Big Stories

GHMC : ఎమ్మెల్యేలకు ఎర కేసు నిందితుడి నిర్మాణాలు కూల్చివేత..కారణమిదేనా?

GHMC : హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లో రెండు నిర్మాణాలను జీహెచ్‌ఎంసీ టౌన్‌ప్లానింగ్‌ అధికారులు కూల్చివేశారు. దక్కన్‌ కిచెన్ సమీపంలో ఉన్న ఈ నిర్మాణాలను పోలీసు బందోబస్తు మధ్య పడగొట్టారు. ఈ నిర్మాణాలు ఎమ్మెల్యేల ఎర కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌కు చెందినవని అధికారులు తెలిపారు. దక్కన్‌ కిచెన్‌ను ప్రమోద్‌ అనే భాగస్వామితో నందకుమార్‌ నిర్వహిస్తున్నారు. దక్కన్‌ కిచెన్‌ హోటల్‌ ఎదురుగా అక్రమ నిర్మాణం చేపట్టి వాడుతున్నట్టు జీహెచ్‌ఎంసీ అధికారులు ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండా దక్కన్‌ కిచెన్‌ ప్రాంగణంలో రెండు నిర్మాణాలు చేపట్టారని తెలిపారు. నోటీసులు ఇచ్చినా పనులు కొనసాగించడంతో కూల్చివేశామని స్పష్టం చేశారు.

- Advertisement -

రాజకీయ కక్షతో కూల్చివేత
ఈ కూల్చివేతలను నందకుమార్‌ భార్య చిత్రలేఖ ఖండించారు. రాజకీయ కక్షతో కూల్చివేశారని ఆమె ఆరోపించారు. తమకు గతంలో నోటీసు ఇచ్చినా లీజు అగ్రిమెంట్‌ ను రిప్లైగా ఇచ్చామని వెల్లడించారు. దుకాణాల లోపల ఉన్న వస్తువులు తీసుకోవడానికి సమయం ఇవ్వలేదని తెలిపారు. గతంలో అదే ప్రాంతంలో ఉన్న తిక్‌ షేక్‌ ఫ్యాక్టరీ నిర్మాణం సక్రమం అయితే ప్రస్తుతం అక్రమ నిర్మాణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ఈ భూమి లీజుపై దగ్గుబాటి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారని చిత్రలేఖ వివరించారు. ఆధారాలను అధికారులకు అందిస్తామన్నారు.

- Advertisement -

జీహెచ్‌ఎంసీ ఏం చెప్పిందంటే
దక్కన్ కిచెన్ హోటల్ ముందు భాగంలో ఎలాంటి నిర్మాణాలకు అనుమతి లేదని జీహెచ్ ఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఇప్పటికే మూడుసార్లు నోటీసులు ఇచ్చామని వెల్లడించారు. గతేడాది కూడా ముందుభాగంలో ఉన్న నిర్మాణాలను సీజ్ చేశామని తెలిపారు. నెల కిందట నోటీసులు ఇస్తే లీజ్ అగ్రిమెంట్ పంపిచారని వివరించారు. కానీ అక్రమ నిర్మాణాలపై వివరణ ఇవ్వలేదన్నారు. దక్కన్ కిచెన్ ముందుభాగంలో రెండు నిర్మాణాలు అక్రమంగా చేపట్టారని జీహెచ్ఎంసీ అధికారులు స్పష్టం చేశారు.అందుకే కూల్చివేశామన్నారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News