E-Paper
Advertisement

Venkatagiri Politics: ఆఫీస్ మెట్లు ఎక్కాలంటే ‘ఆమె’ పర్మిషన్ ఉండాల్సిందేనా? వెంకటగిరి టీడీపీలో అసలేం జరుగుతుంది?

Venkatagiri Politics: ఆఫీస్ మెట్లు ఎక్కాలంటే ‘ఆమె’ పర్మిషన్ ఉండాల్సిందేనా? వెంకటగిరి టీడీపీలో అసలేం జరుగుతుంది?
Advertisement

Venkatagiri Politics: ఆ నియోజకవర్గం తెలుగు తమ్ముళ్లు ఎందుకంత అసంతృప్తితో కనిపిస్తున్నారు? టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అన్ని వ్యాపారాలు నావే..నేను చెప్పిందే ఇక్కడ జరగాలంటూ తమ్ముళ్లకు వార్నింగులు ఇస్తుండటంతో వారు విసిగి వేసారి పోయారా? మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వారి భర్తలు, కుటుంబ సభ్యులు పెత్తనం చెలాయిస్తున్న ఘటనలు తరచుగా వింటుంటాం. కానీ ఈ నియోజకవర్గంలో అధికార పార్టీ ఎమ్మెల్యే భార్య ఇంట్లో నుంచి ఆధిపత్యం చేస్తూ, షాడో ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్నారంట. ఇప్పుడు అదే టీడీపీ శ్రేణులకు తలనొప్పిగా మారి, ఆ జిల్లాలో హాట్ టాపిక్‌గా మారిందంట. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అసలు ఆ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది…?

టిడీపీకి తలనొప్పిగా మారిన వెంకటగిరి నియోజకవర్గం

తిరుపతి జిల్లాలో కొనసాగుతున్న వెంకటగిరి నియోజకవర్గం ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా టీడీపీ పెద్దలకు తలనొప్పిగా మారిందంట. గతంలో వెంకటగిరి నెల్లూరు జిల్లాలో కొనసాగింది. వైసీపీ హయాంలో జరిగిన జిల్లాల పునర్విభజనలో భాగంగా వెంకటగిరి తిరుపతి జిల్లాలో కలిసింది. ఈ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి మంచిపట్టుంది. 2019 ఎన్నికల్లో వెంకటగిరి నుంచి వైసీపీ అభ్యర్ధిగా గెలిచిన ఆనం రామనారాయణరెడ్డి ప్రస్తుతం కూటమి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.

వెంకటగిరి రాజకీయానికి షాక్

Advertisement

టీడీపీ ఆవిర్భావం తర్వాత వెంకటగిరిలో కాంగ్రెస్ నుంచి గెలిచిన నేదురుమల్లి కుటుంబం లైమ్ లైట్ లో లేకపోవడం, తర్వాత వైసీపీ నుంచి గెలిచిన ఆనం టీడీపీలో ఉండటంతో అక్కడ ప్రతిపక్షానికి చెప్పుకోదగ్గ నాయకుడు లేకుండా పోయారు. ఇక టీడీపీ నుంచి ప్రస్తుతం మూడో సారి విజయం సాధించిన కురుగొండ్ల రామకృష్ణ కుటుంబ రాజకీయాలు సొంత పార్టీకే తలనొప్పిగా మారాయంట. దాంతో వెంకటగరిలో ఇప్పుడు అక్కడ రాజకీయం శూన్యత కనిపిస్తోంది.

