E-Paper
Advertisement

హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు

హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాక్.. దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం, ఇకపై కఠిన చర్యలు తప్పవు
Advertisement

South Central Railway: దక్షిణ మధ్య రైల్వే అధికారులు హైదరాబాద్ వాసులకు షాక్ ఇచ్చారు. సిటీలోని ఎంఎంటీఎస్ రైల్వే‌స్టేషన్ల ప్లాట్‌ఫారాలపై మార్నింగ్ వాక్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ మేరకు అనధికారికంగా నడిచే వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులు ఆదేశాలు వెళ్లాయి.

హైదరాబాదీలకు దిమ్మతిరిగే షాకిచ్చిన దక్షిణ మధ్య రైల్వే 

Advertisement

హైదరాబాద్ సిటీలో ప్రతిరోజూ ఉదయం వ్యాయామం చేసేవారికి దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఊహించని షాక్ ఇచ్చారు. సిటీలో పలు ఎంఎంటీఎస్ రైల్వే స్టేషన్ల ప్లాట్‌ఫారాలపై మార్నింగ్ వాక్ చేయడాన్ని పూర్తిగా నిషేధించింది. ఈ నిబంధనను ఉల్లంఘిస్తే జరిమానాలు, విచారణ ఉంటాయని రైల్వే అధికారులు హెచ్చరించారు.

ప్రశాంత వాతావరణం ఉండే రైల్వే స్టేషన్లను ఆశ్రయించే వందలాది మంది వాకర్ల దినచర్యకు కొత్త నిబంధన బ్రేక్ వేసింది. ప్లాట్‌ ఫారాలపై అనధికారికంగా నడిచేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు పైస్థాయి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మల్కాజ్‌గిరి , సఫిల్‌గూడ, రామకృష్ణపురం గేట్, క్యాలరీ బ్యారక్స్, దయానంద్ నగర్, సీతాఫల్‌మండిలోని MMTS స్టేషన్లలో ఈ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి.

Advertisement

ఎంఎంటీఎస్ రైల్వే‌స్టేషన్ల ప్లాట్‌ఫారాలపై మార్నింగ్ వాక్  నిషేధం

ఉల్లంఘించే వారిపై జరిమానాలు, కేసులు నమోదు చేయడం జరుగుతుందని స్టేషన్ అధికారులు వెల్లడించారు. ప్రతీ రోజూ ఉదయం వాకింగ్‌కు వెళ్లేవారు తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు ఖాళీగా ఉండే ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకునేవారు. రైల్వే శాఖ అధికారులు తీసుకున్న నిర్ణయంపై ఆయా ప్రాంతాల వాసులు కాసింత ఆగ్రహం వ్యక్తం చేశారు.

రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాన్ని సిటీలోని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్లు.. స్థానికుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అధికారుల ప్రకటనను సోషల్ మీడియా వేదికల ద్వారా వాకర్స్‌కు చేరవేస్తున్నారు. రైల్వే ప్లాట్‌ఫారాలపై వాకింగ్ నిషేధంపై స్థానిక కాలనీ వాసులను అప్రమత్తం చేశామని యునైటెడ్ ఫెడరేషన్ ఆఫ్ ఆర్డబ్ల్యూఏస్ సభ్యులు తెలిపారు.

ALSO READ: సిద్దిపేట్ మున్సిపాల్టీపై కాంగ్రెస్ కన్ను..  గాంధీభవన్‌లో బిగ్ ప్లాన్

అనవసరంగా జరిమానాలు పడకుండా అడుగులు వేయాలని సూచించినట్లు వివరించారు. అనధికార వ్యక్తులు పెద్ద సంఖ్యలో నడవడానికి రైల్వే ప్లాట్‌ఫారమ్‌లను ఉపయోగించుకుంటున్నారు. దీని ఫలితంగా మార్నింగ్ వేళ ప్లాట్‌ఫారమ్‌లపై జనసమ్మర్ధం ఏర్పడుతోంది. రైలు వెళ్లేటప్పుడు చాలామంది పరిగెత్తుకుంటూ వచ్చి ఎక్కుతున్నారు.

రైళ్లు దిగేటప్పుడు ప్రయాణికులకు భద్రతకు ప్రమాదాలు పొంచి ఉన్నట్లు దక్షిణ మధ్య రైల్వే గుర్తించింది. వాకర్స్ ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బెంచీలను సైతం ఆక్రమించుకుంటున్నారని తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నిషేధాన్ని ఉల్లంఘించిన వారిపై రైల్వే చట్టం 1989లోని సెక్షన్ 147. సెక్షన్ 146 కింద విచారణకు బాధ్యులు అవుతారని పేర్కంది. అంతేకాదు MMTS ప్లాట్‌ఫారాలపై హిందీ, తెలుగు, ఇంగ్లీష్ భాషలలో నోటీసు బోర్డులను ప్రదర్శించాలని రైల్వే అధికారులు డిసైడ్ అయ్యారు.

Related News

అరెస్టులకు భయపడేది లేదు.. అన్నదాతల తరఫున పోరాటం ఆపేది లేదు!- రామచందర్ రావు

తెలంగాణలో ఉద్యోగుల పోరుబాట.. సీఎస్ చర్చలు ఫెయిల్.. ఇక తేల్చుకోవడమే!

చిన్న చేపలతో పెద్ద మేలు.. మత్స్యశాఖ తెస్తున్న ఈ స్పెషల్ పౌడర్ ప్రత్యేకత ఏంటో తెలుసా?

హైదరాబాద్‌కు బ్లూమ్‌బెర్గ్ ప్రశంసలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

హైదరాబాద్‌కి పోటీగా వరంగల్.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆదేశాలు!

ఖైరతాబాద్ గణేష్ భక్తులకు బిగ్ అలర్ట్.. 23వ తేదీ రాత్రి వరకే దర్శనాలు!

అర్ధరాత్రి పిల్లల వార్డులో పేలిన ఏసీ.. ఆదిలాబాద్ రిమ్స్ లో ఘోర అగ్నిప్రమాదం, రంగంలోకి అధికారులు

కాంగ్రెస్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. 22A భూములపై మానవ హక్కుల కమిషన్ నోటీసులు జారీ!

Big Stories

Advertisement
×