BigTV English

Drugs peddlers: నగరంలో డ్రగ్స్ కలకలం.. 12 మంది అరెస్ట్..

Drugs peddlers: నగరంలో డ్రగ్స్ కలకలం.. 12 మంది అరెస్ట్..

Drugs peddlers: డ్రగ్స్ రహిత నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన వెంటనే ఆ దిశలో అధికారులు అడుగులు వేస్తున్నారు. అందులో భాగంగానే నగరంలో నార్కోటిక్ బ్యూరో అధికారులు చేపట్టిన తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుకున్నారు. 12 మందిని అరెస్ట్ చేశారు.


పట్టు పడిన నిందితులది నెల్లూరు జిల్లా అని నార్కోటిక్ బ్యూరో తెలిపింది. నెల్లూరులోను డ్రగ్స్ పిల్స్ విక్రయించినట్టు నిందితులు బయటపెట్టారు. అయితే ఇందులో ఇంజనీరింగ్ విద్యార్థులతో పాటు, సాప్ట్ వేర్ ఉద్యోగులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

తీగ లాగితే నెల్లూరులో డొంక కదులుతోందన్నట్లు.. నెల్లూరు అర్బన్ డెవలప్‌మెంట్ అథారిటి ఛైర్మన్ కుమారుడు ప్రేమ్‌చంద్‌ బర్త్‌డే వేడుకల కోసం గోవా నుంచి మాదకద్రవ్యాలు తెప్పించడం కలకలం రేపుతోంది.


30 మంది కోసం ఈ డ్రగ్స్ పార్టీ ఏర్పాటు చేశారని.. ప్రముఖ సాఫ్ వేర్ కంపెనీలో ఇంజనీర్లు అందరూ కలిపి ఈ పార్టీ చేసుకున్నట్లు సమాచారం . ప్రశాంతంగా ఉండే నెల్లూరు జిల్లాలో ఈ డ్రగ్స్ వ్యవహారం ఎప్పటి నుంచి జరుగుతుంది. ఇంకా ఎక్కడెక్కడ నుంచి డ్రగ్స్ వస్తున్నాయి ? ఎంత మొత్తంలో విక్రయించారు? ఎవరెవరు కస్టమర్లు ఉన్నారనే కోణంలో నార్కోటిక్ అధికారులు విచారణ చేపట్టనున్నట్లు తెలిపారు.

Related News

Road accident: ఘోర రోడ్డు ప్రమాదం.. బోలెరో ఢీకొనడంతో స్పాట్‌లో ముగ్గురు మృతి

Nagpur Tragedy: దారుణం.. భార్య శవాన్ని బైకుకు కట్టుకుని వెళ్లిన భర్త.. ఎందుకంటే?

Eluru Crime: నడిరోడ్డుపై ఘోరం.. పట్టపగలు తల్లిని కత్తులతో నరికి నరికి, పగ తీర్చుకున్న కొడుకు

Nellore Crime: ఆ వేధింపులు తాళలేక ఇంటర్ విద్యార్థిని సూసైడ్.. పేరెంట్స్ ఏమన్నారంటే?

Customs arrest: ఎయిర్‌పోర్టులో చెకింగ్.. బ్యాగ్ నిండా పురుగులే.. అక్కడే అరెస్ట్!

Odisha murder case: తమ్ముడుని చంపి ఇంట్లోనే పాతేసిన అన్న.. 45 రోజుల తరవాత వెలుగులోకి..

Big Stories

×