BigTV English

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Accident in Hyderabad: ప్రాణం తీసిన మితిమీరిన వేగం..  రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Accident in Hyderabad Students Died: హైదరాబాద్ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో టిప్పర్‌ను కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామేన 4.30 గంటల సమయంలో జంక్షన్ వద్ద చోటుచేసుకుంది.


సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కారులో ఇరుక్కున్న వారిని బయటకు తీశారు. ఈ ప్రమాదం తెల్లవారు జామున 4.30 గంటల సమయంలో జరిగిందన్నారు. ఈ ప్రమాదానికి కారు మితిమీరిన వేగంతో నడపడంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు నిర్ధారించారు.

వివరాల ప్రకారం.. ఈ ప్రమాదంలో గాయపడిన వాళ్లంతా ఇంజనీర్స్ అన్నారు. సిరి, గౌతమ్, సుదీప్ లకు గాయాలు కావడంతో స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.


Also Read: రాఖీ పండుగ వేళ టీఎస్ఆర్టీసీ శుభవార్త

ఇదిలా ఉండగా, పెద్దపల్లి జిల్లాలోని గోదావరిఖని గంగానగర్ రాజీవ్ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. వీరు మంచిర్యాల నుంచి గోదావరిఖనికి వెళ్తుండగా..లారీ ఢీకొట్టింది. ఇద్దరూ మంచిర్యాలలో ఓ షాపింగ్ లో పనిచేస్తున్నట్లు సమాచారం.

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×