Chai – Sobitha Wedding: అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల మరికొద్ది గంటల్లో వివాహం బంధంతో ఒక్కటి కానున్నారు. పెళ్లి వేడుకకు సంబంధించిన పనులు పూర్తి అయ్యాయి. డిసెంబర్ 4 న అంటే నేడే వీరిద్దరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా మూడు ముళ్ల బంధంతో వీరిద్దరూ ఒక్కటి కానున్నారు. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగానికి సంబంధించిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.. ఈరోజు పెళ్లి వేడుకలో నాగ చైతన్య – శోభిత వివాహ బంధం తో ఒక్కటి అవ్వబోతున్నారు. పెళ్లి ఏ టైం కు జరుగుతుంది అనే పూర్తి వివరాలను తెలుసుకుందాం..
ఈ పెళ్లి వేడుక లో భాగంగా కాబోయే వధూ వరులకు ఇటీవల మంగళ స్నానాలు చేయించారు. ఈ నేపథ్యంలోనే శోభితను పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేశారు. మంగళ హారతులు ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అక్కినేని నాగ చైతన్య, శోభిత పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. మరికొన్ని గంటల్లోనే వీరిద్దరూ మూడు ముళ్ల బంధంతో ఒక్కటి కాబోతున్నారు. వీరిద్దరి వివాహంపై ఇండస్ట్రీలో, అభిమానుల్లో ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ఇది నాగ చైతన్యకి రెండవ వివాహం. సమంతతో విడిపోయిన తర్వాత చైతు శోభితని ప్రేమించారు.. రెండేళ్ల పాటు ప్రేమలో ఉన్న తర్వాత పెళ్లికి లైన్ క్లియర్ చేసుకున్నారు. ఆగస్టు 8 పెద్దల సమక్షంలో ఘనంగా నిశ్చితార్థం చేసుకున్నారు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్ గా రాత్రి 8 : 13 గంటలకు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా పెళ్లి చేసుకోబోతున్నారు..
ఈ వేడుకకి ఫ్యామిలీతో పాటు సన్నిహితులు, సినీ రాజకీయ ప్రముఖులని 300 మందిని ఆహ్వానించారు.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబం తో పాటు హాజరు కానున్నారు. ఇక పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ఎస్ఎస్ రాజమౌళి హాజరు కానున్నారు. మొన్న నాగార్జున టయోటా లెక్సస్ వాహనాన్ని కొన్నారు. నాగ చైతన్య పెళ్లి కోసమే సుమారు 2 కోట్లు పెట్టి ఈ కారు కొన్నారని, అయితే దీనిని శోభితకు బహుమతి గా ఇవ్వడం కోసమే తీసుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో పాటుగా విలువైన బంగారు ఆభరణాలను కూడా శోభితకు అక్కినేని ఫ్యామిలీ కానుకలు ఇవ్వనున్నారని సమాచారం.
అలాగే నాగ చైతన్యకు శోభిత తల్లిదండ్రులు భారీగానే కానుకలు ఇవ్వనున్నారని కూడా టాక్ డుస్తోంది. నాగ చైతన్యకు ఒక ఆడీ కారు తో పాటు స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్లు సమాచారం. అంతేకాకుండా హైదరాబాద్‌లోనే ఓ లగ్జరీ విల్లాను కూడా ఇవ్వనున్నారని తెలుస్తుంది. కానీ డబ్బు, నగలు అవసరం లేదని, తమ కొడుకుకి భార్యగా, చక్కటి ఇల్లాలుగా, జీవితాంతం తోడునీడుగా ఉంటే చాలని శోభిత కుటుంబ సభ్యులకు చెప్పినట్లు అక్కినేని కుటుంబం సన్నిహితుల సమాచారం.. ఇక పెళ్లి తర్వాత శోభిత సినిమాలు చేస్తుందా? లేదా అన్నది తెలుయాల్సి ఉంది.. నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ అనే సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఆ మూవీ రిలీజ్ కాబోతుంది.