E-Paper
Advertisement

సైబర్ నేరాలకు ఇక ఎండ్ కార్డ్.. చేతులు కలిపిన రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు

సైబర్ నేరాలకు ఇక ఎండ్ కార్డ్.. చేతులు కలిపిన రాష్ట్రాలు, కేంద్ర సంస్థలు
Advertisement

Cybercrime Coordination: కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (సమన్వయంతో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో టీజీఐసీసీసీలో జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీమ్ హైదరాబాద్ రీజియన్ సమావేశాన్ని నిర్వహించింది. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, బీహార్, ఢిల్లీ, గోవా, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ ఇతర 13 రాష్ట్రాల న్యాయ అమలు సంస్థల నుంచి 45 మంది అధికారులు పాల్గొన్నారు. వీరితోపాటు అలాగే ఐ4సీ, ఎన్సీఆర్బీ, ఆర్బీఐ, ఈడీ, డీవోటీ, సీబీఐ, ఐబీ తదితర సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. తెలంగాణలోని వివిధ విభాగాలకు చెందిన దాదాపు 30 మంది పోలీసు అధికారులు ప్రత్యక్షంగా హాజరయ్యారు. నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ తోపాటు క్వాడ్ కమిషనరేట్లు సహా తెలంగాణలోని ఇతర విభాగాలకు చెందిన సుమారు 50 మంది పోలీసు అధికారులు ఆన్‌ లైన్ ద్వారా పాల్గొన్నారు.

దేశవ్యాప్తంగా..

రాష్ట్రాల మధ్య సమాచార మార్పిడి, దర్యాప్తుల్లో పరస్పర సహకారం, హాట్‌ స్పాట్‌ల గుర్తింపు, నేర ముఠాలపై సంయుక్త చర్యల కోసం కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జాయింట్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ టీంను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా మేవాత్, జామ్‌ తారా, అహ్మదాబాద్, హైదరాబాద్, చండీగఢ్, విశాఖపట్నం, గువాహటిలలో ఏడు టీంలు పనిచేస్తున్నాయి. హైదరాబాద్ టీంను డీజీపీ సీ.వీ.ఆనంద్ ప్రారంభించారు. తెలంగాణ ప్రభుత్వ హోం శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, శిఖా గోయల్, అంతర్-సంస్థాగత సైబర్ సమన్వయంపై ఎజెండాను నిర్దేశించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఐ4సీ సీఈఓ రాజేష్ కుమార్ దేశంలో సైబర్ నేరాల స్థితిగతులను వివరించారు.

తెలంగాణ నెంబర్ వన్..

Advertisement

ఈ సందర్భంగా డీజీపీ శ్రీ ఆనంద్ మాట్లాడుతూ ప్రధానమంత్రి కార్యాలయం నిర్వహించిన గత రెండు సమీక్షల్లో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు. 2024-25లో దేశవ్యాప్తంగా సైబర్ నేరాల ఫిర్యాదులు 24% పెరగగా, తెలంగాణలో 3శాతం తగ్గాయన్నారు. దేశవ్యాప్తంగా నష్టాలు 4శాతం మాత్రమే తగ్గితే, రాష్ట్రంలో 20శాతం తగ్గినట్టు వివరించారు. సైబర్ నేరం ఇప్పుడు ఒక వ్యవస్థీకృత పరిశ్రమగా మారిందన్నారు. నేరం జరిగాక డబ్బు రికవరీ చేయడం నుంచి నేరాన్నే నిరోధించే దిశగా చర్యలు ఉండాలన్నారు. నేరగాళ్లకు లక్ష్యం, బాధితుడిని చేరే మార్గం, ఫోన్ నంబర్, ఉపయోగించుకునే ఖాతా అందకుండా చేయాలన్నారు. సమావేశంలో వచ్చిన సిఫార్సులను ఢిల్లీకి తీసుకెళ్లి దేశవ్యాప్తంగా ఏకీకృత చర్యలు అమలయ్యేలా చర్యలు చేపడతారని ఆశిస్తున్నా అన్నారు.

Also read: మరో కొత్త బిజినెస్ లోకి అడుగుపెట్టిన మహేష్ బాబు.. ఐడియా అదుర్స్!

ఐ4సీ సీఈఓ రాజేష్ కుమార్..

