E-Paper
Advertisement

Neknampur Lake: అద్దంలా మెరవనున్న నెక్నామ్ పుర చెరువు.. రూ 99.50 కోట్లతో అభివృద్ధి పనులు

Neknampur Lake: అద్దంలా మెరవనున్న నెక్నామ్ పుర చెరువు.. రూ 99.50 కోట్లతో అభివృద్ధి పనులు
Advertisement

Neknampur Lake: సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నెక్నామ్ పురా పెద్ద చెరువును రూ. 99.50 కోట్ల వ్యయంతో అభివృద్ది చేయనున్నట్లు సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ జి. సృజన తెలిపారు. ఆమె పారిశుద్ధ్య పనులను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ నెక్నామ్ పురా చెరువును సందర్శించారు. ఇప్పటికే చెరువులోకి చేరుతున్న నీటిని అమృత్ 2.0 స్కీమ్ కింద చేపట్టిన మళ్లింపు పనులను కూడా ఆమె పరిశీలించారు. పనులపై ఈ సందర్భంగా ఆమె సమీక్ష నిర్వహించారు. పునుల పురోగతిని అడిగి తెల్సుకున్నారు.

కమిషనర్ సృజన

ఈ సందర్భంగా కమిషనర్ పనులకు డెడ్ లైన్ కూడా విధించారు. అనంతరం కమిషనర్ చిత్రపురి కాలనీ మెయిన్ రోడ్డును తనిఖీ చేశారు. రోడ్డుపై పేరుకుపోయే సీ అండ్ వేస్టేజీని ఎప్పటికపుడు తొలగించాలని ఆదేశించారు. చిత్రపురి రోడ్డు విస్తరణకు ప్రతిపాదనలను సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వీలైనంత త్వరగా రోడ్ డెవలప్ మెంట్ ప్లాన్ ను సిద్దం చేసి, ట్రాఫిక్ నియంత్రణ, మౌలిక వసతుల మెరుగుకు పనులు చేపట్టాలని ఆదేశించారు. శానిటేషన్ పనులపై కూడా సిబ్బంది, అధికారులు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టి, ఎప్పటికపుడు క్లియర్ చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా నిర్లక్ష్యం, అలసత్వం వహిస్తే కఠిన చర్యలుంటాయని కూడా కమిషనర్ సృజన స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సర్కిల్-45 సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్, మెయింటనెన్స్ తదితర విభాగాల అధికారులున్నారు.

Advertisement

Also Read: Rajendranagar: ఘోరం.. యువకుడిని చంపి, పెట్రోల్ పోసి నిప్పు పెట్టిన దుండగులు.. ఎక్కడంటే?

మల్కాజ్ గిరి కమిషనర్ సమీక్ష..

సిటీలో ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు చేపట్టిన హెచ్ సిటీ, వరదల నివారణ కోసం ప్రతిపాదించిన ఎస్ ఎన్ డీపీ పనులపై మల్కాజ్ గిరి మున్సిపల్ కమిషనర్ టి. వినయ్ కృష్ణారెడ్డి శనివారం ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. హెచ్ సిటీ పనుల్లో భాగంగా వివిధ ప్రాంతాల్లో నిర్మిస్తున్న మొత్తం నాలుగు ఫ్లై ఓవర్ల పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. ఏఓసీ సెంటర్ ఫ్లైఓవర్, ఆర్కేపురం రోడ్ ఓవర్ బ్రిడ్జి, ఆర్కే పురం రోడ్ అండర్ బ్రిడ్జి, టీకేఆర్ కమాన్ నుంచి మంద మల్లమ్మ వరకు ఫ్లై ఓవర్ వంతెనలను నిర్మిస్తున్నట్లు, వీటికి సంబంధించి టౌన్ ప్లానింగ్ అధికారులు భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. స్ట్రాటెజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రొగ్రామ్ (ఎస్ఆన్ డీపీ)లో భాగంగ 9 కొత్త నాలాల పనులలో 6 నాలాల పురోగతిలో ఉన్నాయని, 3 నాలాలు పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. నాలాల పూడిక తీసే పనులు వేగవంతం చేసి వర్షాకాలం ప్రారంభంకన్నా ముందే నాలాల పూడికతీత పనులు పూర్తి చేయాలని కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షలో చీఫ్ ఇంజనీర్ అశోక్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Summer Destinations: తెలుగు రాష్ట్రాల్లో.. వేసవి విహారానికి సిద్ధమా? అయితే ఈ ప్రాంతాలు చుట్టేయండి!

Related News

సొంత పార్టీని ముంచేస్తున్న నేతల దూకుడు.. కాంగ్రెస్‌ పార్టీలో నెక్స్ట్ ఏ సీనియర్ టార్గెట్?

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

Big Stories

Advertisement
×