EC Notice To Rajagopal Reddy : నగదు బదిలీ వ్యవహారంలో మునుగోడు బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డికి… ఈసీ నోటీసులు జారీ చేసింది. రాజ్‌గోపాల్ రెడ్డి కుటుంబ సంస్థ సుశీ ఇన్‌ఫ్రా అండ్ మైనింగ్ లిమిటెడ్ ఖాతా నుంచి మునుగోడు పరిధిలోని 23 మందికి 5కోట్ల 22లక్షల రూపాయలు బదిలీ చేశారని టీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి భరత్ కుమార్… ఈసీకి ఫిర్యాదు చేశారు.
ఓటర్లను ప్రలోభపెట్టేందుకే ఈ మొత్తం బదిలీ చేశారని, విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుపై ఈసీ స్పందించింది. నగదు బదిలీపై సమాధానం చెప్పాలని నోటీసు జారీచేసింది. ఫిర్యాదులోని అన్ని అంశాలపై స్పష్టత ఇస్తూ ఇవాళ సాయంత్రం 4 గంటల్లోపు సమాధానం చెప్పాలని ఈసీ ఆదేశించింది.