BigTV English

Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident: హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం..

Fire Accident: వరుస అగ్నిప్రమాదాలతో హైదరాబాద్‌ భగ్గుమంటోంది. సికింద్రాబాద్ డెక్కన్ మాల్ భవన్‌లో చోటుచేసుకున్న అగ్నిప్రమాదం మరువక ముందే ఇటీవల మళ్లీ సికింద్రాబాద్‌లో స్వల్నలోక్ కాంప్లెక్స్‌లో మరో ప్రమాదం జరిగింది. ఈ మంటలు ఇంకా చల్లారక ముందే మళ్లీ ఓ అగ్నిప్రమాదం సంభవించింది. మైలార్ దేవిపల్లి శాస్త్రిపురంలోని ఓ ప్లాస్టిక్ గోదాంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.


క్షణాల్లోనే మంటలు ఎగిసిపడి ఆ ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్మేశాయి. దీంతో స్థానికులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేస్తున్నారు. ఫైరింజన్ల సాయంతో మంటలను ఆర్పుతున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు ప్రాథమికంగా నిర్దారణకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని సమాచారం. ఆస్థినష్టం మాత్రం భారీగా సంభవించినట్లు తెలుస్తోంది. గోదాంలోని విలువైన సామాగ్రితో పాటు రెండు డీసీఎం వాహనాలు దగ్ధమయ్యాయి.

ఇక గురువారం స్వల్పలోక్ కాంప్లెక్స్‌లోని ఎనిమిదో అంతస్థులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా ఆ మంటలు 7, 6, 5 అంతస్థలుకు వ్యాపించాయి. వెంటనే ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని 15 ఫైర్ ఇంజిన్ల సాయంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఐదో అంతస్థులో కాల్ సెంటర్లో పనిచేస్తున్న ఆరుగురు దుర్మరణం చెందారు.


Kadamba Tree:ఆంజనేయుడి పుట్టుక వెనుక కదంబ వృక్షం!

Robots:వర్క్ ప్రెజర్ నుండి బయటపడేసే రోబోలు

Tags

Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×