అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ నెలకొంది. ఓ ప్రమాదంలో మహిళ చనిపోవడంతో.. ఈ గ్యాంగ్‌కు అసలు విషయం తెలిసింది. ఈ విషయం తెలిసిన వెంటనే ఇప్పా గ్యాంగ్ మొత్తం ఆగ్రహంతో రగిలిపోయింది. తమ లీడర్‌ని మోసం చేసిన వ్యక్తి ఇక బ్రతకకూడదు అంటూ అర్షద్ టోపిని చంపేందుకు కత్తులతో వీధుల్లో వెతుకుతున్నారు. మరోవైపు సంబంధం పెట్టుకున్న గ్యాంగ్ మెంబర్ బిక్కబిక్కుమంటూ బతుకుతున్నాడు.
నాగ్‌పూర్‌కు చెందిన ఇప్పా గ్యాంగ్‌లో సుమారు 40 మంది సభ్యులున్నారు. వీరందరూ తమ నాయకుడికి అంకితభావంతో ఉండేవారు. కానీ, ఈ గ్యాంగ్ లీడర్ భార్య ఆ వృత్తికి విరుద్ధంగా, అదే గ్యాంగ్‌లో సభ్యుడైన అర్షద్ టోపి అనే వ్యక్తితో.. వివాహేతర సంబంధం కొనసాగించడంతో వ్యవహారం తీవ్ర రూపం దాల్చింది. మూడు రోజుల క్రితం ఆ జంట ఒక బైక్‌పై ప్రయాణిస్తుండగా, జేసీబీని ఢీ కొట్టారు. ప్రమాదంలో గ్యాంగ్‌స్టర్ భార్యకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే ఆమెను నాగ్‌పూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతిచెందింది. ఈ సంఘటన జరిగిన తర్వాతే పోలీసులు వారి మధ్య ఉన్న సంబంధాన్ని బయటపెట్టారు. ఇలా, ఆమె మరణం కారణంగా గ్యాంగ్ సభ్యులకు ఈ గుట్టు రట్టయింది.
Also Read: ఈ వాట్సాప్ మెసేజ్ ఓపెన్ చేశారో.. బతుకు బస్టాండే!
ఈ క్రమంలో గ్యాంగ్‌లోని ఇతర సభ్యులంతా అర్షద్‌ను చంపేందుకు తిరుగుతున్నారు. ఎక్కడ దొరికితే అక్కడే వేసేద్దామని కత్తులతో వేటాడుతున్నారు. ఈ తరుణంలో తనకు ప్రాణహాని ఉందని అర్షద్ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు అతని వద్ద నుంచి స్టేట్‌మెంట్ రికార్డ్ చేశారు. అయితే మహిళ నిజంగానే ప్రమాదంలో మరణించిందా..? లేక హత్య చేశారా అన్న దానిపై పోలీసులు విచారిస్తున్నారు. మరోవైపు అర్షద్ మాత్రం.. ఎప్పుడు.. ఎవరు.. ఏ వైపు నుంచి వచ్చి అటాక్ చేస్తారో తెలియక ప్రాణభయంతో కాలం వెల్లదీస్తున్నాడు.