Info Edge Diwali Gifts: ప్రముఖ ఐటీ సంస్థ ‘ఇన్ఫో ఎడ్జ్’ (Info Edge) తమ ఉద్యోగులకు అందించే దీపావళి కానుకలతో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. గతంలో లాగే ఈ ఏడాది కూడా సదరు కంపెనీ ఇచ్చిన పండుగ కానుక వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. ఉద్యోగులు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోల ప్రకారం.. ఈసారి దీపావళి గిఫ్ట్ ప్యాక్‌లో అనేక వస్తువులు ఉన్నాయి. ఫిలిప్స్ ఐరన్ బాక్స్, డ్రై ఫ్రూట్స్, యాపిల్స్, ఎల్ఈడీ క్యాండిల్, లడ్డూలను ఈ గిఫ్ట్ ప్యాక్ లో ఉద్యోగులకు అందించింది.
అయితే ఈ గిఫ్ట్ ప్యాక్‌లోని ‘ఐదు యాపిల్ పండ్లు’ ప్రత్యేకంగా నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి. ఇవి వారంలో ఉండే ఐదు పనిదినాలకు సంకేతమేమో అని కొందరు కామెంట్లు చేస్తున్నారు. మరికొందరు ఈ విభిన్నమైన కానుకలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ‘వావ్.. మీ కంపెనీ ట్రెండ్ సెట్టర్’ అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. అయితే చాలా మంది ‘మీ కంపెనీలో ఉద్యోగానికి ఎలా అప్లై చేయాలి?’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
?utm_source=ig_embed&ig_rid=AHHV-Bq9k_su2CGp4YHq46S
ఇన్ఫో ఎడ్జ్ కంపెనీ తమ ఉద్యోగులకు ఇలాంటి వినూత్న కానుకలు ఇవ్వడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది దీపావళి సందర్భంగా ఈ సంస్థ ఇచ్చిన గిఫ్ట్ లు నెట్టింట ట్రెండ్ అయ్యాయి. అప్పట్లో ఉద్యోగులకు వీఐపీ బ్రాండెడ్ సూట్‌కేసులు, స్నాక్ బాక్స్‌లు, ప్రమిదలు అందించారు. అంతకుముందు ఏడాది ‘ఎయిర్ ఫ్రైయర్లు’ కూడా ఇచ్చినట్లు ఉద్యోగులు గుర్తు చేసుకున్నారు. అయితే ఈ కంపెనీ ఇచ్చే కానులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. తమ ఆఫీసుల్లో చిన్న స్వీట్ బాక్స్ తో సరిపెట్టుకుంటే.. ఇన్ఫో ఎడ్జ్ మాత్రం ఆకర్షణీయమైన గిఫ్ట్ లతో ఉద్యోగులను బాగా చూసుకుంటోందని పలువురు ఆకాశానికెత్తేస్తున్నారు.
Also Read: పావురాల బాధ ఎక్కువైందా? ఈ చిట్కాలు ట్రై చేయండి.. దెబ్బకి భయంతో పారిపోతాయ్!
యూపీలోని నోయిడా కేంద్రంగా పనిచేస్తున్న ఈ ప్రముఖ టెక్నాలజీ కంపెనీని 1995లో సంజీవ్ బిఖ్‌చందానీ స్థాపించారు. దేశంలో ఎంతో ఆదరణ పొందిన నౌకరీ డాట్ కామ్ (Naukri.com), 99 ఏకర్స్ (99acres.com), జీవన్ సతి (Jeevansathi.com), శిక్షా డాట్ కామ్ (Shiksha.com) వంటి ప్రముఖ పోర్టల్స్ అన్నీ ఈ కంపెనీ పరిధిలోనివే కావడం విశేషం.
Also Read: అద్దె విషయంలో గొడవ.. వీధి రౌడీలా రెచ్చిపోయిన వ్యక్తి.. వృద్దుడు, మహిళలపై పిడిగుద్దులు!