Big Stories

FarmHouse case: వివరాలు ఇవ్వండి.. కాస్త ఆగండి.. ‘సిట్ వర్సెస్ సీబీఐ’

FarmHouse case: ఫాంహౌజ్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు. అనూహ్య మలుపులు తిరుగుతోంది. కేసు సీబీఐకి అప్పగించడంపై హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు ఆసక్తికర పరిణామాలు జరుగుతున్నాయి. ధర్మాసనం ముందు కీలక వాదనలు జరిగాయి. ప్రభుత్వమేమో ‘సిట్’ చాలు అంటోంది.. ప్రతివాదులేమో సీబీఐనే కావాలంటోంది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుతో రంగంలోకి దిగిన సీబీఐయేమో.. తమకింకా కేసు వివరాలే ఇవ్వట్లేదంది. ఇలా ట్రయాంగిల్ వాదనల మధ్య కేసు విచారణ సోమవారానికి వాయిదా పడింది.

- Advertisement -

సీఎం కేసీఆర్ సిట్ విచారణను ప్రభావితం చేస్తున్నారని.. ఆయన ప్రెస్ మీట్ పెట్టడం అందులో భాగమేనని ప్రతివాదుల వాదన. బీఆర్ఎస్ సైతం పలువురు ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందంటూ.. ఇప్పటి వరకూ వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల జాబితాను కోర్టు ముందుంచారు. దీనిపై ప్రభుత్వ తరఫు లాయర్ కూడా గట్టి కౌంటర్ ఇచ్చారు. బీజేపీ 10 రాష్ట్రాల్లో ప్రభుత్వాలను పడగొట్టిందని.. తెలంగాణలోనూ అదే పని కోసం ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూశారంటూ వాదించారు. బీజేపీ ఏ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చలేదని, ఏ ఎమ్మెల్యేనూ కొనుగోలు చేయలేదని డిఫెన్స్ లాయర్ అన్నారు. మధ్యలో జోక్యం చేసుకున్న ధర్మాసనం.. ఇది బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ కేసు కాదంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

- Advertisement -

హైకోర్టులో సీబీఐ సైతం వాదనలు వినిపించింది. సింగిల్ జడ్జి ఉత్తర్వుల మేరకు.. తాము కేసు వివరాలు ఇవ్వాలంటూ తెలంగాణ సీఎస్ కు లేఖ రాశామని తెలిపింది. అయితే, సిట్ తమకు ఎలాంటి డాక్యుమెంట్లు ఇవ్వడం లేదని.. వివరాలు ఇస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని హైకోర్టుకు తెలిపింది సీబీఐ.

అయితే, డివిజన్ బెంచ్ లో విచారణ పూర్తయ్యే వరకూ ఆగాలంటూ సీబీఐకి సూచించింది ధర్మాసనం. సీబీఐ వాదనలు కూడా వింటామంటూ.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సోమవారానికి వాయిదా వేసింది హైకోర్టు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News