Earth quakes in Telangana: తెలంగాణలో పలుచోట్లు భూప్రకంపనలు వచ్చాయి. హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లో భూమి కంపించింది. సడన్‌గా భూమి కంపించడంతో ఆ ప్రాంత ప్రజలు హడలిపోయి భయంతో బయటకు పరుగులు తీశారు.
బుధవారం ఉదయం 7:26 నిమిషాలకు తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. హైదరాబాద్ సిటీ పరిధిలోని వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్ పరిసర ప్రాంతాల్లో భూమి కంపించింది.
రంగారెడ్డి, హనుమకొండ, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ప్రకంపనలు వచ్చాయి. దాదాపు మూడు నుంచి ఐదు సెకన్లపాటు భూమి కంపించినట్టు తెలుస్తోంది. మహబూబాబాద్ జిల్లా గార్ల, బయ్యారం, గూడూరు మండలాల్లో 10 సెకన్ల పాటు భూమి కంపించడంతో ప్రజలు హడలిపోయారు.
రిక్టర్ స్కేలుపై ములుగులో 5.3 , మేడారం వద్ద 4 పైగానే ఉంటుందని అధికారుల అంచనా వేస్తున్నారు. పెద్దపల్లి, గోదావరిఖనిలోని సుల్తానాబాద్, కరీంనగర్, హుజురాబాద్‌లో స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్టు స్థానికులు చెబుతున్నారు.
ALSO READ: బిడ్డా.. లైన్ క్లియర్, కవితకు కేసీఆర్ సంకేతాలు!
భూ ప్రకంపనల ధాటికి ఆయా నగరాల వాసులు భయాందోళనకు గురయ్యారు. కొద్దిసేపటికి ప్రకంపనలు తగ్గడంతో ఆయా ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణలో ఈ స్థాయిలో ఎప్పుడూ రాలేదని అంటున్నారు.
ప్రకంపనల ప్రభావం కొత్తగూడెం మైనింగ్‌పై ఏమైనా ప్రభావం చూపిందా అనేది ఇంకా తెలియాల్సివుంది. ఓవరాల్‌గా పరిశీలిస్తే తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అటు ఏపీలోని విజయవాడ సిటీ, జగ్గయ్యపేట సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు వార్తలు వస్తున్నాయి.
అంతకుముందు అంటే నవంబర్ 30న అసొంలో వచ్చిన భూ ప్రకంపనలు రిక్టర్ స్కేలుపై 2.9 గా నమోదు అయ్యింది. అదే సమయంలో జమ్మూకాశ్మీర్‌లో 5.8గా నమోదైన విషయం తెల్సిందే.
An earthquake with a magnitude of 5.3 on the Richter Scale hit Mulugu, Telangana at 7:27 AM today: National Center for Seismology pic.twitter.com/PKq7BnFxke
— ANI (@ANI) December 4, 2024