BigTV English

Revanth Reddy about Gaddar: లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ.. రేవంత్‌కు గద్దర్ ఇచ్చిన సలహా ఇదే..

Revanth Reddy about Gaddar: లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ.. రేవంత్‌కు గద్దర్ ఇచ్చిన సలహా ఇదే..
Revanth reddy about Gaddar

Revanth reddy about Gaddar(Telangana news live) :

గద్దర్ తనకు ఇచ్చిన చివరి సలహా ఇదేనంటూ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఆసక్తికర విషయాలు చెప్పారు. లిక్కర్ పార్టీ, నిక్కర్ పార్టీ ఒక్కటై కూడబలుక్కున్నాయని.. తనను వ్యూహాత్మకంగా యుద్ధం చేయమని చెప్పారని.. రేవంత్ అన్నారు. బీఆర్ఎస్‌ను లిక్కర్ పార్టీ అని.. బీజేపీ నిక్కర్ పార్టీ అని పరోక్షంగా ప్రస్తావించారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయాయని.. రేవంత్‌ జాగ్రత్తగా పోరాటం చేయాలంటూ గద్దర్ సూచించినట్టు తెలిపారు.


గద్దర్ చెప్పారంటూ మరో ఆసక్తికర అంశమూ వివరించారు రేవంత్‌రెడ్డి. క్రిమినల్‌తో కొట్లాడొచ్చు.. పొలిటీషియన్‌తో కొట్లాడొచ్చు.. కానీ, క్రిమినల్ పొలిటిషియన్‌తో కొట్లాడేటప్పుడు జాగ్రత్త అంటూ గద్దర్ తనతో చెప్పారని రేవంత్ అన్నారు. కేసీఆర్ క్రిమినల్ పొలిటిషియన్ అని.. ఓ క్రిమినల్, పొలిటిషన్ ఎలా ఆలోచిస్తాడో అంచనావేసి పోరాడాలని గద్దర్ తనకు సూచించనట్టు చెప్పారు.

ఢిల్లీలో ప్రెస్‌మీట్ పెట్టి గద్దర్ మరణం, అసెంబ్లీలో తనపై చేసిన విమర్శలపై కేసీఆర్, కేటీఆర్‌లను ఏకిపారేశారు రేవంత్‌రెడ్డి. సభలో కేసీఆర్ ప్రసంగానికికంటే ముందే గద్దర్ మరణవార్త సీఎంకు తెలిసిందని.. వెంటనే సభలో ఆ విషయం ప్రకటించకుండా.. గద్దర్‌కు నివాళులు అర్పించకుండా.. గద్దర్ గొప్పతనంపై అసెంబ్లీలో చర్చ పెట్టకుండా.. కేసీఆర్ దుర్మార్గంగా ప్రవర్తించారని మండిపడ్డారు.


ఇక, గద్దర్ మరణం తర్వాత కూడా కేసీఆర్ ఏమేం చేశారో తనకు తెలుసన్నారు రేవంత్. తనకు ఉన్నతస్థాయి అధికారులు పలు విషయాలు చెప్పాలని.. అవన్నీ చెబితే ఆ అధికారులు ఇబ్బంది పడతారని చెప్పడం లేదన్నారు. గద్దర్ కాళ్లకు దండం పెట్టుకుంటే.. చేసిన పాపాలు కొన్నైనా పోతాయని కేసీఆర్, కేటీఆర్‌లను తాను వదిలేశానని అన్నారు. తాను తలుచుకుంటే కేసీఆర్‌కు గుడ్డలు.. కేటీఆర్‌కు డ్రాయర్ ఉండకపోయేదని హెచ్చరించారు.

గద్దర్ డెడ్‌బాడీని తీసుకొచ్చి ఎల్బీ స్టేడియం గేట్లు తెరిపించింది తామేనని.. ప్రభుత్వ యంత్రాంగం సహకరించకున్నా.. స్టేడియంలో ఏర్పాట్లు చేసింది కూడా తామేనని చెప్పారు. గద్దర్ విషయంలో రాజకీయాలు చేయద్దొనే ఉద్దేశంతోనే.. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరిగేలా చూశామన్నారు.

ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 25కు మించి సీట్లు రావని.. బీఆర్ఎస్‌కు పిండం పెడతామని.. కేసీఆర్‌ను రాళ్లతో కొడతామని.. ఇదే తన శపథం అంటూ రేవంత్‌రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

Related News

Gold: బంగారాన్ని ఆర్టిఫీషియల్ గా తయారు చెయ్యొచ్చా? పరిశోధకులు ఏం చెప్తున్నారంటే?

AP Politics: ఆ టీం మనకొద్దు.. జగన్ కొత్త ప్లాన్..

Siddipet Congress: ఆ జిల్లా కాంగ్రెస్‌లో కుమ్ములాటలు?

Trump tariff: ట్రంప్ టారిఫ్ దెబ్బ.. ఆంధ్రా రొయ్యలు విల విల.. సీ ఫుడ్ ఇండస్ట్రీపై పడే ఎఫెక్ట్ ఎంత?

AP Politics: టీడీపీలోకి గల్లా రీఎంట్రీ? ఎప్పుడంటే?

Chennur Politics: చెన్నూరులో బాల్క సుమన్ చేతులెత్తేశారా?

Big Stories

×