Prashanth Varma Cricket : ‘హనుమాన్’ (Hanuman) మూవీతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిన ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ (Prashanth Varma). ఆయన కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు మల్టీ టాలెంటెడ్. సినిమాలకు దర్శకత్వం వహిస్తూనే మరోవైపు క్రికెట్ పై తనకున్న ప్యాషన్ ని కంటిన్యూ చేస్తున్నాడు ప్రశాంత్ వర్మ. తాజాగా ఆయన క్రికెట్ ఆడుతూ పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతుంది. దాన్ని చూసాక సీసీఎల్ (CCL) లో తీసుకోకుండా తప్పు చేశారు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
క్రికెట్ లో ప్రశాంత్ వర్మ ఊచకోత
అ, కల్కి, జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలతో ప్రేక్షకుల మెప్పు పొందుతున్న డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ గురించి చెప్పి, అందులోని పాత్రల గురించి సైతం వెల్లడించి బాబోయ్ ఈ డైరెక్టర్ ఇంత టాలెంటెడ్ గా ఉన్నాడేంటి? అనిపించేలా చేశాడు. కానీ ఆయన టాలెంట్ దర్శకత్వం మాత్రమే కాదు, స్పోర్ట్స్ లో కూడా ఉంది.
ప్రశాంత్ వర్మ ప్రొఫెషనల్ క్రికెటర్ కూడా అన్న విషయం ఇప్పటికే చాలామందికి తెలుసు. స్కూల్, కాలేజ్ లెవెల్ నుంచే ఆయన క్రికెట్ ఆడుతూ డిస్ట్రిక్ లెవెల్ లో కప్పులు సైతం గెలుచుకున్నాడు. అంతేకాకుండా పలు ప్రైవేట్ టోర్నమెంట్స్ లో కూడా ఆడి ప్రశాంత్ వర్మ క్రికెటర్ గా సక్సెస్ ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. ఆయన బ్యాట్స్మెన్, బౌలర్ కూడా… అత్యధిక రన్స్ సాధించి బెస్ట్ బ్యాట్స్మెన్ , బెస్ట్ బౌలర్ గా సత్తా చూపించి అవార్డులు కూడా అందుకున్నాడు. అంతేకాకుండా సెలబ్రిటీ క్రికెట్ లీగ్ లో ఆడి అదరగొట్టాడు ప్రశాంత్ వర్మ.
తాజాగా ఆయన CC 11 మ్యాచ్ ఆడుతూ కనిపించారు. ఈ మ్యాచ్ లో ప్రశాంత్ వర్మ జెర్సీపై ‘జై హనుమాన్’ అని ఉండడం విశేషం. అంతేకాకుండా ప్రశాంత్ వర్మ 46 బాల్స్, 61 రన్స్ చేసినట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన తను క్రికెట్ ఆడుతున్న వీడియోని షేర్ చేశారు.. దీంతో ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సీసీఎల్ లోకి తీసుకోకుండా తప్పు చేశారా?
ప్రశాంత్ వర్మ వీడియోను చూసిన నెటిజన్లు “నువ్వు సీసీఎల్ లో వస్తావని ఎదురు చూస్తుంటే ఇక్కడ ఆడుతున్నవా? ఎవరెవరో అందులో ఆడుతున్నారు. నువ్వు అందులో ఆడకుండా, ఇక్కడ ఏం చేస్తున్నావ్?” అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో ప్రశాంత్ వర్మ లాంటి మంచి టాలెంట్ ఉన్న క్రికెటర్ ను సీసీఎల్ లోకి తీసుకోకుండా తప్పు చేయరనే టాక్ నడుస్తోంది.
ఇదిలా ఉండగా ప్రశాంత్ వర్మ క్రికెట్ కు సంబంధించి పోస్ట్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ ఆయన క్రికెట్ ప్రాక్టీస్ వీడియోలు, తను క్రికెట్లో సాధించిన విజయాలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. తాజాగా ఆయన మరోసారి బ్యాట్ పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే ప్రశాంత్ వర్మ కేవలం క్రికెటర్ మాత్రమే కాదు మంచి బ్యాడ్మింటన్ ప్లేయర్ కూడా. పలు టోర్నమెంట్స్ లో బ్యాడ్మింటన్ ఆడి ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా ఆయన మన హైదరాబాద్ ఎస్ఆర్హెచ్ టీంకి ఎన్నో యాడ్స్ డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ ‘హనుమాన్’ సీక్వెల్ ‘జై హనుమాన్’ మూవీతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.