Sangareddy Accident: సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశింపూర్ సమీపంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అతివేగంతో వెళ్తున్న ఒక కారు అదుపుతప్పి రోడ్డు డివైడర్ మధ్య ఉన్న విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ భయంకరమైన ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న దంపతులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కనురెప్పపాటులో ఆవిరైన ప్రాణాలు
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడ గ్రామానికి చెందిన దంపతులు ప్రయాణిస్తున్న కారు కాశింపూర్ వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపుతప్పింది. డివైడర్‌పై ఉన్న కరెంటు పోల్‌ను ఢీకొట్టడంతో కారు గాల్లోకి లేచి పల్టీలు కొట్టింది. ఘటనా స్థలంలోనే ఇద్దరూ మృతిచెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. ప్రమాద తీవ్రతకు కారు నుజ్జునుజ్జయ్యింది.
ఘోర రోడ్డు ప్రమాదం.. దంపతులు దుర్మరణం
సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశింపూర్ వద్ద రోడ్డు ప్రమాదం
డివైడర్ మధ్యలో ఉన్న కరెంటు పోల్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు
ప్రమాదంలో రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం గాజులగూడకు చెందిన దంపతులు మృతి
సీసీ కెమెరాలో రికార్డ్ అయిన… pic.twitter.com/oEtU9P4RKK
— BIG TV Breaking News (@bigtvtelugu) November 3, 2026
నెట్టింట వైరల్‌గా సీసీటీవీ దృశ్యాలు
ఈ ఘోర ప్రమాద దృశ్యాలు అక్కడే ఉన్న సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. క్షణాల వ్యవధిలో కారు అదుపుతప్పి కరెంటు పోల్‌ను ఢీకొట్టడం, ఆపై పల్టీలు కొట్టిన దృశ్యాలు చూసేవారిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.
Also Read: తెలంగాణలో ఖేలో ఇండియా ధమాకా.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు!