BigTV English

Etela Rajender comments : ఎకరా రూ.100 కోట్లపై ఈటల డౌట్!.. ఈ సభతో బీఆర్ఎస్‌కు బై బై..

Etela Rajender comments : ఎకరా రూ.100 కోట్లపై ఈటల డౌట్!.. ఈ సభతో బీఆర్ఎస్‌కు బై బై..
Etela Rajender latest news

Etela Rajender latest news(TS politics):

చట్టసభలపై సీఎం కేసీఆర్‌కు నమ్మకం సన్నగిల్లిందని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌. ఈ ఏడాదిలో అసెంబ్లీ సమావేశాలు కేవలం 14 రోజులు మాత్రమే జరిగాయని.. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 40 రోజులనా నిర్వహించేవారన్నారు ఈటల.


రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి.. పేదల కోసం కాదని.. పెద్దకోసమని విమర్శించారు. ఎమ్మెల్యేలంటే నియోజకవర్గాల్లో ఉంటూ పోలీసుస్టేషన్లకు ఫోన్‌ చేసే వాళ్లుగా మార్చారని ఈటల రాజేందర్‌ మండిపడ్డారు.

జాతీయ పార్టీ అయిన బీజేపీని బీఏసీ సమావేశానికి ఆహ్వానించలేదని.. ముగ్గురు ఎమ్మెల్యేలమున్నా అసెంబ్లీలో ఒక గది కూడా కేటాయించలేదని మండిపడ్డారు. ఉమ్మడి రాష్ట్రంలో 15 పార్టీలున్నా అందరికీ గదులు కేటాయించేవాళ్లని.. బీఏసీ సమావేశానికి ఆహ్వానించేవారని.. ఇప్పుడు నాలుగు పార్టీలే ఉన్నా ఆహ్వానించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ఈటల.


అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగిందని చెప్పడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందన్నారు ఈటల రాజేందర్‌. సభలో స్పీకర్‌ తమపై కన్నెత్తి కూడా చూడలేదన్నారు.

ప్రజలు, ప్రజాస్వామ్యం, చట్టసభలపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి నమ్మకం లేదని.. ఇక ఈ సభతో బీఆర్‌ఎస్‌కు ప్రజలు బై..బై.. చెప్పినట్లేనన్నారు ఈటల రాజేందర్‌. వరదల్లో 41 మంది కొట్టుకు పోయినా సభలో కనీసం సంతాపం తెలపలేదని మండిపడ్డారు.

ప్రభుత్వ భూములు అమ్మవద్దని ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో తాము ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశామని.. అలాంటిది ఇప్పుడు సర్కారు భూములు ఎలా అమ్ముతున్నారని ప్రశ్నించారు ఈటల రాజేందర్. ప్రచారం కోసమే ఎకరా రూ.100 కోట్లు అని చెబుతున్నారని.. రియల్‌ ఎస్టేట్‌ పడిపోలేదని చెప్పేందుకే ఇలా చేస్తున్నారని.. కొత్త డౌట్ క్రియేట్ చేశారు.

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×