BigTV English

Ex Minister Ktr: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడొద్దు..రేవంత్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్

Ex Minister Ktr: తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినేలా మాట్లాడొద్దు..రేవంత్ కు కేటీఆర్ స్వీట్ వార్నింగ్

Ex Minister Ktr criticised cm Reventh reddy on Industrial policy: ఎన్నికలు అయిపోయాక కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ప్రచ్చన్న యుద్ధం జరుగుతోంది. రేవంత్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని తప్పుపట్టే ప్రయత్నం చేస్తోంది బీఆర్ఎస్. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు లు సీఎం రేవంత్ ను ఓ రేంజ్ లో చెడుగుడు ఆడసుకుంటున్నారు. కేటీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఫైర్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ కు డామేజ్ కలిగించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వ హయాంలో ఎన్నో గొప్ప ప్రాజెక్టులకు రూపకల్పన జరిగిందని అన్నారు. తాను కూడా అమెరికా వెళ్లి అక్కడ ఎన్ఆర్ఐలను ఒప్పించి కీలక ప్రాజెక్టులను తెలంగాణకు రప్పించామని అన్నారు.


పరిశ్రమలు తరలిపోతున్నాయి

దేశం మొత్తం మీద చూసుకుంటే తెలంగాణలోనే తలసరి ఆదాయం ఎక్కువని అన్నారు. సీఎం రేవంత్ అనాలోచిత నిర్ణయాలతో భారీ పరిశ్రమలన్నీ తరలిపోతున్నాయని అన్నారు. జీఎస్టీ రూపంలో అత్యధిక ట్యాక్సులు తెలంగాణ నుంచే వెళుతున్నాయని అన్నారు. సత్తా ఉంటే కేంద్రంనుంచి తెలంగాణకు నిధులు రాబట్టుకోవాలి..అలాగే భారీ ప్రాజెక్టులను తీసుకొచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలని అన్నారు. అవన్నీ వదిలేసి రాష్ట్రం అప్పుల ఊబిలో ఇరుక్కుపోయిందని ..రాష్ట్రాన్ని తక్కువ చేసి మాట్లాడుతున్నారని సీఎంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని క్యాన్సర్ వ్యాధిగ్రస్తులతో పోల్చడం సరికాదని అన్నారు. ఇప్పటికే చాలా పరిశ్రమలు రాష్ట్రం వదిలి పోయ పరిస్థితి దాపురించిందని అన్నారు. కేన్స్ టెక్నాలజీ తెలంగాణను వదిలేసి గుజరాత్ కు వెళ్లిపోయిందని అన్నారు. అమరరాజా బ్యాటరీస్ సంస్థ కూడా సీఎం విధానాలతో చాలా అసహనంతో ఉన్నదని అది కూడా తెలంగాణను వీడేందుకు సిద్ధంగా ఉన్నదని అన్నారు.


అసంతృప్తితో ఉన్న అమర్ రాజా బ్యాటరీస్

మా హయాంలో రాష్ట్రంలో పదివేల కోట్లు పెట్టుబడి పెట్టేలా నానా తంటాలు పడి అమరరాజా బ్యాటరీస్ సంస్థను ఒప్పించామని..అది కూడా ఇప్పుడు రాష్ట్రాన్ని వీడి వెళిపోయేందుకు సిద్ధంగా ఉందన ..ఇందుకు సీఎం అనుసరిస్తున్న పారిశ్రామిక వ్యతిరేక విధానాలే కారణం అన్నారు. కార్నింగ్ ప్లాంట్ కూడా చెన్నైకి తరలి వెళ్లిపోయిందని గుర్తుచేశారు. పరిశ్రమల స్థాపన ద్వారానే నిరుద్యోగ యువతకు ఉపాధి అని అలాంటిది సీఎం పారిశ్రామిక వ్యతిరేక విధానాలకు పాల్పడుున్నారని విమర్శించారు. ఇప్పటికైనా సీఎం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవాలని..హాస్యాస్పద ప్రకటనలు ఇవ్వడం మానుకోవాలని అన్నారు.

Related News

HYDRA Marshals strike: వెనక్కి తగ్గిన హైడ్రా మార్షల్స్.. విధులకు హాజరు.. ఆ హామీ నెరవేర్చకపోతే రాజీనామాలే!

Hydra Marshals: హైడ్రాకు షాక్‌ మార్షల్స్‌, సేవలను నిలిపివేత, అసలేం జరిగింది?

Metro Parking System: గుడ్ న్యూస్.. మెట్రో సరికొత్త పార్కింగ్ సిస్టమ్ సిద్ధం, మనుషులతో పనేలేదు!

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Big Stories

×