BigTV English

Falaknuma Express: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ రైలు వీల్ బ్రేక్ ఫెయిల్.. తప్పిన ప్రమాదం!

Falaknuma Express: ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ రైలు వీల్ బ్రేక్ ఫెయిల్.. తప్పిన ప్రమాదం!

Falaknuma Express latest news(Telangana news today): మిర్యాలగూడ స్టేషన్‌లో ఫలక్‌నుమా సూపర్ ఫాస్ట్ రైలును నిలిపివేశారు. ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు హౌరా నుంచి సికింద్రాబాద్ వెళ్తుండగా..సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో రైల్వే అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే ఆ రైలును నల్గొండ జిల్లాలోని మిర్యాలగూడ రైల్వే స్టేషన్‌లో నిలిపివేశారు.


వీల్ బ్రేక్ కావడంతోనే ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలును నిలిపివేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటల సమయంలో మిర్యాలగూడకు వచ్చిన ఫలక్ నుమా సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్‌లోని ఓ బోగీలో సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన రైల్వే గాడ్ వెంటనే రైలును అక్కడే నిలిపివేసి ఉన్నతాధికారులకు సమాచారం అందించాడు.

గుంటూరులోని ఇంజినీరింగ్ అధికారుల బృందం హుటాహుటిన మిర్యాలగూడ రైల్వేస్టేషన్ వద్దకు చేరుకున్నారు. ఈ మేరకు మరమ్మతు పనులు చేపట్టారు. కాగా, బోగీలో నెలకొన్న సాంకేతిక సమస్యను గుర్తించారు. వీల్ బ్రేక్ దెబ్బతిందని వెల్లడించారు. ప్రస్తుతం వీల్ బ్రేక్ సరిచేస్తున్నట్లు.. ఈ సాంకేతిక లోపాన్ని సరిచేసిన తర్వాతనే రైలు బయలుదేరుతుందని రైల్వే సిబ్బంది తెలిపాడు.


మిర్యాలగూడలో రైల్వేను అకస్మాత్తుగా నిలిపివేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు అసహనం వ్యక్తం చేశారు. కొంతమంది రైల్వే అధికారులతో ఘర్షణకు దిగారు. సాంకేతిక సమస్య కారణంగా నిలిపివేసినట్లు అక్కడ ఉన్న సిబ్బంది సర్దిచెప్పారు. ఎంత సమయం పడుతుందని అధికారులు చెప్పకపోవడంతో కొంతమంది ప్రయాణికులు రోడ్డు మార్గాన వెళ్లిపోయారు.

Also Read: ఢిల్లీకి బీఆర్ఎస్ అగ్రనేతలు.. కవిత బెయిల్ కోసం?

అంతకుముందు ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్‌లో అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. జూలై 7న బెంగాల్ నుంచి సికింద్రాబాద్ వస్తున్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్‌లోని ఎస్4 బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యాదాద్రి భువనగిరి జిల్లాలోని పగిడిపల్లి, బొమ్మాయిపల్లి వద్ద ఉదయం 10 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనలో ఏడు బోగీలు దగ్ధమయ్యాయి. ఆ సమయంలో ప్రయాణికులు లోకోపైలట్ అప్రమత్తతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ముందుగా బోగీలో పొగలు, మంటలు వ్యాపించడంతో ఓ ప్రయాణికుడు చైన్ లాగి రైలును నిలిపివేసిన సంగతి తెలిసిందే.

Tags

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×