Advertisement

శిఖా గోయల్ మాట్లాడుతూ సైబర్ నేరాలు అత్యంత వ్యవస్థీకృతమైన, దేశాంతర వ్యవస్థగా మారాయన్నారు. ఖాతాలను బ్లాక్ చేస్తూ, స్కామ్ కేంద్రాలను ధ్వంసం చేస్తున్నా చాలా కేసుల్లో సూత్రధారులు పట్టుబడటం లేదన్నారు. నేరగాళ్లు ఒకే నెట్‌ వర్క్‌గా పనిచేస్తుంటే, పోలీసులు అధికార పరిధుల పరిమితుల్లో ఉన్నారన్నారు. కేసుల దర్యాప్తు నుంచి, రియల్ టైం సమాచార మార్పిడి, బహుళ రాష్ట్రాల సంయుక్త ఆపరేషన్లతో కూడిన సమన్వయ, ఇంటెలిజెన్స్ ఆధారిత విధానం వైపు మారాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఐ4సీ సీఈఓ రాజేష్ కుమార్ మాట్లాడుతూ స్కాం కాంపౌండ్‌లు ఆగ్నేయాసియా నుంచి ఆఫ్రికా, శ్రీలంక, ఇతర దేశాలకు తరలిపోతున్నాయన్నారు. డిజిటల్ అరెస్టులపై సుప్రీంకోర్టు విచారణ రాష్ట్రాలు తమ సమస్యలను కోర్టు ముందు ఉంచేందుకు ఒక అవకాశమని పేర్కొన్నారు. దర్యాప్తు అధికారుల పనిని సులభతరం చేసే రెండో తరం సంస్కరణలను వివరించారు.

కర్ణాటక సైబర్ కమాండ్..

సైబర్ నేరాల నివారణ, ఛేదన, అంతర్-రాష్ట్ర సవాళ్లు, హోం మంత్రిత్వ శాఖ సమన్వయంపై కర్ణాటక సైబర్ కమాండ్ డీజీపీ ప్రోనబ్ మొహంతి, ఐ4సీ డీసీపీ రష్మి శర్మ యాదవ్ కొన్ని సిఫార్సులు చేశారు. ఐ4సీ, ఎన్సీటీసీ డైరెక్టర్ శ్రీ పంకజ్ దేశ్‌ముఖ్ మహిళలు, పిల్లలపై ఆన్‌ లైన్ నేరాలపై సూచనలు ఇచ్చారు. ఏఐ..చట్టపరమైన చట్రం, జవాబుదారీతనంపై తెలంగాణ, తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలో అమల్లో ఉన్న ఉత్తమ పద్ధతులపై సైబర్ చట్ట నిపుణులు పవన్ దుగ్గల్ మాట్లాడారు. నోడల్ అధికారులు, ఎస్కలేషన్ ప్రోటోకాల్‌ లు, ఐ4సీ వేదికల వినియోగాన్ని పెంచడం, బ్యాంకులు, టెలికాం, డిజిటల్ వేదికల నివారణా చర్యలు, మ్యూల్ ఖాతాలు, వ్యవస్థీకృత ముఠాలపై సమన్వయ వ్యూహం, సంయుక్త అంతర్-రాష్ట్ర ఆపరేషన్లు, కాలపరిమితితో కూడిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. సైబర్ మోసానికి గురైనవారు వెంటనే 1930కు కాల్ చేయాలని లేదా www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలని సూచించారు.

Also read: 2014 నుంచి దేశానికి దరిద్రం.. అమిత్ షాకు ఎంపీ చామల చురకలు!

Tags

Related News

ఒక్క పిల్లర్ కూడా కొట్టుకుపోలేదు.. మేడిగడ్డ బ్యారేజీ వద్ద వేముల ప్రశాంత్ రెడ్డి సవాల్!

జీడీమెట్ల సర్కిల్‌లో దారుణం.. పారిశుధ్య కార్మికులను వేదిస్తున్న సూపర్వైజర్!

2014 నుంచి దేశానికి దరిద్రం.. అమిత్ షాకు ఎంపీ చామల చురకలు!

నన్ను సీఎం అనకండి.. మైక్ బంద్ చేస్తా.. సభలో కార్యకర్తలపై బండి సంజయ్ ఫైర్!

ఆ ఒక్క తప్పుతో.. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌ వల్ల తెలంగాణకు లక్ష కోట్ల నష్టం?

మురసు తుఫాన్ ఎఫెక్ట్‌.. తెలంగాణలో భారీ వర్షాలు, పలు ప్రాంతాలకు రెడ్ అలర్ట్

గిరిజన మహిళపై వేటేస్తే.. మరి మీ సంగతేంటి? శ్రీధర్ బాబు టార్గెట్‌గా ఎంపీ వంశీకృష్ణ సెటైర్లు!

Big Stories

Advertisement
×