E-Paper
Advertisement

Shamshabad Airport : చాక్లెట్‌ ప్యాకెట్లలో వజ్రాలు.. భారీగా పట్టుబడ్డిన విదేశీ నగదు..

Shamshabad Airport : చాక్లెట్‌ ప్యాకెట్లలో వజ్రాలు.. భారీగా పట్టుబడ్డిన విదేశీ నగదు..
Advertisement

Shamshabad Airport : శంషాబాద్‌ విమానాశ్రయంలో భారీగా వజ్రాలు, విదేశీ నగదు పట్టుబడ్డింది. డీఆర్‌ఐ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఈనెల 10న హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు ప్రయాణికులు దుబాయ్‌కి వెళ్లడానికి శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చారు. వారి ప్రవర్తనపై భద్రతా అధికారులకు అనుమానం వచ్చింది. వారిని అదుపులోకి తీసుకుని సామాగ్రిని క్షుణ్నంగా తనిఖీలు చేశారు.

చాక్లెట్‌ ప్యాకెట్లలో తెలుపు రంగు కాగితంలో చుట్టిన పొట్లాలు ఉన్నాయి. తెరిచి చూడగా అందులో రూ.6.03 కోట్లు విలువైన వజ్రాలు ఉన్నాయి. రూ.9.83 లక్షల విదేశీ నగదు, రూ.లక్ష ఇండియన్‌ కరెన్సీ దొరకడంతో అధికారులు విస్తుపోయారు. వారి దగ్గర పట్టుబడిన వజ్రాలు, నగదుకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో ఇద్దరినీ అరెస్టు చేశారు.

Advertisement

.

.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×