Big Stories

Munugodu : దళిత దెబ్బ!.. కారును ఏనుగు తొక్కేస్తుందా?

Munugodu : మునుగోడు విజయం టీఆర్ఎస్ కు అత్యవసరం. ఓడితే ఇక కేసీఆర్ పని ఖతం అని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. బీజేపీ, కాంగ్రెస్ లు ఓడితే ఆయా పార్టీలకు పెద్దగా నష్టం ఏమీ ఉండకపోవచ్చు. కారుకే చిక్కులన్నీ. అందుకే, విజయం కోసం సర్వశక్తులు ఒడ్డుతోంది అధికార పార్టీ. ఊరికో ప్రజాప్రతినిధిని దింపి.. భారీ ఎత్తున బలగాన్ని మోహరించి ప్రచారం ఊదరగొడుతోంది. ఇంతా చేస్తున్నా.. పక్కాగా గెలుస్తామనే నమ్మకమైతే లేదు ఆ పార్టీలో. టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ప్రజల్లో అంత మంచి పేరు ఏమీ లేదు. వసూల్ రాజా అంటున్నారంతా. ప్రజా సమస్యలను పట్టించుకోడనేది మరో ఆరోపణ.

- Advertisement -

ఇక, రాజగోపాల్ రెడ్డికి స్థానికంగా ఫుల్ పాపులారిటీ. అవసరమైన వారికి ధన సాయంలో ముందుంటారు. అందుకే, 18వేల కోట్ల కాంట్రాక్టుకు అమ్ముడుపోయారనే ఆరోపణ అంతలా వర్కవుట్ అవుతున్నట్టు లేదు. మరోవైపు, కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పటికీ బలంగానే ఉంది. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా రంగంలోకి దిగి విస్తృత ప్రచారం చేస్తుండటం మరింత అడ్వాంటేజ్ గా కనిపిస్తోంది. ఎటొచ్చి టీఆర్ఎస్ పరిస్థితే క్లిష్టంగా ఉంది. అందుకే, ఇంతటి ప్రచార ఆర్భాటం చేస్తున్నారని అంటున్నారు.

- Advertisement -

పెన్షన్లు, రైతు బంధు లబ్దిదారులపైనే టీఆర్ఎస్ ఆశలన్నీ. ఆ లెక్కన కాసిన్ని ఓట్లు పడే అవకాశమైతే ఉంది. అయితే, హుజురాబాద్ మాదిరే దళిత బంధు దెబ్బ ఈసారి కూడా కారు పార్టీకి తప్పేలా లేదు. పైగా.. ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ నేతృత్వంలోని బీఎస్పీ సైతం బరిలో నిలవడంతో గులాబీ ఓటు బ్యాంక్ భారీగా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటున్నారు. బీఎస్పీ, ప్రవీణ్ కుమార్ లకి ఆ సామాజిక వర్గంలో మంచి ఆదరణ ఉంది. మునుగోడులో సుమారు 10వేలకు పైగా దళిత ఓట్లను బీఎస్పీ చీల్చుతుందని టాక్. ఆ మేరకు టీఆర్ఎస్ కు తీవ్ర నష్టం తప్పకపోవచ్చు. అదే జరిగితే కేసీఆర్ భవిష్యత్తు ఏంటి?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News