BigTV English
Advertisement

IND vs PAK In Wedding Hall: పెళ్లిలో క్రికెట్ ఫీవర్.. అక్కడ మెరుపులు.. ఇక్కడ ముత్యాల తలంబ్రాలు

IND vs PAK In Wedding Hall: పెళ్లిలో క్రికెట్ ఫీవర్.. అక్కడ మెరుపులు.. ఇక్కడ ముత్యాల తలంబ్రాలు

IND vs PAK In Wedding Hall: ఓ వైపు బాజా భజంత్రీలు.. మరో వైపు ఇండియా క్రికెట్ టీం మెరుపులు.. అన్నీ కలగలిపి అక్కడ ఇండియా విజయం.. ఇక్కడ కళ్యాణం.. ఇలా సాగింది ఆ పెళ్లి. ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు. ఏదేశంతో పోరాడినా శత్రు దేశమైన పాకిస్తాన్ తో పోరాడి విజయాన్ని అందుకుంటే ఆ కిక్కే వేరప్పా అంటున్నారు క్రికెట్ అభిమానులు. అలా క్రికెట్ అంటే యమ క్రేజ్ గల ఆ వరుడు.. తను ఎలాగైనా ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ చూడాల్సిందేనని పట్టుబట్టాడు. ఓ వైపు పెళ్లి.. మరోవైపు క్రికెట్ మ్యాచ్ వీక్షిస్తూ పెళ్లికి వచ్చిన అతిధులు కూడా ఎంజాయ్ చేశారు. ఇలాంటి అరుదైన దృశ్యం కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం వేగురుపల్లిలో కనిపించింది.


ఆదివారం ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ దుబాయ్ లో జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రికెట్ మ్యాచ్ లో ఇండియా గెలవాలని మన భారతీయులు ఎంతగా కోరుకున్నారో.. అలాగే ఇండియా టీమ్ సులువుగా పాకిస్తాన్ ను చిత్తుచిత్తుగా ఓడించింది. అయితే ఈ మ్యాచ్ సాగుతున్నంత సేపు. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరూ టీవీలకు అతుక్కుపోయారు. కొందరు మొబైల్ ఫోన్లలో వీక్షించారు. ఇక్కడ ఓ క్రికెట్ అభిమాని పెళ్లి.. ఆదివారం జరుగుతోంది. ఓ వైపు మ్యాచ్ చూడాలి.. మరోవైపు తప్పక పెళ్లిలో ఉండాలి. ఎలాగైనా క్రికెట్ మ్యాచ్ చూడాల్సిందేనని, వరుడు అతని స్నేహితులు పట్టుబట్టారు. ఇంకేముంది వరుడు తలుచుకుంటే, ఏదైనా జరగాల్సిందే. ఎక్కడైనా పెళ్లి తంతు పెద్ద స్క్రీన్ లపై ప్రసారం చేస్తూ.. పెళ్లికి వచ్చిన అతిధుల సౌకర్యార్థం ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ అవే స్క్రీన్ లపై క్రికెట్ మ్యాచ్ లైవ్ సాగించారు.

వేగురుపల్లి లో వెంకటసాయి – జీవన వివాహ వేడుక ఆదివారం జరిగింది. అయితే స్క్రీన్ పై పెళ్లి లైవ్ కవరేజ్ తో పాటు ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ కూడా ప్లే చేశారు. వేడుకకు హాజరైన వారు పెళ్లితో పాటు మ్యాచ్ ను కూడా చాలా ఆసక్తికరంగా వీక్షించారు. దీంతో ఇండియా – పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలా మంది తమ పనిని పక్కన పెట్టీ మరి మ్యాచ్ ను చూస్తుంటారు. అయితే ఈ వివాహ వేడుకలో ఈ మ్యాచ్ లైవ్ ను రన్ చేయడంతో ఈ జట్ల మధ్య ఎంత రసవత్తరంగా మ్యాచ్ జరిగిందో వరుడు, వధువు, అతిధులు వీక్షించారు. అక్కడ విరాట్ కోహ్లీ మెరుపులు.. ఇక్కడ ముత్యాల తలంబ్రాలు, అక్కడ మన క్రికెటర్స్ అద్భుత బ్యాటింగ్.. ఇక్కడ వధూవరులకు ఆశీర్వచనాలు, అక్కడ మన భారత్ విజయం.. ఇక్కడ మంగళసూత్రం వధువు మెడలో వరుడు కట్టాడు. ఇలా ఆ పెళ్లి తంతు సాగింది.


Also Read: వీటిని వాడితే.. పొడవాటి జుట్టు పక్కా !

భారత క్రికెటర్లు చెలరేగిపోయి పాకిస్తాన్ ను ఇంటికి సాగనంపగా, పెళ్లికి వచ్చిన అతిధులు కూడా పెళ్లిలోనే సంబరాలు జరుపుకున్నారు, ఎంతైనా భారతీయులం కదా.. మనకు ఆ మాత్రం దేశభక్తి ఉంటుంది. అయితే తన పెళ్లి వేడుకలో క్రికెట్ మ్యాచ్ ప్రసారం చేయించిన ఈ జంట ఇప్పుడు టాక్ ఆఫ్ ది తెలంగాణగా మారారు. చివరగా వధూవరులకు శుభాకాంక్షలు చెప్పి, చిరునవ్వులతో అతిధులు వెనుతిరిగారు. మనం కూడా నూతన వధూవరులకు శుభాకాంక్షలు చెప్పేద్దాం!

Related News

Sridhar Babu: యూట పారిశ్రామికవేత్తలతో మంత్రి శ్రీధర్ బాబు భేటీ

Journalists Safety: జర్నలిస్టుల రక్షణకు తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు.. దాడులపై విచారణకు హై పవర్ కమిటీ ఏర్పాటు!

Jubilee Hills By-election: జూబ్లీహిల్స్ ప్రచారంలో కాంగ్రెస్ హోరు.. కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్!

Fee Reimbursement: ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాల నిరసన విరమణ.. రేపటి నుంచి తెరచుకోనున్న కాలేజీలు

FATHI: ఉన్నత విద్యా సంస్థల సమాఖ్యకు హైకోర్టులో చుక్కెదురు.. వారం తర్వాతే సభకు అనుమతి

Maganti Gopinath: మాగంటి మరణంపై బండి సంజయ్ ఫిర్యాదు చేస్తే.. విచారణ ప్రారంభిస్తాం: సీఎం రేవంత్

Hyderabad: హైదరాబాద్‌లో గంజాయి బ్యాచ్ దారుణాలు.. ఆసుపత్రి సిబ్బందిపై కత్తులతో దాడి!

Nizamabad Encounter: రూ.5 కోట్ల పరిహారం చెల్లించాలి.. NHRCని ఆశ్రయించిన రియాజ్ కుటుంబ సభ్యులు

Big Stories

×