
President: ప్రజ్ఞారెడ్డి. వీహెచ్‌పీ నేత పుల్లారెడ్డి స్వీట్స్ యజమాని జి.రాఘవరెడ్డి కోడలు. చాలాకాలంగా ఆమె అత్తింటి వారిపై పోరాటం చేస్తున్నారు. తనను శారీరకంగా, మానసికంగా వేధించారని.. చంపాలని కూడా చూశారని పదే పదే ఆరోపించారు. తాజాగా, హైదరాబాద్ కు విచ్చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ప్రజ్ఞారెడ్డి లేఖ రాయడం మరింత కలకలం రేపింది. ప్రజ్ఞారెడ్డి.. రాష్ట్రపతికి లెటర్ రాయడం వెనుక కారణం లేకపోలేదు. తన పర్యటనలో భాగంగా ద్రౌపది ముర్ము.. నారాయణమ్మ ఇంజినీరింగ్ కాలేజీని సందర్శించనుండటమే ప్రజ్ఞారెడ్డి లేఖ రాయడానికి రీజన్. ఎందుకంటే ఆ కాలేజ్ రాఘవరెడ్డికి చెందింది కావడమే. ఇంతకీ అసలేం జరిగిందంటే…
నారాయణమ్మ కాలేజీని నిర్వహిస్తున్న జి.రాఘవరెడ్డి ఆయన భార్య భారతి రెడ్డి, వారి కుమార్తె శ్రీవిద్య రెడ్డిలు రెండేళ్లుగా తనని, తన కూతురుని వేధిస్తున్నారని, చంపేందుకు ప్రయత్నించారని.. రాష్ట్రపతికి లేఖ రాశారు ప్రజ్ఞారెడ్డి. అదనపు కట్నం కోసం తనని హింసించారని.. తాను, తన 8 ఏళ్ల కూతురుని ఇంటి నుంచి బయటకి రాకుండా రాత్రికి రాత్రే గది బయట గోడ కట్టారని ఆరోపించారు. కోర్టు కూడా వారిపై ఆగ్రహం వ్యక్తం చేసిందని.. గది బయట గోడ కూల్చి వేయమని ఆదేశించడంతో.. అధికారులు ఆ గోడ కూల్చేశారని లేఖలో తెలిపారు ప్రజ్ఞారెడ్డి.
ఒక మహిళగా మీరు నా పరిస్థితిని అర్ధం చేసుకుని నాకు న్యాయం చేస్తారని ఎదురు చూస్తున్నానని రాష్ట్రపతికి రాసిన లేఖలో ప్రజ్ఞారెడ్డి కోరారు. ఇప్పటికే తమ పలుకుబడితో మమల్ని, దర్యాప్తు సంస్థలని బెదిరిస్తున్న రాఘవరెడ్డి, భారతిరెడ్డి, శ్రీ విద్య రెడ్డి, ఏకనాథ్ రెడ్డిలు.. నారాయణమ్మ కాలేజీలో రాష్ట్రపతి విజిట్ తర్వాత మరింతగా మమ్మల్ని హెరాస్ చేస్తారేమోనని, దర్యాప్తు సంస్థలను ఇన్ఫ్లూయెన్స్ చేస్తారని ఆందోళన చెందుతున్నానంటూ ప్రజ్ఞారెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దయచేసి తనకు, తన కూతురికి న్యాయం చేయాలని ద్రౌపది ముర్మును లేఖలో కోరారు.