BigTV English

Drugs: అమ్మాయిల్లో పార్టీ కల్చర్.. డ్రగ్స్ బాధితులుగా లేడీస్.. బీఅలర్ట్..

Drugs: అమ్మాయిల్లో పార్టీ కల్చర్.. డ్రగ్స్ బాధితులుగా లేడీస్.. బీఅలర్ట్..
girls smoking

Drugs news today(Telugu flash news): మందు, సిగరెట్‌, గంజాయి, డ్రగ్స్ ఇవన్నీ మగవాళ్లే వాడుతున్నారా..? అమ్మాయిలు ఇలాంటి దురలవాట్లకు దూరంగా ఉంటున్నారా..? హైదరాబాద్‌లో పరిస్థితి ఎలా ఉంది..? అంటే డ్రగ్స్‌ విషయంలో యువతులు అబ్బాయిలను మించిపోతున్నారు. మత్తు మందుకు బానిసలు అవుతున్నారు. దమ్‌ మారో దమ్‌ అంటూ మత్తులో జోగుతున్నారు.. డ్రగ్స్‌ వాడుతూ దొరికిపోయిన వాళ్లలో 55 శాతం మంది అమ్మాయిలే ఉన్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్‌లో ఉంటున్న పేరెంట్స్‌ మరి అందులో మీ అమ్మాయి ఏమైనా ఉందో ఓసారి జాగ్రత్తగా గమనించండి. లేదంటే ఆమె అందమైన భవిష్యత్‌ను స్నేహితులు నాశనం చేసే అవకాశం లేకపోలేదు. ఓసారి సీపీ సీవీ ఆనంద్‌ బయటపెట్టిన సంచలన విషయాలు చర్చనీయాంశమయ్యాయి. డ్రగ్స్‌ వాడుతున్నవారిలో 55శాతం మంది యువతులే ఉన్నారనే చేదు నిజం వెలుగు చూసింది.


ఆడ పిల్లల విషయంలో ఇలా చెబుతున్నారేంటని తల్లిదండ్రుల మనసు బాధ పడుతుండవచ్చు. కానీ, స్వయంగా పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ చెప్పిన విషయాలు చూస్తే చెప్పక తప్పడం లేదు. హైదరాబాద్‌ మహానగరం పోష్‌ కల్చర్‌కు అడ్డాగా మారింది. పబ్‌లు, క్లబ్‌లు కామన్‌ అయ్యాయి. యువతులు కూడా ఉద్యోగాలు చేస్తూ బాగా సంపాదిస్తున్నారు. దీనికి తోడు సోషల్‌ లైఫ్‌ పేరుతో వీకెండ్లు పార్టీలకు వెళ్తున్నారు. అయితే వాళ్లు సరైన మార్గంలోనే వెళ్తున్నారా..? లేదా అనేది తల్లిదండ్రులు ఓసారి గమనించాల్సిన అవసరం ఉంది.

ఇటీవల టాలీవుడ్‌ డ్రగ్స్‌ డొంక కదలగా.. అందులో పెద్ద సంఖ్యల మహిళా సెలబ్రిటీల పేర్లు బయటకు వచ్చాయి. సీపీ సీవీ ఆనంద్‌ చెబుతున్నట్లుగా దొరికిన వాళ్లలో 55 శాతం మంది యువతులు డ్రగ్స్ తీసుకుంటున్నారని చెప్పడం హైదరాబాదీలను కలవర పెడుతోంది. మందు తాగడం పార్టీలకు వెళ్లడం అదేం పెద్ద విషయం కాదని.. డ్రగ్స్‌ కేసులో తనపేరు బయటకు రావడంపట్ల వివరణ ఇచ్చిన నటి జ్యోతి మాటలు ఆందోళన కలిగిస్తున్నాయి.


సోషల్‌ లైఫ్‌ పేరుతో మెల్లగా మద్యం మొదలు పెడుతున్న యువతులు.. ఆ తర్వాత సిగరెట్‌.. అటు నుంచి డ్రగ్స్‌కు అలవాటు పడుతున్నారు. తమ స్నేహితుల ఒత్తిడితో మత్తులో మునిగిపోతున్నారు. ఆ తర్వాత వాటికి అడిక్ట్‌ అయిపోయి జీవితాలను ఫణంగా పెడుతున్నారు. పబ్‌లకు వెళ్లకపోతే తమకు స్నేహితులతో సంబంధాలు తెగిపోతాయనే భావన వాళ్లను ఎంతకైనా తెగించేలా చేస్తోంది. అయితే తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి పెడితే డేంజర్‌ నుంచి బయటపడొచ్చు. రాత్రిళ్లు స్నేహితుల ఇంట్లోనే ఉండిపోతున్నామనో.. ఆఫీస్‌లో పార్టీతో లేట్‌ అయింది.. అక్కడే నైట్‌ స్టే చేస్తామని చెబితేనో .. ఓసారి తప్పక అనుమానించండి. ఎవరి పెంపకంపై వాళ్లకు నమ్మకం ఉన్నా.. డ్రగ్స్‌ కూపంలో చిక్కుకోకుండా మీ పిల్లలను కాపాడుకోండి.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×