BigTV English

Bhatti Vikramarka on DSC: త్వరలోనే మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క!

Bhatti Vikramarka on DSC: త్వరలోనే మరో డీఎస్సీ: భట్టి విక్రమార్క!

Bhatti Vikramarka on DCS: నిరుద్యోగ సమస్యపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. త్వరలోనే మరోసారి డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. అభ్యర్థులు డీఎస్సీ హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకుంటున్నారని తెలిపారు. కొంత మంది అభ్యర్థులు పరీక్షను వాయిదా వేయాలని కోరుతున్నారు. ధర్నాలు కూడా చేస్తున్నారు. కానీ పరీక్ష వాయిదా వేస్తే పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నారు.


త్వరలోనే పోస్టుల సంఖ్య పెంచి మరో డీఎస్సీ నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటికే 2 లక్షలకు పైగా అభ్యర్థులు హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారని అన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశాం అని చెప్పారు. తెలంగాణ తెచ్చుకున్నదే యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసం. అధికారంలోకి రాగానే 17 వేల ఉపాధ్యాయ ఖాళీల గుర్తించి 11 వేల టీచర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. 19,717 మంది టీచర్లకు పదోన్నతులు ఇచ్చాం అని వెల్లడించారు.

ఈ నెల 11వ తేదీ నుంచి డీఎస్సీ హాల్‌టికెట్లు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని నెలలుగా అభ్యర్థులు పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. జూలై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహిస్తాం. పరీక్షలు వాయిదా వేయాలని అభ్యర్థుల ధర్నాలు చేస్తున్నారు. గ్రూప్- 2ను ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేయడం జరిగింది. పరీక్షలు అన్ని సార్లు వాయిదా వేయడం సరికాదు. ఉద్యోగాలు ఇవ్వడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుంది. హాస్టల్ వెల్ఫేర్‌కు సంబంధించి 585 ఉద్యోగాలకు పరీక్ష నిర్వహించాం. త్వరలోనే 5 లేదా 6 వేల పోస్టులతో మరో డీఎస్సీ ఉంటుందని తెలిపారు.


Also Read: నిరుద్యోగుల ధర్నాలకు చెక్.. డీఎస్సీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్

ఉద్యోగుల జీవితాలతో బీఆర్‌ఎస్ ఆటలాడింది. అంతే కాకుండా నిరుద్యోగులను గాలికి వదిలేసింది. పదేళ్లు డీఎస్సీని ఎందుకు నిర్వహించలేదు. గత ప్రభుత్వం ఓట్ల కోసం ఎన్నికల ముందునోటిఫికేషన్ విడుదల చేసింది. బీఆర్ఎస్ పాలనలోగ్రూప్ 1 గ్రూప్ -2, డీఎస్సీ పరీక్షలు నిర్వహించకుండా నిరుద్యోగులను గాలికి వదిలేసింది. నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు నిర్వహించలేకపోయింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే నోటిఫికేషన్ లు ఇస్తూ ఉద్యోగాలను భర్తీ చేస్తోందని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×