E-Paper
Advertisement

Fire accident: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం.. గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు

Fire accident: చిక్కడపల్లిలో అగ్నిప్రమాదం.. గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు
Advertisement

Fire accident: హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విఎస్‌టీలోని ఓ గోదాంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు వ్యాపించాయి. గోదాంలో ఉన్న శుభకార్యాలకు ఉపయోగించే డెకరేషన్ సామాగ్రి మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. గోదాం పరిసరాల్లో బస్తీలు ఉండడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.

స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పుతున్నారు. నాలుగు ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

కాగా, ఇటీవల సికింద్రాబాద్‌లోని డెక్కన్‌ మాల్‌లో అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. దాదాపు మూడు రోజుల పాటు భవనంలో మంటలు చెలరేగాయి. ఆ భవనంలో ముగ్గురి ఆచూకీ గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది.

Tags

Related News

ఢిల్లీ పీజీ హాస్టల్ భవనం ఘటన.. పెరుగుతున్న మృతులు, సీసీటీవీలో కీలక విషయాలు, శిథిలాల కింద ఇంకా

Nindu Noorella Saavasam Serial Today Episode September 7th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: మిస్సమ్మను చంపేందుకు సాగర్ కి బయలుదేరిన మను

Ninnu kori Serial Today Episode September 7th ‘నిన్నుకోరి’ సీరియల్‌: ఇంట్లో నిజం చెప్పిన విరాట్ 

Karthika Deepam 2 Serial Today Episode September 5th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌:  సూరజ్ ను అనుమానించిన మాలిని         

Ninnu kori Serial Today Episode September 2nd ‘నిన్ను కోరి’ సీరియల్‌: ఎంగేజ్ మెంట్ క్యాన్సిల్ చేసేందుకు శృతి తిప్పలు     

Gundeninda GudiGantalu Today episode: ప్రభావతికి మీనా స్ట్రాంగ్ వార్నింగ్.. కామాక్షి దెబ్బకు అవుట్.. మౌనికకు షాక్..

Karthika Deepam 2 Serial Today Episode August 26th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పెళ్లికి ముందు జ్యోకు సీక్రెట్ గిఫ్ట్ ఇచ్చిన సూరజ్        

Brahmamudi Serial Today Episode August 14th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: కంపెనీ లాభాల గురించి చెప్పిన రాజు 

Big Stories

Advertisement
×