రాజకీయ విజయాల కథ

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో కీలకంగా వెలుగొందిన వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీరుతో రాజకీయాలు వాడివేడిగా మారాయి. 2024 ఎన్నికల్లో తన కుమార్తెకు వచ్చిన టికెట్ ని క్యాన్సిల్ చేయించి, తాను టికెట్ తెచ్చుకొని గెలిచారు కురుగొండ్ల రామకృష్ణ. ఈ నియోజకవర్గంలో ఒకప్పుడు బలమైన ప్రతిపక్షమే ఉండేది. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న మాజీ దివంగత ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుటుంబాన్ని ఎదుర్కొని నిలబడ్డారు కురుగొండ్ల రామకృష్ణ. 2019 ఎన్నికల్లో ప్రస్తుత టిడిపి మంత్రి, అప్పటి వైసీపీ అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొన్నా అప్పటి పరిస్థితుల్లో కురుగొండ్ల ఓటమి చెందారు.

తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి

Advertisement

2024 లో కురుగొండ్ల గెలిచాక నియోజకవర్గంలో పరిస్థితులు తారుమారయ్యాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్లలో అంతర్మధనం, అసంతృప్తి ఎక్కువైందనే టాక్ వినిపిస్తోంది..ద్వితీయ, తృతీయ శ్రేణి క్యాడర్ పార్టీకి దూరమవ్వలేక, ఎమ్మెల్యేని వ్యతిరేకించలేక అంతర్మధనంతో రగిలిపోతున్నారట. తొలి నుంచి పసుపు జెండాలు కప్పుకుని పార్టీకి అండగా నిలిచిన క్యాడర్, ముఖ్య నేతలు ఎమ్మెల్యే తీరుతో విసిగిపోతున్నా… పార్టీని వీడలేక సైలెంట్ అవుతున్నారంట.

ఎమ్మెల్యే రూట్ మార్పు

గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణను గెలిపించేందుకు తెలుగు తమ్ముళ్లు తీవ్రంగానే కృషి చేశారు. ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లో ఎమ్మెల్యే కురుగొండ్ల రూట్ మార్చారట. అక్కడ ఏ పని జరగాలన్నా ఎమ్మెల్యే సతీమణి సింధు కనుసన్నల్లోనే జరగాలంటున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఆనం రామనారాయణ రెడ్డి కొంతకాలం వైసీపీలో ఉండి అక్కడ తిరుగుబాటు చేసి, టీడీపీలోకి వచ్చారు.. అయితే ఆయన వెంకటగిరి సీటు తిరిగి ప్రయత్నం చేసినప్పటికీ, కురుగొండ్ల వైపే మొగ్గు చూపిన టీడీపీ అధిష్టానం, ఆనంను ఆత్మకూరుకు పంపింది.

ఎక్కడా అక్రమం చేయనన్న కురుగొండ్ల

ఆ సమయంలో టీడీపీ నుంచి అటు ఆనం కు, ఇటు కురుగొండ్లకు సపోర్టుగా నిలిచిన నేతలు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వివిధ వ్యాపారాల్లో ఓ రూపాయి సంపాదించుకోవచ్చని ఆశ పడ్డారు. వెంకటగిరిలో కొంతమంది టీడీపీ నేతలు సైలెంట్ గా ఇసుక, గ్రావెల్ వంటివి రవాణా చేసుకుంటూ రూపాయి వెనకేసుకునే ప్రయత్నం చేశారట. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఎక్కడన్నా అక్రమ వ్యాపారాలు చేస్తే చూస్తూ ఊరుకోనని తీవ్ర హెచ్చరికలు చేసి, అప్పట్లో హైలెట్ అయ్యారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్యే సదరు వ్యాపారాలన్నింటిని అన్ని తన వారితోనే చేయిస్తున్నారంట.

