E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక.. షాకైన కొనుగోలుదారుడు, రంగంలోకి అధికారులు

పెరుగు ప్యాకెట్‌లో చనిపోయిన ఎలుక.. షాకైన కొనుగోలుదారుడు, రంగంలోకి అధికారులు
Advertisement

Warangal: ప్రభుత్వ సంస్థల మాదిరిగా ప్రైవేటు సంస్థలు తయారవుతున్నాయి. కొన్నాళ్లు కిందట కూల్ డ్రింక్స్‌ లోపల రకరకాల వస్తువులు కనిపించేవి. వాటిని చూసి కొనుగోలుదారులు షాకైన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు అలాంటి ఘటనలు అప్పుడప్పుడు వెలుగులోకి వస్తాయి. తాజాగా పెరుగు ప్యాకెట్ లోపల చనిపోయిన ఎలుక కనిపించడంతో వినియోగదారుడు షాకయ్యాడు. అసలు ఏం జరిగింది?

వరంగల్‌లో కొనుగోలుదారుడికి ఊహించని షాక్

Advertisement

వరంగల్‌ నగరం ఎస్‌ఆర్‌ఆర్‌ తోట ప్రాంతంలో ఓ కిరాణా షాపులో పెరుగు ప్యాకెట్ కొనుగోలు చేశాడు వినియోగదారుడు. ఆ ప్యాకెట్‌ని ఇంటికి తీసుకెళి కట్‌ చేశాడు. అందులో చనిపోయిన ఎలుక పిల్ల కనిపించడంతో నోటి మాట రాలేదు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కిరాణా యజమానిని నిలదీశాడు.

అతడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నేరుగా అధికారులకు ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన అధికారులు, పెరుగు ప్యాకెట్‌ విక్రయించిన కిరాణా షాపును పరిశీలించారు. ఎక్కడా ఏమీ కనిపించలేదు. ఈ ఘటనతో ఆ బ్యాచ్‌కి సంబంధించిన పెరుగు ప్యాకెట్ల అమ్మకాలు నిలిపి వేశారు అధికారులు.

Advertisement

కిరాణా షాపులో పెరుగు ప్యాకెట్ కొనుగోలు..  కట్ చేస్తే చనిపోయిన ఎలుక దర్శనం

చచ్చిన ఎలుకతో ప్యాకెట్ చేసినవాటిని జనగామ-50 ప్యాకెట్లు, కరీమాబాద్, లక్ష్మీపురం మార్కెట్‌, హనుమకొండ భవానీనగర్‌లోని షాపుల్లో పెరుగు ప్యాకెట్లను సీజ్‌ చేశారు అధికారులు. తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు వాటిని విక్రయించొద్దని షాపు యజమానులను ఆదేశించారు. ఈ ఘటనతో వరంగల్‌ జిల్లా ఫుడ్‌ ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు.

వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. ఎలుక పడిన ప్యాకెట్ల బ్యాచ్‌కు సంబంధించిన శాంపిల్స్‌ను హైదరాబాద్‌ ల్యాబ్‌ పంపించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే పెరుగు తయారు చేసిన కంపెనీ నుంచి వివరాలు తీసుకున్నట్లు సమాచారం.

ALSO READ: హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు 

Related News

అమెరికాలో తెలుగు యువకుడి మృతి.. ఉన్నత చదువులు.. ఆపై అనంతలోకాలకు

హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు

సిద్ధిపేట మున్సిపాలిటీపై కాంగ్రెస్ కన్ను.. సీటు కొట్టేందుకు గాంధీభవన్‌లో వేసిన బిగ్ ప్లాన్ ఇదే..?

వరంగల్, ఖమ్మంలో బీజేపీ అంత వీకా?.. మున్సిపల్ ఎన్నికల ముందే లీకైన బీజేపీ పార్టీ బలహీనతలు!

Spy Camera: హైదరాబాద్ మహిళలకు గుడ్ న్యూస్.. కీలక నిర్ణయం తీసుకున్న పోలీసులు..!

IKP Commission: మహిళా సంఘాలలో దారుణం.. కోట్ల రూపాయల కమీషన్లు నొక్కేస్తున్న అధికారులు!

ఆ తప్పు చేయొద్దు.. ‘సర్’ విషయంలో కేడర్‌ని అలర్ట్ చేసిన కేటీఆర్.. అర్జున్‌రెడ్డి హిట్-రేవంత్‌రెడ్డి ఫిల్మ్ ప్లాప్

Big Stories

×