Falcon Group Scam: అధిక వడ్డీ ఆశ చూపి పెద్ద ఎత్తున డిపాజిట్లు సేకరించి.. మోసానికి పాల్పడిన ఫాల్కన్ గ్రూప్ సీఓఓ ఆర్యన్ సింగ్‌ను అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లో ఆయనన అదుపులోకి తీసుకున్నట్లు సీఐడీ పోలీసులు తెలిపారు. ఫాల్కన్ సంస్థ 7 వేల 56 మంది డిపాజిట్ దారుల నుంచి రూ.4215 కోట్లు వసూలు చేసింది. డిపాజిట్ దారులకు రూ. 792 కోట్లు మోసం చేసింది. చిన్న మొత్తం పెట్టుబడితో భారీ లాభాలంటూ ఆ సంస్థ చేసిన ప్రచారంతో పెద్ద ఎత్తున జనం పెట్టుబడులు పెట్టారు. భారీగా డిపాజిట్లు సేకరించిన తర్వాత ఫాల్కన్ సంస్థ మోసానికి పాల్పడింది. ఇప్పటికే ఈ సంస్థ సీఈఓ ను కూడా తెలంగాణ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. అటు బాధితులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.
ఈ మోసం వెనుక ఉన్న ప్రధాన నిర్వాహకులుగా అమర్‌దీప్ కుమార్, ఆర్యన్ సింగ్, యోగేందర్ సింగ్, పవన్ కుమార్ ఓదెల, కావ్య నల్లూరిల పేర్లు బయటకు వచ్చాయి. వీరిలో పవన్ కుమార్ వైస్ ప్రెసిడెంట్‌గా, కావ్య నల్లూరి డైరెక్టర్‌గా వ్యవహరించారు. Capital Protection Force Pvt. Ltd. అనే సంస్థను రెజిస్టర్ చేసి, దానికి అనుబంధంగా మరికొన్ని ఫాల్కన్ కంపెనీలను స్థాపించారు.
ఈ ముఠా అత్యంత వ్యూహంతో ముందుకెళ్లింది. బ్రిటానియా, అమెజాన్, గోద్రేజ్ వంటి బ్రాండ్లతో సంబంధాలున్నాయని నమ్మబలికారు. వీరి ఇన్‌వాయిస్‌లను డిస్కౌంట్ చేస్తూ పెట్టుబడి పెట్టితే 15-20% వడ్డీ వస్తుందని ప్రకటించారు. రూ.25 వేల నుంచి రూ.9 లక్షల వరకు వేర్వేరు ఇన్వాయిస్ ప్లాన్‌లు అందుబాటులో ఉంచారు. 2021 నుండి డిపాజిట్లు సేకరణ ప్రారంభించారు.
ప్రారంభంలో సక్రమంగా వడ్డీలు చెల్లించారు. దీని వల్ల మరింత మంది పెట్టుబడిదారులు ఆకర్షితులయ్యారు. కానీ కొన్ని నెలలుగా చెల్లింపులు నిలిపివేశారు. అసలు డబ్బు ఇవ్వడం కూడా ఆపేశారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
CID దర్యాప్తులో షాకింగ్ నిజాలు
CID అధికారులు చేపట్టిన విచారణలో డబ్బును 14 ఇతర కంపెనీల్లోకి మకాం మార్చారని, అవి కూడా వీరి కంట్రోల్‌లో ఉన్న సంస్థలేనని వెల్లడైంది. ఆ సంస్థల్లో ఆర్థిక లావాదేవీలను ట్రేస్ చేయడానికి ప్రత్యేక ఆడిట్ బృందాలను నియమించారు. లక్షలాది రూపాయల విలువైన డాక్యుమెంట్లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, డిజిటల్ ఆధారాలు స్వాధీనం చేసుకున్నారు.
Also Read: నారా లోకేష్‌తో కేటీఆర్ రహస్య భేటీ.. సంచలన విషయాలు బయటపెట్టిన సామ రామ్మోహన్ రెడ్డి
ప్రభుత్వం స్పందన, హెచ్చరిక
ఈ ఘటనపై ప్రభుత్వం సీరియస్‌గా స్పందించింది. డిపాజిట్ బోర్డు, కంపెనీ చట్టాల కింద కేసులు నమోదు చేశారు. ప్రజలను ఇటువంటి హై రిటర్న్ వాగ్దానాల్ని నమ్మవద్దని, ఎప్పుడూ RBI/SEBI ద్వారా గుర్తింపు పొందిన కంపెనీలకే పెట్టుబడి పెట్టాలని హెచ్చరిస్తున్నారు.