BigTV English

Key Bills In Telangana Budget 2024: బడ్జెట్ లో భట్టి విక్రమార్క.. ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..!

Key Bills In Telangana Budget 2024: బడ్జెట్ లో భట్టి విక్రమార్క.. ప్రవేశపెట్టే బిల్లులు ఇవే..!

అగ్రికల్చర్, విద్యకు బడ్జెట్​లో అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీలకు నిధుల కేటాయింపు పెరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని పంచాయతీరాజ్ శాఖకు పెద్దఎత్తున కేటాయింపులు చేయనున్నారు. రుణమాఫీకి 31 వేల కోట్ల రూపాయలు, రైతు భరోసాకు 14 వేల కోట్ల రూపాయలు, రైతుబీమా, పంటల బీమా, విత్తన సబ్సిడీకి పెద్ద ఎత్తున పద్దు పెట్టనుంది. ఎడ్యుకేషన్‌కు కూడా మంచి కేటాయింపులు ఉంటాయని తెలుస్తోంది.


ఇరిగేషన్‌కు 25 వేల కోట్ల రూపాయలు పైనే కేటాయించనున్నది. మూసీ రివర్‌ ​ఫ్రంట్‌కు కూడా బడ్జెట్​లో నిధులు కేటాయించనున్నట్టు తెలుస్తోంది. జీత భత్యాలు, పెన్షన్లు, అప్పుల కిస్తీలు, వడ్డీలకు అవసరమైన మేరకు కేటాయింపులు చేయనున్నారు. GSDPలో 3 శాతం అప్పుల రూపంలో సమకూరుతాయి. రానున్న ఆర్థిక సంవత్సరంలో ట్యాక్స్ రెవెన్యూ 1.70 లక్షల కోట్ల రూపాయలకు పైన వస్తుందని అంచనా వేస్తున్నారు. నాన్ ట్యాక్స్ రెవెన్యూ 25వేల కోట్ల రూపాయలు నుంచి 30 వేల కోట్ల రూపాయలు రాబట్టుకోవాలని ప్రతిపాదనలు చేశారు.

Also Read: సీఎం రేవంత్ ఉచ్చులో కేసీఆర్, రాత్రి ఇంట్లో ఏం జరిగింది?

60 వేల కోట్ల రూపాయలు వరకు అప్పులు తీసుకోనున్నారు. ఇతరత్రా అన్నీ కలిపితే బడ్జెట్​ 2.95 లక్షల కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశముంది. పదేళ్ల కాలంలో గత BRS సర్కారు బడ్జెట్‌ను వాస్తవానికి 10 శాతం నుంచి 12 శాతం వరకు పెంచుతూ వచ్చింది. అయితే, ఈ సారి అంకెలు మార్చి గారడీ చేయకుండా.. ఎంత వస్తుందో అంతే పెట్టుకునేలా కాంగ్రెస్​ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు తెలిసింది.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×