E-Paper
Advertisement

ఢిల్లీ స్టార్ హోటల్ లాబీలో రచ్చకెక్కిన హస్తం పొలిటిక్స్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి?

ఢిల్లీ స్టార్ హోటల్ లాబీలో రచ్చకెక్కిన హస్తం పొలిటిక్స్.. క్లారిటీ ఇచ్చిన మంత్రి?
Advertisement

Congress Dispute: ఢిల్లీ హోటల్‌లో తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య గొడవ సోషల్‌ మీడియాలో రచ్చగా మారింది. డీసీసీ అధ్యక్షుల నియామకాల విషయంలో మంత్రి, ఎమ్మెల్యే తిట్టుకున్నారు. కొట్టుకున్నారంటూ పోస్టులు పోటెత్తాయి. అలాంటివేవి జరగలేదని క్లారిటీ ఇచ్చారు మంత్రి దామోదర రాజనర్సింహ. ఇండియా కూటమి ఆందోళనతో ఢిల్లీ దద్దరిల్లింది. ఐతే ఓ స్టార్‌ హోటల్‌లో తెలంగాణ కాంగ్రెస్‌ నేతల గొడవ సోషల్‌ మీడియాలో ర్యాలీ అవుతోంది.

సోషల్ మీడియాలో వైరల్..

సంగారెడ్డి జిల్లా డీసీసీ సహా పార్టీ పదవుల గురించి కొందరు ఢిల్లీ పైరవీలు చేస్తున్నారనే ప్రచరం మంత్రి దామోదర రాజనర్సింహ – జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మి కాంతారావుమధ్య చిచ్చు పెట్టినట్టు తెలుస్తోంది. నీ జిల్లా కాకపోయిన సంగారెడ్డి డీసీసీ విషయంలో ఎందుకు జోక్యం చేసుకుంటున్నావని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారని, లిమిట్స్‌ క్రాస్‌ కావద్దని హెచ్చరించారని సోషల్‌ మీడియాలో కథనాలు పోటెత్తాయి. ఇసుక మ్యాటర్‌ తో ఇద్దరి మధ్య గొడవ మరింత హీటెక్కిందని టాక్‌. నీ హద్దులో నువ్వు ఉండంటూ మంత్రి తనను తిట్టారని ఎమ్మెల్యే లక్ష్మికాంతారావు హైకమాండ్‌కు ఫిర్యాదు కూడా చేశారనే కథనాలు వచ్చాయి.

అంతర్గత కలహాలు..

Advertisement

సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోన్న కథనాలపై మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. కాంగ్రెస్‌లో అంతర్గత కలహాలు కొత్తేమీ కాదన్నారు. లోపల జరిగేది ఒకటైతే.. బయట మరోలా దుష్‌ ప్రచారం చేస్తున్నారన్నారు. తనకు 50 ఏళ్లుగా ఒకే పార్టీ, ఒకే నియోజకవర్గం అన్నారు. పదవులు శాశ్వతం కాదని.. నమ్మకమే శాశ్వతమన్నారు. రాజకీయాల్లో నమ్మకం ముఖ్యమని, నమ్మకంతో నడిచే రాజకీయాలు ముగిసిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వస్తున్న ఇసుక ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదన్నారు మంత్రి దామోదర రాజనర్సింహ.. మొత్తానికి ఢిల్లీ హోటల్లో జరిగిన ఘటన తెలంగాణ కాంగ్రెస్‌లో చర్చనీయాంశంగా మారింది. మంత్రి క్లారిటీ ఇచ్చారు. ఎమ్మెల్యే మన్‌ కీ బాధ ఏంటీ? హైకమాండ్‌కు ఫిర్యాదు చేశారా?చేస్తారా? పార్టీ అధిష్ఠానం ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తుంది? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Also Read: దీపావళి గిఫ్ట్స్ అదుర్స్.. నెటిజన్స్ ఫిదా.. ఇలాంటి కంపెనీలో జాబ్ రావాలి సామీ!

Tags

Related News

కొడంగల్ మహిళకు విముక్తి.. కేటీఆర్ చొరవతో మస్కట్ నుంచి క్షేమంగా తిరిగొచ్చిన లక్ష్మి!

యాదగిరి రావు ఆస్తుల చిట్టా.. ఇప్పటివరకు రూ.4 కోట్లకు పైనే!

వరంగల్ స్టూడెంట్స్‌కు కేటీఆర్ బిగ్ సపోర్ట్.. ‘ఎల్ఐటీ-2026’ ఈవెంట్ పోస్టర్ రిలీజ్!

తుమ్మిడిహెట్టి బ్యారేజీపై.. సీఎం రేవంత్ రెడ్డి హై-లెవెల్ రివ్యూ!

పదో తరగతి పాసైనా చేతికి రాని మెమో.. గద్వాల్లో స్కూల్ యాజమాన్యం వేధింపులు!

సైబర్ నేరాలకు ఇక ఎండ్ కార్డ్.. చేతులు కలిపిన రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు

ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్!

Big Stories

Advertisement
×