BigTV English

Ex MLA Jeevan Reddy | బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షాపింగ్ మాల్‌కు నోటీసులు.. రూ.8 కోట్ల బకాయిలు!

Ex MLA Jeevan Reddy | బిఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి చెందిన షాపింగ్ మాల్ కు ఆర్టీసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో ఉన్న ఈ షాపింగ్ మాల్ దాదాపు రూ.8 కోట్లు బకాయిలు వెంటనే చెల్లించాలని లేకపోతే షాపింగ్ మాల్ సీజ్ చేస్తామని అధికారులు మాల్ ఎదుట మైక్‌లో అనౌన్స్‌మెంట్ చేశారు. దీంతో మాల్‌ లోపల వ్యాపారం చేసుకుంటున్న వారు అయోమయంలో పడ్డారు.

జీవన్ రెడ్డి షాపింగ్ మాల్ కు విద్యుత్ సరఫరా కూడా నిలిపివేశారని సమాచారం. విద్యుత్ శాఖకు కూడా రూ.2 కోట్ల బకాయిలు ఉన్నాయని.. గతంలోనే విద్యుత్తు నోటీసులు అందాయని తెలిసింది. జీవన్ రెడ్డి అధికార దుర్వినియోగం కారణంగానే బకాయిలు కోట్ల రూపాయల మేర ఉన్నాయని స్థానికంగా చర్చ జరుగుతోంది.

అయితే ఇటీవల ఆర్మూర్‌లో బిజేపీ అభ్యర్థి రాకేశ్ రెడ్డి ఎమ్మేల్యేగా ఎన్నికయ్యారు. ఆయన విజయం సాధించిన వెంటనే ఆర్మూర్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు. ఆ ర్యాలీ ఆయన మాట్లాడుతూ.. ​ఆర్టీసీకి మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి
బకాయిపడ్డ మొత్తాన్ని నెల రోజుల్లో చెల్లించాలని, లేదంటే షాపింగ్ మాల్ సీజ్ చేస్తామని హెచ్చరించారు. జీవన్ రెడ్డి అధికార దుర్వినియోగం చేశారని.. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఆర్మూర్ లో అరాచకాలకు పాల్పడ్డారని ఆరోపణలకు చేశారు. అందుకే సిట్టింగ్ ఎమ్మెల్యేని ప్రజలు మూడో స్థానానికి పరిమితం చేశారని ఎద్దేవా చేశారు.

Related News

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Krithi Shetty: లైంగిక వేధింపులపై ఉప్పెన బ్యూటీ ఊహించని కామెంట్స్.. అది కావాలంటూ..!

Big Stories

×