగానే.. కారు డ్రైవర్ అక్కడి నుంచి పరారయ్యాడు. మద్యం మత్తులో తూలుతూ అక్కడి నుంచి పారిపోయినట్లు స్థానికులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. సంఘటనా స్థలానికి చేరుకుని కారును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.


ఇదిలా ఉంటే.. శుక్రవారం అర్ధరాత్రి హైదరాబాద్ పాతబస్తీలో కారు భీభత్సం సృష్టించింది. మైనర్లు రాష్ డ్రైవింగ్‌తో రెచ్చిపోయారు. హోండాసిటీ కార్‌తో ఓవర్ స్పీడ్‌తో వచ్చిన ఆ కారు.. దబీర్‌పురా ఫ్లైఓర్ ను ఢీ కొట్టింది. దీంతో కారు బోల్తా పడడంతో ఆ మైనర్లకు స్వల్పంగా గాయాలు అయినట్లు తెలుస్తోంది. అయితే కారు దిగి ముగ్గురు పరార్ అయినట్లు సమాచారం. కార్‌ను ప్రస్తుతం పోలీసులు సీజ్ చేసిట్లు తెలుస్తోంది. నెంబర్ ప్లేట్ ఆధారితంగా పోలీసులు విచారణ చేస్తున్నారు. కారు ఓనర్ పేరు సయ్యద్ యూసఫ్ అలీగా గుర్తించారు.

Also Read: డెస్టినేషన్ వెడ్డింగ్ అంటే తెలంగాణ గుర్తు రావాలి – సీఎం రేవంత్ ఆదేశాలు

2022లో కూడా ఈ కారు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో కూడా పట్టుబడినట్లు తెలుస్తోంది. ఇప్పటికి చలానా కట్టలేదు. కారు డివైడర్‌ను ఢీకొట్టగానే ఎయిర్ బెలూన్స్ తెరుచుకున్నాయంటే ఎంత వేగంగా వచ్చారో అర్ధం చేసుకోవచ్చు. ఆ కారు ముందు భాగం అంతా నుజ్జు నుజ్జు అయింది. టైర్లు కూడా ఊడిపోయాయి. ఈ ఘటనలో గాయాలుపాలైన మైనర్లు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఇక స్థానికుల సహాయంతో కారును పక్కకు తీసి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు పోలీసులు.

Related News

Fake APK App: హైదరాబాద్‌లో ఫేక్ ఏపీకే యాప్‌ల ఘరానా మోసం.. రూ.4.85 లక్షలు ఖేల్ ఖతం, దుకాణం బంద్..

Formula-E Race Case: ఫార్ములా-ఈ కార్ రేస్ కేసు.. ఇద్దరు ఐఏఎస్ లపై చర్యలకు విజిలెన్స్ సిఫారసు

Telangana Group-1 Exam: టీజీపీఎస్సీకి హైకోర్టులో రిలీఫ్.. తెలంగాణ గ్రూప్-1 నియామకాలకు గ్రీన్‌సిగ్నల్

Hyderabad News: జూబ్లీహిల్స్ బైపోల్ పై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు, ఇంకా భ్రమల్లో ఆ పార్టీ

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Big Stories

×