Super Star Krishan:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీకి మూల స్తంభంగా మిగిలిన వారిలో ఎన్టీఆర్ (NTR ),ఏఎన్నార్(ANR ), కృష్ణంరాజు(Krishnam Raju), సూపర్ స్టార్ కృష్ణ(Krishna ) వంటి వారి పేర్లు ప్రధమంగా వినిపిస్తాయి. ఇకపోతే ఇప్పట్లో ఎలా అయితే హీరో, హీరోకి మధ్య పోటీ నెలకొంటుందో.. అప్పట్లో ఈ పోటీ ఇంకా గట్టిగా ఉండేది. ముఖ్యంగా ఒక హీరో పై కసితో ఇంకో హీరో ఏకంగా ఒకే ఏడాది 10 నుంచి 18 సినిమాలు విడుదల చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే అప్పట్లో హీరోలు ఎంత కసిగా సినిమాలు రిలీజ్ చేసే వాళ్ళో అర్థమవుతోంది. ఈ క్రమంలోనే సీనియర్ ఎన్టీఆర్ మీద కసితోనే కృష్ణ ఏకంగా మూడు రికార్డులు క్రియేట్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారని సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ఏడాదికి ఒక్క సినిమాకే కష్టపడుతున్న ఇప్పటి హీరోలు..
ఈ కాలంలో అయితే తెలుగు హీరోలు ఏడాదికి ఒక్క సినిమా చేయడమే అత్యంత కష్టంగా మారిపోయింది. ఇప్పుడు సీనియర్ హీరోల నుంచి యంగ్ హీరోల వరకు ప్రతి ఒక్కరిది ఇదే సమస్య. ఏడాదికో లేక రెండేళ్లకో ఒక సినిమాతో మాత్రమే ప్రేక్షకులను పలకరిస్తున్నారు. ఇక రాజమౌళి డైరెక్షన్లో సినిమాలైతే.. ఇక రెండేళ్లకు పై మాటే.. అటు మహేష్ బాబు (Mahesh Babu), ఎన్టీఆర్ (NTR), రామ్ చరణ్ (Ram Charan), అల్లు అర్జున్ (Allu Arjun), ప్రభాస్ (Prabhas) లాంటి ఈ జనరేషన్ అగ్ర హీరోలు కూడా నెమ్మదిగానే సినిమాలు చేస్తున్నారు. ఒక రకంగా చెప్పాలి అంటే వీరందరి సినిమా కెరియర్ స్టార్ట్ అయ్యి దాదాపు 15 ఏళ్లకు పైగానే అవుతున్నా.. కొద్దో గొప్ప సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. వీరితో పోల్చుకుంటే కాస్త ప్రభాస్ నయమనే చెప్పాలి. ప్రస్తుతం ఆయన చేతిలో ఐదారు ప్రాజెక్టులు ఉండడంతో ఏడాదికి రెండు సినిమాలతో వస్తానని హామీ కూడా ఇచ్చారు
ఏకంగా 18 చిత్రాలు రిలీజ్ చేసిన కృష్ణ..
మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు. . ఇండస్ట్రీలోకి వచ్చి చాలా ఏళ్లవుతున్నా.. ఇప్పటికీ కేవలం 28 చిత్రాలు మాత్రమే చేశారు. ఇప్పుడు రాజమౌళి దర్శకత్వంలో 29వ సినిమా చేస్తున్నారు. అయితే ఈ హీరోలు తమ సినీ కెరియర్లో ఇన్ని సినిమాలు చేస్తే.. కృష్ణ మాత్రం కేవలం రెండు సంవత్సరాల లోనే ఇన్ని సినిమాలు చేసి రికార్డులు సృష్టించారు. 1972లో ఒకే ఏడాది 18 చిత్రాలు రిలీజ్ చేసి అందరిని ఆశ్చర్యపరిచారు. 1973లో 15, 1974లో 14 సినిమాలు రిలీజ్ చేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యపోయే మరో విషయం ఏమిటంటే ఏడాదికి అన్ని సినిమాలు చేసినా..అందులో దాదాపు 80% సక్సెస్ రిజల్ట్ లభించింది. పైగా ఈ చిత్రాలలో ఒక చిత్రానికి నేషనల్ అవార్డు కూడా లభించింది. ఇకపోతే కృష్ణ ఇలాంటి రికార్డ్స్ క్రియేట్ చేయడానికి కారణం సీనియర్ ఎన్టీఆర్ మీద ఉన్న కసే అని అప్పట్లో గట్టిగా వార్తలు వినిపించాయి. అసలు విషయంలోకెళితే.. 1964లో ఎన్టీఆర్ ఒకే ఏడాది 17 సినిమాలు రిలీజ్ అయ్యాయి. ఇక ఆయన రికార్డును ఎవరు బ్రేక్ చేయలేరని అప్పట్లో వార్తలు కూడా వినిపించాయి. వాస్తవానికి సీనియర్ ఎన్టీఆర్ ని చూసే కృష్ణ ఇండస్ట్రీలోకి వచ్చారు. కానీ రాజకీయాల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి .ఆ కారణంతోనే ఎన్టీఆర్ రికార్డును బ్రేక్ చేయలేరని అప్పట్లో కొంతమంది కామెంట్లు చేయగా.. కృష్ణ కసితో విశ్రాంతి లేకుండా 1972లో ఏకంగా 18 చిత్రాలు రిలీజ్ చేసి ఎన్టీఆర్ రికార్డ్స్ ను బ్రేక్ చేసి తానేంటో నిరూపించారు కృష్ణ. అప్పటినుంచి ఇప్పటివరకు ఈ రికార్డును అటు భవిష్యత్తులో కూడా మరెవరు చెరపలేరని చెప్పవచ్చు.
Pawan Kalyan: అగ్ని ప్రమాదంలో పవన్ కళ్యాణ్ కొడుకు.. సింగపూర్ బయలుదేరి పవన్ కళ్యాణ్, చిరు దంపతులు..!