BigTV English

Car Showrooms : చట్టవిరుద్ధంగా ఉన్న 158 కార్ షోరూమ్స్‌కు నోటీసులు..

Car Showrooms  : చట్టవిరుద్ధంగా ఉన్న 158 కార్ షోరూమ్స్‌కు నోటీసులు..
Notices for 158 illegal car showrooms..


158 illegal notices to car showrooms : ఏ రంగంలో అయినా చట్టవిరుద్ధమైన పనులు జరుగుతూనే ఉంటాయి. అలాగే ఆటోమొబైల్ రంగంలో కూడా. కొన్ని ఆటోమొబైల్ సంస్థలు ఒక షోరూమ్ పెట్టడానికి అనుమతి తీసుకొని, అదే పర్మిషన్ సెర్టిఫికెట్‌తో రెండు, మూడు షోరూమ్స్ పెడుతుంటారు. ఈ విషయాన్ని కప్పిపుచ్చడానికి ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. తాజాగా అలాంటి చట్టవిరుద్ధమైన వ్యవహారాలు పాకిస్థాన్ రాజధానిలో బయటపడ్డాయి.

పాకిస్థాన్ రాజధాని అయిన ఇస్లామాబాద్‌లో చట్టవిరుద్ధంగా స్థాపించిన 158 కార్ షోరూమ్స్‌కు ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ఉత్తర్వులకు తగిన సమయంలోపు సమాధానం ఇవ్వకపోతే.. వారి లీజ్‌ను క్యాన్సల్ చేస్తామంటూ హెచ్చరించింది. ఆ ఉత్తర్వులకు కచ్చితంగా సమాధానం కావాలంటూ అందులో పేర్కొంది. లేకపోతే లీజ్ విషయంలో కఠిన చర్యలు తప్పవని చెప్పింది. ఒకవేళ షోరూమ్స్ అనేవి ఇచ్చిన డెడ్‌లైన్‌లోపు మూసివేయకపోతే షోరూమ్స్‌పైనే కాదు పూర్తిగా ప్రాపర్టీపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటానని ఇస్లామాబాద్ ప్రభుత్వం అంటోంది.


చట్టవిరుద్ధంగా షోరూమ్స్‌ను ఏర్పాటు చేసి బిజినెస్ నడిపిస్తున్నందుకు భారీ జరిమానాలు విధిస్తామంటూ ప్రకటనలో జారీ చేసింది ఇస్లామాబాద్ ప్రభుత్వం. ఒకవేళ ఉత్తర్వులకు లోబడి ఉంటే.. ఓనర్లకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా షోరూమ్స్ నడిపించడాన్ని చట్టబద్ధం చేసి, వేరే ప్రాంతాలలో షోరూమ్స్ ఏర్పాటు చేసి బిజినెస్‌ను కంటిన్యూ చేసే సౌకర్యం కల్పిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది.

షోరూమ్స్ వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేసుకోవడానికి ప్రభుత్వం నుండి అనుమతి కోరితే.. ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నమంటూ ఇస్లామాబాద్ ప్రభుత్వం తెలిపింది. అలా అయితే వారికి జరిమానా నుండి కూడా విముక్తి కల్పిస్తామని చెప్పింది. యాన్యువల్ లైసెన్స్ ఫీజ్‌ను కట్టి వారి ప్రైవేట్ ప్రాపర్టీలలో షోరూమ్స్‌ను కంటిన్యూ చేసుకోవచ్చని తెలిపింది. కేవలం కార్ షోరూమ్స్ విషయంలోనే కాకుండా, హాస్పిటల్స్, ప్రైవేట్ స్కూల్స్, హాస్టల్స్, నర్సరీలు లాంటి వాటి విషయంలో కూడా చట్టవిరుద్ధంగా బిజినెస్‌లు నడిపిస్తున్న వారికి ఇలాంటి చర్యలు తప్పవని హెచ్చరిస్తోంది.

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×