E-Paper
Advertisement

ఆస్పత్రి ఖర్చులకు భయపడక్కర్లేదు.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్రం బంపర్ ఆఫర్!

ఆస్పత్రి ఖర్చులకు భయపడక్కర్లేదు.. ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు కేంద్రం బంపర్ ఆఫర్!
Advertisement

Ambedkar Medical Scheme: స్వేచ్ఛ బ్యూరో: పేదరికంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు తీవ్ర అనారోగ్యం వస్తే ఆస్పత్రి ఖర్చులు భరించడం చాలా పెద్ద భారమవుతుంది. అలాంటి వారికి ఆర్థికంగా చేయూతనందించి, నాణ్యమైన వైద్యం అందించడానికే కేంద్ర ప్రభుత్వం ‘డాక్టర్ అంబేద్కర్ వైద్య సహాయ పథకం’ ను అమల్లోకి తెచ్చింది. కేంద్ర సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని డాక్టర్ అంబేద్కర్ ఫౌండేషన్ (DAF) ద్వారా 2004 జనవరి నుంచి ఈ పథకం విజయవంతంగా అమలువుతోంది. ఈ పథకం ముఖ్య వివరాలను సూర్యాపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి ఇటీవలే ఒక ప్రకటనలో వెల్లడించారు.

అర్హతలు, ఆదాయ పరిమితి

Advertisement

కుటుంబ వార్షిక ఆదాయం రూ. 5 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన పేదలు ఈ పథకానికి అర్హులు. తీవ్రమైన, ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతూ శస్త్రచికిత్సలు, సుదీర్ఘ చికిత్సలు అవసరమైనప్పుడు ఈ ఫౌండేషన్ ఆర్థిక సాయం అందిస్తుంది.

ఏ వ్యాధికి ఎంత సాయం?

Advertisement

మూత్రపిండాల శస్త్రచికిత్స / డయాలసిస్ / అవయవ మార్పిడికి రూ. 3.50 లక్షలు, క్యాన్సర్ చికిత్సలు (శస్త్రచికిత్స, కీమోథెరపీ, రేడియోథెరపీ)కి రూ. 2.50 లక్షలు, మెదడు శస్త్రచికిత్స (బ్రెయిన్ సర్జరీ) ఇతర ప్రాణాంతక వ్యాధులకి రూ. 2.00 లక్షలు, గుండె శస్త్రచికిత్స , వెన్నెముక (స్పైన్) శస్త్రచికిత్సకి రూ. 1.50 లక్షలు కేంద్రం గరిష్ఠ ఆర్థిక సాయం అందించింది.

2026లో వచ్చిన ముఖ్యమైన సవరణలు

ఈ పథకాన్ని మరింత మంది పేదలకు చేర్చాలనే ఉద్దేశంతో 2026లో కేంద్ర ప్రభుత్వం ఇందులో కొన్ని కీలక మార్పులు చేసింది. దీని ప్రకారం సహాయం లభించే తీవ్ర వ్యాధుల జాబితాను పెంచడంతో పాటు, లబ్ధిదారులు చికిత్స పొందేందుకు వీలుగా నెట్‌వర్క్ ఆసుపత్రుల సంఖ్యను కూడా గణనీయంగా పెంచారు.

దరఖాస్తు చేసుకోవడం ఎలా?

అర్హత కలిగిన బాధితులు నిర్దేశిత దరఖాస్తు నమూనాను భర్తీ చేసి, అవసరమైన వైద్య పత్రాలతో పాటు పోస్టు ద్వారా దరఖాస్తు పంపాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫారమ్‌లు, నిబంధనలు , ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల జాబితా కోసం కేంద్ర సామాజిక న్యాయ సాధికారత మంత్రిత్వ శాఖ అధికారిక వెబ్‌సైట్ dosje.gov.in ను సందర్శించవచ్చు.

Also Read: ఉప్పరపల్లి ప్లాట్ల సమస్యపై ‘ప్రజావాణి’లో వినతి.. స్పందించిన డాక్టర్ చిన్నారెడ్డి

Tags

Related News

ఆర్‌టీసీ గుర్తింపు ఎన్నికల వేల.. కాంగ్రెస్‌ పార్టీకి షాకిచ్చిన ఎమ్మెల్యే కూనంనేని!

తెలంగాణలో ఉచిత చేప పిల్లల పంపిణీ.. ఏ జిల్లాలకు ఎంత? పూర్తి వివరాలివే!

తెలంగాణలో కొత్త బార్లకు నోటిఫికేషన్ విడుదల.. దరఖాస్తులు తేదీలివే?

బేగంబజార్‌లో నకిలీ నోట్ల దందా.. పోలీసులకు చిక్కిన రాజస్థాన్ యువకుడు!

మంత్రి పదవి రూమర్లకు చెక్ పెట్టిన రాజ్‌గోపాల్‌ రెడ్డి.. చివరికి ఎమన్నారంటే?

హెచ్‌సీఏ వర్సెస్ టీసీఏ.. ముదురుతున్న తెలంగాణ క్రికెట్ వివాదం!

అల్లుడి నోట్లో శనిలా రేవంత్, ఉత్తమ్!.. నీటి సంక్షోభంపై జీవన్ రెడ్డి ఘాటు విమర్శలు!

మీ భూమి 22A జాబితాలో ఉందా? పెండింగ్ యూఎల్సీ దరఖాస్తులపై సర్కార్ కీలక నిర్ణయం!

Big Stories

Advertisement
×