సింధూ ప్రభావంతో టిడీపీ నేతల అసంతృప్తి

ఇదే కాకుండా నియోజకవర్గంలో లే అవుట్లు, పోలీస్ స్టేషన్ పంచాయతీలు, టీటీడీ లెటర్లు వంటి అంశాల్లోనూ ఎమ్మెల్యే ఏకఛత్రాధిపత్యం కొనసాగుతుండటంతో తెలుగు తమ్ముళ్లలో అసంతృప్తి పెరిగిపోతోందట. ముఖ్యమైన నేతలు తమ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లే ఆయన కోపంతో విరుచుకుపడుతున్నారట. దీంతో ఏమి చేయలేక తలలు పట్టుకున్నారట టిడిపి నేతలు. ఆ క్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల సతీమణి సింధు పెత్తనం మరీ ఎక్కువవ్వడం నేతలను మరింత రగిలిపోయేలా చేస్తోందంట. తనకు తెలియకుండా నియోజకవర్గంలో ఏం జరగడానికి వీల్లేదని సింధూ కండిషన్ పెట్టేసారట. దీంతో దిక్కుతోచక టిడిపిలోని కొంతమంది ముఖ్య నేతలు సైలెంట్ అయిపోయారట. అసలు ఎమ్మెల్యే ఆఫీస్ ముఖమే చూడటం మానేశారంట.

వెంకటగిరి రాజకీయ వ్యూహం

గతంలో కురుగొండ్ల రామకృష్ణ కుమార్తె లక్ష్మీ సాయి ప్రియ కి టికెట్ ఇప్పించడంలో కురుగొండ్ల వియ్యంకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన గంగా ప్రసాద్ కీలకపాత్ర పోషించారు. దాంతో ఎక్కడ నియోజకవర్గంలో తన ప్రాధాన్యత తగ్గిపోతుందో అన్న భయంతో ఆ టికెట్ కోసం రామకృష్ణ మొండిపట్టు పట్టి మరి టికెట్ తెచ్చుకున్నారు. తర్వాత తనను గెలిపించిన వారందరికీ ఆయన తన వైఖరితో దూరమవుతున్నారు. ఎమ్మెల్యే కురుగొండ్ల గెలుపు కోసం కీలకంగా పనిచేసిన కొంతమంది నేతలు ఈ మధ్య కొన్ని సమస్యల్లో ఇరుక్కున్నారట. వారి పొలాలు, లేఆవుట్ల స్థలాల వ్యవహారాల్లో కొన్ని ఆర్థిక సమస్యలు తలెత్తి, పోలీస్ స్టేషన్ పంచాయతీల వరకు వెళ్లాయంట.

వెంకటగిరి రాజకీయాల రచ్చ

దాంతో వారంతా ఇక మీరే దిక్కు అంటూ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తే, తానేమీ చేయలేనంటూ కురుగొండ్ల చేతులెత్తేశారంట. అయితే ఆ వ్యవహారాల సెటిల్‌మెంట్లో మేడం సింధు కీలకపాత్ర పోషించారన్న టాక్ వినిపిస్తోంది… మరోవైపు నియోజకవర్గంలో అనేక మండలాల్లో నేతలు ఎమ్మెల్యే తీరుపై రగిలిపోతూ సొంత క్యాడర్ను ఏర్పాటు చేసుకుంటున్నారట. ఇప్పుడు వస్తున్న వ్యతిరేకతతో, అసంతృప్తితో వచ్చే ఎన్నికల్లో కురుగొండ్ల రామకృష్ణ పోటీ చేస్తారా..లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ పరిణామాల నేపధ్యంలో నియోజకవర్గంలో తన సత్తా చూపించుకోవాలని ఆయన కుమార్తె లక్ష్మీ సాయిప్రియ పొలిటికల్‌గా మరింత యాక్టివ్ అవుతున్నారంట. ఆమె మామగారు గంగాప్రసాద్ కోడలుకి టికెట్ ఇప్పించుకోవాలని ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తున్నారట. అయితే కురుగొండ్ల మాత్రం వచ్చే ఎన్నికల్లోనూ తన సతీమణికి టికెట్ వచ్చేలా చేయాలని చూస్తున్నారట. అందుకోసమే నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, మండలాల స్థాయి నేతలతో తన సతీమణికి డైరెక్ట్ యాక్సిస్ ఇచ్చేలా ఎమ్మెల్యే వ్యవహరిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.

