E-Paper
Advertisement

Excise Promotions: ఎనిమిది యేండ్లుగా.. ఎక్సైజ్ శాఖలో కనిపించని బదిలీలు..!

Excise Promotions: ఎనిమిది యేండ్లుగా.. ఎక్సైజ్ శాఖలో కనిపించని బదిలీలు..!
Advertisement

Excise Promotions: స్వేచ్ఛ బ్యూరో: యేండ్లు గడుస్తున్న ఉద్యోగంలో తృప్తి లేదు. పనిచేసిన చేయకపోయినా ఉన్నత అధికారులతో లాలూచి పడే ఉద్యోగులకే బదిలీలు, పదోన్నతి. ఎక్సైజ్ నిబంధనలను పక్కకు పెట్టి కేవలం అనుకూల వ్యక్తులకే బదిలీల్లో అవకాశాలు కల్పిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో ఉన్న ఎక్సైజ్ శాఖ కానిస్టేబుల్ల్లో రెండు వర్గాలుగా వీడిపోయినట్లు తెలుస్తుంది. ఒక వర్గం మెరిట్.. మరో వర్గం సీనియారిటి అని వాదిస్తున్నారు. గత కొన్నేండ్లుగా కనీసం బదిలీలు లేక అవస్థలు పడుతున్నారని సమాచారం. ప్రభుత్వంలోని పెద్దలు నిబంధనలకు విరుద్ధంగా, అనుకూలంగా వ్యవహారిస్తారా వేచి చూడాలిసిందే.

ఖాళీలను భర్తీ చేయడంలో నిర్లక్ష్యం..

ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రమోషన్లలో గందరగోళం నెలకొంది. గత ఎనిమిది ఏళ్లుగా జిల్లాలో ఎక్సైజ్ కానిస్టేబుల్స్ బదిలీలు, ప్రమోషన్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. జిల్లాలో ఇప్పటికే 45 ఎక్సైజ్ కానిస్టేబుల్ ఖాళీలు ఉండగా వాటిని భర్తీ చేయడంలోనూ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా ఈ ఎక్సైజ్ కానిస్టేబుళ్ల ప్రమోషన్లలో సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని కొందరీ వాదనైతే… అదే కాదు మెరిట్ ప్రకారమే ప్రమోషన్లు ఇవ్వాలని మరికొందరు కానిస్టేబుళ్లు డిమాండ్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒకవైపు ప్రమోషన్ల గొడవ ఒకటైతే.. అసలు 8 ఏళ్లుగా జిల్లాలో బదిలీలు లేక చాలామంది కానిస్టేబుళ్లు ఆందోళనకు గురవుతున్నారు. ఈ సమస్య ఎక్సైజ్ కమిషనర్ వద్ద ఉన్నప్పటికీ ఆయన తనకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Advertisement

Also Read: Manoj and Mounika: మూడేళ్ల వివాహ బంధం.. నెక్ట్స్ స్టెప్ ఇదేనా?

ప్రమోషన్లు రాక అసహానానం..

తెలంగాణలోని అన్ని జిల్లాల్లో సీనియార్టీ ప్రకారమే ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు జరిగినప్పటికీ రంగారెడ్డి జిల్లాలో మాత్రం ప్రమోషన్లలో ఈ గందరగోళం నెలకొంది. రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల పరిధి(సి డి -6)లో ఈ సమస్యతో వెల్ల తరబడి పనిచేస్తున్న ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ప్రమోషన్లు రాక అ సహానానికి గురవుతున్నారు. కొందరు ఎక్సైజ్ కానిస్టేబుళ్లు ఈ సమస్య వల్ల హెచ్ ఆర్ ఏ కోల్పోతున్నట్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సమస్య పరిశీలించిన హైకోర్టు ఏజ్ ఆఫ్ సీనియారిటీ ప్రకారం ప్రమోషన్లు ఇవ్వాలని ఆదేశాలు ఉన్నప్పటికీ అధికారులు మాత్రం అవేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ఈ సమస్యను కోర్టులోనే తేల్చుకోవాలని ఎక్సైజ్ హైదరాబాద్ నోడల్ సుపరిండెంట్ పంచాక్షరి చెబుతున్నట్లు విమర్శలున్నాయి.

సీనియార్టీ ప్రకారమే..

Advertisement

ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు లేక పోవడంతో పాటు కొత్త నియమకాలు కూడా లేకపోవడంతో పరిస్థితి గందరగోళంగా మారిందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఎక్సైజ్ కమిషనర్ ఈ సమస్యను పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీనియార్టీ ప్రకారమే ఎక్సైజ్ కానిస్టేబుల్ ఆ ప్రమోషన్లు జరుగుతున్నప్పటికీ ఓ యూనియన్ నాయకుడు మెరిట్ వాదనను తీసుకొచ్చి అక్రమ మార్గంలో ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రమోషన్లు పొందేటట్లు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. మరో రెండు మూడు ఏళ్లలో పదవి విరమణ పొందబోతున్న చాలామంది ఎక్సైజ్ కానిస్టేబుల్ ప్రమోషన్లకు నోచుకోలేకపోతున్నామని, ఇప్పటికైనా ఎక్సైజ్ కమిషనర్ ఈ సమస్యను పరిశీలించి న్యాయం చేయాలని కోరుతున్నారు.

Also Read: Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు నుంచి ఎగిరిపడ్డ ప్రయాణికులు, స్పాట్‌లో ఎనిమిది మంది

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×