నేదురుమల్లి రామ్ కుమార్ రడ్డి వ్యూహాలు

ఈ పరిణామాలు అన్నింటిని సైలెంట్ గా గమనిస్తున్న వైసీపీ తిరిగి ఎలాగైనా బలపడాలని చూస్తోందంట. ప్రస్తుతం వెంకటగిరి వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా మాజీ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కుమారుడు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయన పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ఓటమి తర్వాత పెద్దగా యాక్టివ్‌గా లేని రామ్‌కుమార్‌రెడ్డి.. ఎమ్మెల్యే కురుగొండ్ల వైఖరితో విసిగిపోయిన టీడీపీ క్యాడర్ను తన గుప్పిట్లోకి తీసుకొచ్చుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారంట.

పార్టీలోకి కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నం

అటు వైసీపీలో వర్గ పోరు ఉన్నప్పటికీ వారందరినీ ఏకం చేసుకుంటూ పార్టీలోకి కొత్తవారిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారంట. జనసేన, బిజెపి నేతలు కూడా ఎమ్మెల్యే పట్ల కొంత వ్యతిరేకతతో ఉన్నట్లు తెలుస్తోంది. చివరకు తిరుమలలో స్వామి వారి దర్శనం కోసం లెటర్ అడిగితే దానికి 100 కారణాలు చెబుతున్నారట ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది. మేడంని అడిగి రండి..తర్వాత తేదీ ఖాళీ ఉందో లేదో చెబుతామని పంపించేస్తున్నారట.

తన గొయ్యి తానే తవ్వుకుంటున్న కురుగొండ్ల

మొత్తానికి కురుగొండ్ల వారు తన గొయ్యి తానే తవ్వుకుంటున్నట్లు… సొంత పార్టీలోని నేతలతో వైరం పెంచుకుంటూ అభాసుపాలు అవుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారాలన్నీ అమరావతి కి చేరాయట. మంత్రి నారా లోకేష్ తో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం వెంకటగిరి వ్యవహారంలో ప్రత్యేక దృష్టి పెట్టాలని ఉమ్మడి నెల్లూరు జిల్లా అధిష్టానాన్ని ఆదేశించినట్లు సమాచారం. మరి ఇప్పటికైనా మూడో సారి ఎమ్మెల్యే అయిన కురుగొండ్ల తన స్టైల్ మారుస్తారో లేదో చూడాలి.

Also Read: 20 వేల ఎకరాల భూ స్కామ్.. ఫైళ్ల దహనం వెనుక ‘అదృశ్య హస్తం’ ఎవరిది?

Story by: Apparao, Big Tv

Related News

యూట్యూబ్ లో అప్ లోడ్ అయిన మొదటి సినిమా ఏంటో తెలుసా ?

Construction Waste: హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్‌లో నివసిస్తున్నారా? అయితే బీ కేర్‌ఫుల్..?

స్మగ్లర్ల ధనదాహానికి 530 ప్రాణాలు బలి.. రోహింగ్యాలు జలసమాధి వెనుక ఉన్న బిగ్ స్కెచ్ ఇదేనా..?

Future City: ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో భూములు కొన్నారా?.. అయితే మీకో షాకింగ్ న్యూస్..!

యువ సంగ్రామ సదస్సు దేనికి సంకేతం?.. నిరుద్యోగుల కోసం కేసీఆర్ చేసిన టాప్ 5 స్టెప్స్ ఇవే!

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై వివాదం.. జపాన్ మాజీ మంత్రి ఆరోపణలపై భారత్ క్లారిటీ!

అంగన్వాడీలకు గుడ్ న్యూస్.. ‘తల్లికి వందనం’ వర్తింపు.. ఆ మూడు రోజుల్లోనే అకౌంట్లలోకి రూ. 13 వేలు!

108 సంఖ్యకు అంత ప్రాముఖ్యత ఎందుకో ఎప్పుడైనా ఆలోచించారా ?

Big Stories

Advertisement
×